For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమెతో అక్రమ సంబధం.. నాతో పెళ్లి.. ఎలా ఒప్పుకోవాలి?

ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాక ఆమెతో కూడా తన సంబంధాన్ని నడిపాడు. వారిద్దరికీ లైంగిక సంబంధం ఉంది. వారానికొకసారి వీరిద్దరూ అందులో పాల్గొనేవారు. వీకెండ్స్ ను వీళ్లద్దరూ కేవలం దానికోసమే కేటాయించేవారు.

By Bharath
|

మాది మధ్యతరగతి కుటుంబం. మా ఇంట్లో సంప్రదాయ పద్దతులు ఎక్కువగా పాటిస్తారు. నాకు ఇద్దరు అన్నలు. ఒక చెల్లి. మా ఇంట్లో నేనంటే అందరికీ చాలా ఇష్టం. మా అమ్మనాన్న కూడా నన్ను చాలా గారాబంగా పెంచారు. నా ఫ్రెండ్స్ తో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు ఏమి కావాలన్నా మా ఇంట్లో వాళ్లు అన్నీ తెచ్చిపెట్టేవారు.

అందంగా ఉండేదాన్ని

అందంగా ఉండేదాన్ని

నా స్కూల్ డేస్ ల్లో నేను చదువులో కూడా ముందంజలో ఉండేదాన్ని. ఇక కాలేజీలో చేరాక నా లైఫ్ మరింత మారింది. కొత్తకొత్త ఫ్రెండ్స్ తో పరిచయాలు.. అంతా కొత్త జీవితం.. కొంగొత్త ఆశలతో నా లైఫ్ సాగిపోయింది. అయితే నాకు కాలేజీలో ప్రపోజ్ చేసేవారు కూడా చాలా మందే ఉండేవారు. నేను చదువుతో పాటు అందంలోనూ చాలా బాగుండేదాన్ని.

రోజూ ప్రపోజ్ చేసేవాళ్లు

రోజూ ప్రపోజ్ చేసేవాళ్లు

నాకు కాలేజీలో రోజూ ఎవరో ఒకరు ప్రపోజ్ చేసేవాళ్లు. అయితే నేను చాలా మందిని రిజెక్ట్ చేయలేకపోయేదాన్ని. అలా అని వారి ప్రేమను అంగీకరించేదాన్ని కాదు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండేదాన్ని. ఒక వేళ ప్రేమను తిరస్కరిస్తే వాళ్లు ఏం చేసుకుంటారోననే భయం. ఒక వ్యక్తి నచ్చినా ప్రేమను అంగీకరించలేదు.

కుటుంబ గౌరవం దెబ్బతినకూడదు

కుటుంబ గౌరవం దెబ్బతినకూడదు

ఎందుకంటే నా కుటుంబానికి మా ఊర్లో ఉన్న గౌరవం నావల్ల దెబ్బతినడం నాకిష్టం లేదు. కాలేజీ చదివే రోజుల్లో నేను ప్రతి ఒక్కరితో కలవిడిగా ఉండేదాన్ని. నాకు డబ్బుందనే గర్వం కూడా ఉండేదికాదు. అందువల్ల ప్రతి ఒక్కరు నాతో చాలా సరదగా ఉండేవారు.

సిటీలో ఉద్యోగం

సిటీలో ఉద్యోగం

నా చదువు పూర్తయ్యాక నేను ఉద్యోగం చేయడానికి సిటీకి వెళ్లాను. నేను నా కుటుంబాన్ని, మా ఊరిని వదిలి మొదటిసారిగా చాలా రోజుల పాటు బయట ఉండాల్సి వచ్చింది. హాస్టల్ లో ఉంటూ జాబ్ కు వెళ్లేదాన్ని. ఆఫీసులో కొత్తకొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు మొదలయ్యాయి. అదో కొత్త జీవితం.

ఒక అబ్బాయితో పరిచయం

ఒక అబ్బాయితో పరిచయం

అక్కడే నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను కూడా మా కాలేజీ అతనే. కానీ నాకు కాలేజీలో అంతగా పరిచయం లేదు. ఎందుకంటే అతను నాకన్నా ఒక సంవత్సరం సీనియర్. జస్ట్.. అతన్ని నేను గుర్తుపట్టగలిగాను.

