Latest Updates
-
జూన్ 17-23 వార ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం.. మీ రాశి ఉందా? -
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.!
స్వీట్ రిలేషన్ లో సమస్యలొస్తే.. విడాకులే పరిష్కారమా ?
స్వీట్ రిలేషన్స్ స్వీట్ గా ఉంటాయి. కానీ.. చిన్న చిన్న సమస్యలకు సర్ధుకోకపోతే చేదుగా మారిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, సమస్యలు వచ్చినప్పుడు చర్చించుకోవడం, సహనంతో మాట్లాడటం, ఓపికగా వివరాలు అడిగితెలుసుకోవడం, ఎదుటివాళ్ల ఆలోచనలకు విలువ ఇవ్వడం వంటివి చాలా అవసరం. అప్పుడు ఇద్దరి మధ్య బాంధవ్యం బలపడుతుంది. విడిపోవాలనే ఆలోచన దరిచేరదు. ఒకవేళ మీకు ఇలా విడిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎలాంటి విషయాలపై కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న మార్పులు మీ స్వీట్ రిలేషన్ ని వందేళ్లు కాపాడతాయి.

మీడియేటర్:
భార్యభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు.. పదేపదే మాట మాట వాదించుకోకూడదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ద్వారా మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గేలా జాగ్రత్త పడాలి. ఒకరిపై ఒకరికి కోపం పెరగకుండా ఉండటానికి ఇదో చక్కటి మార్గం.
కారణాలు:
మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణాలేంటో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. విడాకులు తీసుకునే వరకు పరిస్థితి ఎందుకు వెళ్లిందో ముందుగానే గ్రహించడం మంచిది. ఈ కారణాలను ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. సర్ధుకోవాల్సిన ఉంటే అడ్జెస్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ పిల్లలు ఉంటే.. వాళ్ల గురించి ఆలోచించాలి. మీరు విడిపోతే.. వాళ్ల భవిష్యత్ ఎలా ఉంటుంది ? అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.
డబ్బుకి ఉన్న విలువ మీ బాంధవ్యాన్ని దెబ్బతీస్తుందా ?
వేరువేరుగా ఉండగలమా:
పెళ్లయ్యాక భార్యాభర్తలుగా.. అన్యోన్యంగా గడిపిన మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండగలరా అని ఒక్కసారి ఆలోచించాలి. మీ భాగస్వామి లేకుండా.. జీవితం గడపగలమా అని ఒక్కసారి పునరాలోచించాలి. ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు మీ ఇద్దరి మధ్య ఇంతకాలం రిలేషన్ ఎలా నడిచిందో గుర్తు చేసుకుంటే మంచిది.

ఇష్టమేనా:
విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా.. లేక మీ భాగస్వామిని బెదిరించడానికో, భయపెట్టడానికో, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారేమో ఒక్కసారి బాగా ఆలోచించాలి. ఒక్కోసారి చుట్టూ ఉన్న పరిస్థితులు మీపై ప్రభావం చూపుతాయి. కోపం, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత మీ జీవితంలో తీరని లోటు తీసుకొస్తాయి. కాబట్టి.. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు.. ఆచి తూచి అడుగేయాలి.



Click it and Unblock the Notifications