Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
మీరు మీ భార్యతో ఎప్పటికీ ఎందుకు వాదులాడకూడదో తెలుసా??
స్త్రీలు సహనంతో ఉండాలి అనుకునే రోజులు కావివి. ఈ రోజుల్లో మగవాళ్లు సహనంతో ఉండాలి. ఎందుకంటే ఈ జనరేషన్ స్త్రీలు అనేక బాధ్యతలు ఒకేసారి నిర్వర్తిస్తూ ఒత్తిడికి గురి అవుతున్నారు.
వీటికి తోడు స్త్రీలకి సహజంగా ఉండే హార్మోన్ సమస్యలం వల్ల ఒక్కోసారి వారు చాలా కోపానికి లోనవుతుంటారు. కాబట్టి స్త్రీలతో వాదించడం సమంజసం కాదు. తెలివైన పురుషుడెప్పుడూ.. కోపంలో స్త్రీ అన్న మాటలని పట్టించుకోడు. స్త్రీ అలా ఎందుకు అనిందో, అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు తెలివైన వాళ్లు అనిపించుకోగలుగుతారు. అలాగే పోట్లాటల వల్ల లాభం లేకపోవడంతోపాటు అందమైన వివాహ బంధం దెబ్బతింటుందని గ్రహించాలి.
మీ ఆలోచనలని ఆమె మీద రుద్దడం లేదా ఆమెకి సహకరించకపోవడం లాంటి పనులు మీ వివాహ జీవితాన్ని మరింత జటిలం చేస్తాయి. ఇంకొక ముఖ్య విషయం ఈగో. ఈ ఈగో వల్లే ఒక్కోసారి వాదనలు ఎక్కువవుతాయి. దీనివల్ల మనసు మరింత గాయపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాదనలు వస్తాయనే అనిపించిన వెంటనే సర్దుకుపోతే.. మీ మ్యారేజ్ లైఫ్ మరింత అందంగా ఉంటుంది. మీరు మీ భార్యతో వాదులాడటం నిష్ప్రయోజనమని చెప్పడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆమె ఎప్పటికీ అర్ధం చేసుకోలేదు:
ఒక వ్యక్తి కనుక వాదులాడే మూడ్‌లో ఉంటే వారు వారి భావాలని తెలియజేయాలి. మీ భార్య అలాంటి మూడ్‌లో ఉంటే నిశ్శబ్దంగా ఉండండి. ఆమెని మాట్లాడనివ్వండి. మీరు కూడా అప్పుడే ఎదురు దాడి మొదలెడితే ఆమె మీ పాయింట్ ని అర్ధం చేసుకోలేరు.

అపరిపక్వతకి గుర్తు:
మీరు ఇప్పుడు ఇంకా అబ్బాయి కాదు. ఇప్పుడు మీరు పరిపూర్ణమయిన మగవారు. అలాంటివారు పరిపక్వతతో వ్యవహరిస్తారు. తెలివైన పురుషులెప్పుడూ వృధా వాదనలు చేయరు. అందువల్ల మీ నాలుకని అదుపులో పెట్టుకుని ప్రశాంతంగా ఉండండి.

వాదన ఏ సమస్యకీ పరిష్కారం కాదు:
మానవ చరిత్ర అంతా పరిశీలించి చూసినా కూడా ఎక్కడా కూడా నిర్మాణాత్మక చర్చలు ఉపయోగపడ్డట్టుగా వాదనలు ఉపయోగపడ్డ దాఖలాలు లేవు. పైగా వాదనలవల్ల సున్నితమైన మానవ సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది.

మీరు ఆమెని ప్రేమిస్తున్నారా లేదా:
మీరు నిజంగా మీ భార్యని ప్రేమించేవారయితే ఆమె కోణాన్ని కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ బంధంలో ఘర్షణ తగ్గి బంధం బలపడాలంటే ఆమె కూడా తన భావాలని వ్యక్తీకరించగలిగే స్వేచ్చనివ్వండి.



Click it and Unblock the Notifications