పరిచయం.. స్నేహంగా

పరిచయం.. స్నేహంగా

తర్వాత మా పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆఫీసు స్టాఫ్ తో కలిసి అప్పుడప్పుడు ఔటింగ్ కు వెళ్లేవాళ్లం. ఆఫీస్ లో ఎవరిదైనా బర్త్ డే ఉంటే బయట రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేసేవాళ్లం. అలాంటి సందర్భంలో అతనితో నాకు స్నేహం మరింత బలపడింది. ఇద్దరం కాస్త క్లోజ్ అయిపోయాం.

చాటింగ్

చాటింగ్

తనను నన్ను బాగా ఇష్టపడుతున్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నాతో అతను ప్రవర్తించే తీరు కాస్త ప్రత్యేకంగా ఉండేది. నాకు చాలా గౌరవం ఇచ్చేవాడు. తర్వాత ఒక రోజు నా ఫోన్ నంబర్ అడిగాడు. నేను నంబర్ ఇచ్చాను. తర్వాత చాటింగ్ మొదలైంది. అయితే అందులో కేవలం తిన్నావా.. ఏం చేస్తున్నావ్ అనే విషయాలు తప్ప ఇంకా ఏమి ఉండేవి కావు.

అతను అన్నింట్లో ఫస్ట్

అతను అన్నింట్లో ఫస్ట్

మొదట మేము ఫ్రెండ్స్ గా ఉండేవాళ్లం. అతను కూడా చాలా మంచివాడు. నాలాగే అందరితో కలిసి పోయే గుణం అతనికీ ఉంది. ఆఫీసులో అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. మంచి మానవత దృక్పథం అతనితో ఉండేది. సేవాగుణం ఎక్కువ. అలాగే ఆఫీసులో వర్క్ లో కూడా ఫస్ట్ ఉండేవాడు. ప్రతి విషయంలోనూ నంబర్ వన్.

చాలా ఫిట్ గా ఉండేవాడు

చాలా ఫిట్ గా ఉండేవాడు

ఆ అబ్బాయి చాలా ఫిట్ గా ఉండేవాడు. రోజూ జిమ్ చేసేవాడంట. ఫిట్నెస్ గురించి కోలిగ్స్ కు చాలా సూచనలు ఇచ్చేవాడు. ఆఫీసులో కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసేవాడు. ఇక ఆఫీసులో ఏదైనా ఫంక్షన్ ఉంటే సందడి అంతా అతనిదే. అతను డ్యాన్స్ లోనూ నంబర్ వన్. ఏ కార్యక్రమాన్ని అయినా అతను సమన్వయకర్తగా ఉండి ముందుకు నడిపేవాడు.

అతనిపై ఇష్టం ఏర్పడింది

అతనిపై ఇష్టం ఏర్పడింది

అతనిపై నాకు కూడా క్రమంగా ఇష్టం కలిగింది. మొదట అతనే నాకు ప్రపోజ్ చేశాడు. నేను అతని ప్రేమను అంగీకరించాను. అతను నన్ను ప్రేమించినట్లుగా.. నన్ను ఇష్టపడినట్లుగా ఇంకెవ్వరూ నన్ను అలా ప్రేమించలేదు. అతన్ని నా తల్లిదండ్రులకు పరిచయం చేద్దామనుకున్నాను. నన్ను ప్రతి విషయంలో అతను ప్రోత్సహించేవాడు.

ఏ అమ్మాయి అయినా ఈజీగా పడిపోతుంది

ఏ అమ్మాయి అయినా ఈజీగా పడిపోతుంది

నా తండ్రి నాకు ఎలాంటి ధైర్యం ఇచ్చేవాడో అతను కూడా అలాంటి ధైర్యాన్నే నాకు ఇచ్చేవాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచాడు. అతను నన్ను అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. అతని టాలెంట్ కు ఏ అమ్మాయి అయినా ఈజీగా ప్రేమలో పడిపోతుంది. కానీ అతను నాకు ఇచ్చినంతగా ఏ అమ్మాయికి ప్రియార్టీ ఇచ్చేవాడు కాదు. మా ప్రేమ గురించి ఆఫీసులో ఎవరికీ తెలియదు. కానీ ఒకరిద్దరికీ మా లవ్ గురించి తెలుసు

కోలీగ్ నుంచి ఫోన్

కోలీగ్ నుంచి ఫోన్

ఒక రోజూ రాత్రి నాకు నా కోలిగ్ ఫోన్ చేసింది. " నేను విన్నది నిజమేనా? నీవు మన ఆఫీసులో ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావంటా కదా. ఇద్దరూ డీప్ లవ్ లో ఉన్నారంటా కదా" అని అడిగింది. అవునని చెప్పాను. అతని పేరు చెప్పింది. నేను కూడా అతనే అని చెప్పాను.

