Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఇండియన్ కపుల్స్ గొడవకు కారణమయ్యే క్రేజీ రీజన్స్ ?
ఇండియన్స్ అంటేనే క్రేజీ. అందులోనూ కపుల్స్ మరీ క్రేజీగా ఉంటారు. ఎందుకంటే.. వాళ్లు తరచుగా గొడవపడుతూ ఉంటారు. వెస్ట్రన్ కపుల్స్ కంటే.. ఇండియన్ కపుల్స్ చాలా ఎక్కువగా గొడవపడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా చాలా సిల్లీ విషయాలకు, చిన్న చిన్న విషయాలకు గొడవలకు దిగుతారట. దీంతో.. ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలే.. విడాకులకు కారణమవుతోందట.

అయితే ఇలా ప్రతి చిన్న విషయానికీ గొడవ పడటం కంటే.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే.. సమస్యల గురించి చర్చించుకుంటే.. రిలేషన్ లో ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. ఇండియన్ కపుల్స్ మధ్య గొడవలు మామూలుగా ఉండవు.
భారతీయ జంటలు నిజానికి వారి పెళ్లి రోజు రాత్రి చేసే 10 పనులు
ఒక్కసారి ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందంటే.. పదాలు పరుగుపెడతాయి. ఏం మాట్లాడుతున్నారో కూడా మరిచిపోయి మరీ.. గొడవపడేస్తారు. కాబట్టి గొడవపడే సమయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అలాగే.. ఏం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. లేకపోతే.. ఎదుటివాళ్లు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కట్నం, పిల్లల గురించే ఎక్కువగా భార్యాభర్తలు ఎక్కువగా గొడవపడతారని చాలా మంది భావిస్తారు. కానీ అది తప్పు. ఇండియన్ కపుల్స్ చాలా విషయాల్లో గొడవ పడుతుంటారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఆర్టికల్ చదవాల్సిందే..

ఫైనాన్షియల్
భార్యభర్తల మధ్య గొడవలకు డబ్బు చాలా సందర్భాల్లో విబేధాలు క్రియేట్ చేస్తుంది. డబ్బు విషయంలో గొడవ పడాల్సి వస్తే.. ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకరితో ఒకరు ఆలోచనలు పంచుకోవాలి. కానీ.. డబ్బు విషయంలో ఇతరులు తలదూర్చితే.. గొడవలకు కారణమవుతుంది.

పిల్లలు
ఫ్యామిలీలో పిల్లలే స్పెషల్ ఎట్రాక్షన్. కానీ.. వాళ్ల విషయానికి వస్తే.. భార్య భర్తల మధ్య గొడవలకు దారితీస్తుంటుంది. పేరెంట్స్ ఇద్దరూ పిల్లల కేర్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒకరిపైనే బాధ్యత నెట్టేస్తే.. వ్యాగ్వాదాలు మొదలవుతాయి.

అత్తమామలు
అత్తమామలు, బంధువులు భార్యభర్తల విషయంలో తలదూర్చడం వల్ల.. గొడవలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి.. మీ ఇద్దరి విషయంలో మూడో వ్యక్తి లేకుండా.. జాగ్రత్త పడండి. కొన్ని విషయాలను భార్యాభర్తలే చర్చించుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.

ఇంటి పనులు
ఇంటి పనులను ఇద్దరూ షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇద్దరూ వర్క్ చేసేవాళ్లైతే.. అన్ని పనులు ఇద్దరూ కలిసి చేసుకుంటే.. గొడవలు రాకుండా ఉంటాయి.

వెకేషన్
వెకేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఇద్దరూ కాంప్రమైజ్ అవ్వాలి. ఒకరి ఫ్యామిలీతో.. మరొకరు కలిసి ఉండటానికి ఇష్టపడాలి. అప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి.

గతంలో విషయాలు
గతంలో జరిగిన విషయాలు ఇప్పుడు ఇద్దరి మధ్య రాకుండా చూసుకోవాలి. అవి మీ రిలేషన్ ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి.. గతంలో జరిగిన గొడవల ప్రస్తావన తీసుకురాకండి.

ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాలని ప్లాన్ చేసేటప్పుడు.. సరైన పద్ధతిలో మీ భాగస్వామికి వివరించాలి. అలాగే.. మీతో మీ భాగస్వామి గడపాలి అనుకున్నప్పుడు వ్యతిరేకించరాదు. ఇలాంటి చిన్న చిన్న కాంప్రమైజ్ ల వల్ల మీ లైఫ్ లో గొడవలు దూరంగా ఉంటాయి. దంపతులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం రాజీ పడటం.



Click it and Unblock the Notifications
