Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
భారతీయ పురుషులు ఇంట్లో తమ భార్యలకి ఎలా సహాయపడచ్చు??
భారతీయ పురుషులు స్త్రీలతో పాటు ఇంటి బాధ్యతలని తీసుకోవచ్చు. వారు కనుక ఈ పనిలో మనసుపెడితే అధ్భుతాలు చేస్తారు.ఇల్లు శుబ్రపరచడంలో పురుషులే స్త్రీల కంటే బాగా చేస్తారని తాజా అధ్యయనం ద్వారా నిరూపించబడింది.
ఈ అధ్యయనం ప్రకారం పురుషులు ఇంటి పనుల కోసం పురుష్లు మరింత జాగ్రత్తగా పని చేస్తారని తెలుస్తోంది.
ఉదాహరణకి పురుషుల శారీరక బలం స్త్రీల కంటే ఎక్కువ.అందువల్ల ఒక్క రోజులో ఇల్లంతా శుభ్రపరచాల్సొస్తే కనుక స్త్రీల వలే అలసిపోకుండా వారు ఆ పని సులభంగా చెయ్యగలరు.
కానీ కొంత మంది పురుషులు మాత్రం ఇంటి పనుల బాధ్యత స్త్రీలదే అని గాఢంగా విశ్వసిస్తుంటారు. చూడండి మిస్టర్, కాలం మారింది, మీరు కూడ చెయ్యగలిగే పనులు ఇంట్లో చాలా ఉన్నాయి. ఇంటి పనుల బాధ్యత తీసుకోవడం ద్వారా మీరు అమితంగా ప్రేమించే మీ భార్య కి సహాయపడ్డవారవుతారు.
ఇంట్లో మీ భార్య కి సహాయం చేస్తూ ఆమెకి పనులనుండి కాస్త విశ్రాంతినివ్వాలనుకుంటే కనుక కొన్ని టిప్స్ అనుసరించడం ద్వారా ప్రతీ భారతీయ పురుషుడూ హౌస్ హస్బెండ్ కావచ్చు.అవేమిటో చూడండి.

పిల్లలని చూసుకోవడం:
మీ ఇంట్లో కనుక పిల్లలుంటే వాళ్ళ బాధ్యతనంతా మీ భార్య నెత్తి మీద రుద్దకండి.తన బాధ్యతలని పంచుకోవడం నేర్చుకోండి
మీరు వంట కూడా చెయ్యచ్చు:
సాధారణంగా ఒక నానుండి ప్రాచుర్యంలో ఉంది, స్త్రీ స్థానం వంటింటికే అని.ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్న మారు ఇలాంటి రూల్స్ పాటించడం సిల్లీ గా లేదూ??మీకు కనుక వంట చేయడం ఇష్టమైతే వెంటనే కుకింగ్ ఏప్రాన్ తగిలించుకుని అప్పుడప్పుడు గరిటె తిప్పితే మీ భార్య ముఖం లో ఆనందం వెల్లి విరుస్తుంది

ఫ్లోరింగ్ శుబ్రపరచడం:
మీ ఇంటి ఫ్లోర్ ని ఊడ్చి శుభ్రంగా తుడవడం ద్వారా మీరు పర్ఫెక్ట్ హౌస్ హస్బెండ్ కావచ్చు.మీ భార్య ఇంటి పనుల్లో సాయం చేస్తూ, మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు అందుకుంటూ ఉంటే ఇంట్లో పని సులభం ఆవుతుంది.
పక్క బట్టలు,కర్టెన్లు మార్చడం:
పక్షానికొకసారి దుప్పట్లు, కర్టెన్లు మార్చడం లాంటి పనులు చేయడం ద్వారా మీ భాగస్వామికి మీరు సహాయం చేసిన వారవుతారు.భారతీయ పురుషులు ఇలాంటి పనుల్లో సహాయ పడటం నేర్చుకుంటే తమ వివాహ బంధాన్ని పటిష్టపరచుకున్న

దుమ్ము దులపడం:
ఫర్నీచర్ ని శుబ్రపరచడం లేదా టేబుల్స్ మీద దుమ్ము దులపడం లాంటి పనుల ద్వారా మీరు బెస్ట్ హౌస్ హస్బెండ్ అనిపించుకోవచ్చు.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనుసరించడం ద్వారా మీ భార్యా తాను చాలా లక్కీ అనుకునేట్లు చెయ్యగలరు. నిజం, మా మాట నమ్మండి.



Click it and Unblock the Notifications