మైండ్ బ్లాక్

మైండ్ బ్లాక్

తర్వాత ఆమె ఒక స్టోరీ చెప్పింది. నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఆమె చెప్పిన మాటలకు నాకు నిద్ర కూడా రావడం లేదు. నా కలలన్నీ కన్నీళ్లుగా మారాయి. ఆమె చెప్పిన విషయం నిజమా కాదా అని కూడా నేను నిర్ధారించుకున్నాను. నా కోలిగ్ అతని గురించి చెప్పిన ప్రతి మాట నిజమే అని తేలింది.

వారిద్దరికీ లైంగిక సంబంధం

వారిద్దరికీ లైంగిక సంబంధం

ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాక ఆమెతో కూడా తన సంబంధాన్ని నడిపాడు. వారిద్దరికీ లైంగిక సంబంధం ఉంది. వారానికొకసారి వీరిద్దరూ అందులో పాల్గొనేవారు. వీకెండ్స్ ను వీళ్లద్దరూ కేవలం దానికోసమే కేటాయించేవారు. ఈ విషయాలన్నీ నాకు తెలిసేసరికి నాకు ఏం చేయాలో తోచలేదు.

ఒకరిని అనుభవించి..

ఒకరిని అనుభవించి..

అతనంటే నాకిష్టం. కానీ అతనికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయని తెలిసి నాకు బాధేసింది. ఒకరిని అనుభవించి మరొకరిని పెళ్లి చేసుకోవాలని అతను భావించడం నాకు నచ్చలేదు.

ముగ్గురం కలిశాం

ముగ్గురం కలిశాం

మరుసటి రోజు మేము ముగ్గురం బయట కలిశాం. అతను ఒప్పుకున్నాడు. ఆమెతో నాకు లైంగిక సంబంధం ఉంది. ఇది చాలా కాలం నుంచి కొనసాగుతుందన్నాడు. కానీ నేను చేసింది నన్ను క్షమించు అని బతిమిలాడాడు. ఆ అమ్మాయికి క్షమాపనలు చెప్పాడు. ఇక నుంచి అలా చెయ్యనన్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు.

జైలుకెళ్లాడు

జైలుకెళ్లాడు

ఈ మాటలకు అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్న అమ్మాయికి కోపం వచ్చింది. నన్ను ఎలా విడిచిపెడతావు అంటూ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు అతన్ని జైల్లో పెట్టారు. మళ్లీ వారిద్దరూ రాజీకి వచ్చారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు విడిచిపెట్టారు. జైల్లో నుంచి బయటకు వచ్చాక నేరుగా నా దగ్గరకు వచ్చాడు. నేను చేసింది తప్పే.. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అన్నాడు.

మళ్లీ మోసం చేయడని ఏం గ్యారెంటీ?

మళ్లీ మోసం చేయడని ఏం గ్యారెంటీ?

నాకు అతను నాపై చూపిన ప్రేమ గుర్తొచ్చినప్పుడు క్షమించాలి అనిపించేది. కానీ అవతలి వైపు కూడా ఒక అమ్మాయి జీవితమే కదా.. ఆమె జీవితాన్ని నేను నాశనం బాగుండదని ఒప్పుకోలేదు. ఒకవేళ ఇప్పుడు క్షమించి పెళ్లి చేసుకుంటే వివాహం అయ్యాక కూడా నన్ను మోసం చెయ్యడనే గ్యారెంటీ ఏముందని నాకు అనిపించిది.

ఆమెతో కలిసి తప్పు చేశా.. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా!

ఆమెతో కలిసి తప్పు చేశా.. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా!

కానీ అతను నా వెంట రోజూ పడుతూనే ఉన్నాడు. నన్ను పెళ్లి చేసుకో. నిన్ను బాగా చూసుకుంటా అంటూ ఉన్నాడు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే ఆమె నీ అంత మంచిది కాదు అని అనేవాడు. నా ప్రేమ నిజం.. నేను ఏదో తెలియక అప్పుడు ఆమెతో కలిసి తప్పు చేశా అంటూ ఇప్పటికీ నావెంటే తిరుగుతున్నాడు. అతన్ని మాటలు నమ్మి.. అతన్ని పెళ్లి చేసుకోవాలా.. వద్దా అని నేను రోజూ సతమతం అవుతున్నాను. ఏం చేయాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

English summary

He Cannot Decide What He Wants More Love Or Lust

He Cannot Decide What He Wants More Love Or Lust
Desktop Bottom Promotion