Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
భార్యాభర్తలు ఫేస్ చేసే కామన్ కమ్యునికేషన్ ప్రాబ్లమ్స్
ఏ రిలేషన్ లో అయినా.. కమ్యునికేషన్ అనేది చాలా అవసరం. పని విషయంలో అయినా, పర్సనల్ విషయంలో అయినా.. కమ్యునికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆలోచనలు, అభిప్రాయాలను తెలపడానికి కమ్యునికేషన్ చాలా అవసరం. ఒకవేళ రిలేషన్ లో ఇది మిస్ అయిందంటే.. సమస్యలకు కారణమవుతుంది.
సాధారణంగా రిలేషన్ లో సమస్యలకు కారణమయ్యే కమ్యునికేషన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చిన్న మాటతో.. తర్వాత వచ్చే సమస్యలను అరికట్టవచ్చు. కమ్యునికేషన్ అనేక సమస్యలకు పరిష్కారం కూడా. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య చిన్న సమస్య వచ్చినా.. దానికి ఎవరో ఒకరు స్పందించి మాట్లాడితే.. ఇద్దరి మధ్య ఉండే గ్యాప్ ని ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఇద్దరూ.. మొండిగా మాట్లాడకుండా వ్యవహరిస్తే మాత్రం.. సమస్యలు, గొడవలు పెరుగుతాయే గానీ.. తగ్గవు.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలను చక్కగా పరిష్కరించుకునే మార్గం కమ్యునికేషన్. కాబట్టి.. భార్యాభర్తలు ఎదుర్కొనే కామన్ కమ్యునికేషన్ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పర్సనల్ విషయాలు అడగకపోవడం
మీ భాగస్వామిని కనీసం ఇవాళ ఎలా గడిచింది వంటి చిన్న చిన్న ప్రశ్నలు కూడా అడగకపోవడం మంచిది. ఇలాంటి చిన్న క్వశ్చన్ ద్వారా.. మీకు మీ భాగస్వామి చాలా ముఖ్యమన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలా కమ్యునికేషన్ గ్యాప్ ని ఫిల్ చేసుకోవచ్చు.

తరచుగా అయినా ఐలవ్ యు చెప్పకపోవడం
మీ భాగస్వామికి రాత్రి నిద్రకు ముందు అప్పుడప్పు ఐ లవ్ యూ చెప్పడం చాలా ఇంపార్టెంట్. కనీసం రోజుకి ఒక్కసారి ఈ మాట చెప్పడం వల్ల మీతో జీవితాన్ని పంచుకోవడాన్ని హ్యాపీగా ఫీలవుతారు.

ప్రాబ్లమ్స్ గురించి
మీ సమస్యల గురించి వెంటనే చర్చించకపోతే.. ఈ చిన్న సమస్య చాలా పెద్దగా మారే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయడం మానేసి.. ఏ నిమిషానికి సంబంధించిన సమస్యను అప్పుడే మీ భాగస్వామితో చర్చించండి.

కమ్యునికేట్ అవకపోవడం
ఇద్దరూ కలిసి ఉన్నారనే కానీ.. అస్సలు మాట్లాడకపోతే.. మీ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండదు. అప్పుడు మీరు మీ భాగస్వామితో కాకుండా.. ఎవరో త తెలియనివాళ్లతో ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి కపుల్స్ మధ్య కమ్యునికేషన్ ఏమాత్రం మిస్ అవకూడదు.

వినకపోవడం
ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినడం చాలా అవసరం. ఇలా వినలేకపోతే.. మీరు ఎదుటివాళ్లతో కమ్యునికేట్ అవడం కష్టం. సమస్య వచ్చినప్పుడు భాగస్వామితో పంచుకుంటే.. ఇద్దరూ కలిసి మాట్లాడితే.. పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి.. ఏ సమస్య వచ్చినా.. భాగస్వామితో కమ్యునికేట్ అవడం చాలా అవసరం.

ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం
కొన్ని సందర్భాల్లో ఆఫీస్ లో ఒత్తిడి లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా.. మూడ్ మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చిరాగ్గా ఉండకుండా.. మీ ఫీలింగ్స్, మీరు మూడీ ఉండటానికి కారణాలను మీ భాగస్వామితో పంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల.. మీ మూడ్ ని మార్చే ప్రయత్నం మీ భాగస్వామి చేస్తారు. ఇలాంటి ఫీలింగ్స్ కంపల్సరీ మీ భాగస్వామితో షేర్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications