అతడు చాలా మందితో సెక్స్ లో పాల్గొన్నాడంట.. అయినా అతన్నే లవ్ చేస్తున్నా! - My Story #9

Written By:
Subscribe to Boldsky

నా పేరు గిరిజ. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. నేను తెలుగమ్మాయినే. బెంగళూరులో జాబ్ లో జాయినప్పుడు నాకు అంతా కొత్తగా ఉండేది. అక్కడి ఆఫీసు వాతావరణానికి నేను మొదట అలవాటుపడలేకపోయా. నాకు మొదట ఆఫీసులో చాలా ఇబ్బందిగా ఉండేది.

చాలా టార్చర్

చాలా టార్చర్

అయితే మంచి జీతం, మంచి ఉద్యోగం వదులుకుంటే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని నేను జాబ్ అలాగే కంటిన్యూ చేశాను. రోజూ ఆఫీస్ రాగానే నరకంలా ఉండేది. కొందరు కోలిగ్స్... నేను కొత్త కాబట్టి నానారకంగా టార్చర్ చేసేవారు. చాలా బాధగా అన్పించేది. ఇన్ డెైరెక్ట్ గా నాపై పంచ్ లు వేసేవారు. ఒళ్లు మండేది.

అది చేతకానితనం కాదు

అది చేతకానితనం కాదు

కానీ సీనియర్స్ అని గౌరవించేదాన్ని. అది మన మంచితనం. దాన్ని చేతకానితనంగా తీసుకుంటే వారి మూర్ఖత్వం. వాళ్లు అన్నింట్లోనే జీరోనే. పని చేసే నన్ను ఎంకరేజ్ చేసే గుణం వారికి లేదు. ఎంత సేపున్నా వారికన్నా తక్కువగా ఉండాలనుకునే అల్పులు వారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కుడున్నా సరే.. వాళ్లు ఎదగరు.. పక్కవారిని ఎదగనివ్వరు. అందుకే మనం ఇంకా ఇలాగే ఉన్నాం. కానీ నేను ఈ కోవలోకి అందరూ వస్తారనడం లేదు. కొందరుంటారు.

జాబ్ వదిలేద్దాం అనుకున్నా

జాబ్ వదిలేద్దాం అనుకున్నా

థూ.. వీరి మధ్య ఈ బతుకు బతికేకన్నా జాబ్ వదిలేసి వెళ్దామా అని కొన్ని వందల సార్లు అనిపించింది. కానీ గుండె ధైర్యం చేసుకున్నా. ఆఫీసులో ఇతర రాష్ట్రాల వారు నా పని గుర్తించారు. వారు అందరు నన్ను ఎంకరేజ్ చేశారు. అలాంటి సమయంలో నాకు కిరణ్ పరిచయం అయ్యాడు. అతను మన తెలుగువాడే. మొదట బాగా మాట్లాడేవాడు.

కిరణ్ ను నమ్మాలా వద్దా?

కిరణ్ ను నమ్మాలా వద్దా?

అయినా తెలుగువాళ్లను నమ్మకూడదనుకున్నా. నమ్మించి గొంతు కోసే రకంగా ఉంటారు మన తెలుగువాళ్లు. ఏంటి ఈ అమ్మాయి ఇంత దారుణంగా మాట్లాడుతుంది మన తెలుగువారి గురించి అనుకోవొచ్చు. మీ అందరికీ కచ్చితంగా ఆఫీసుల్లో మన తెలుగువారితో ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి. మన భాషను కించపరచడం లేదు. ఎక్కడికి వెళ్లినా మన వ్యక్తిత్వాలు మారడం లేదనే నా బాధ.

మిగతా వారిలా మనం ఉండలేం

మిగతా వారిలా మనం ఉండలేం

మిగతా భాషల వారు వారివారి భాషలకిచ్చే ప్రాధాన్యం.. వారి ప్రాంతాల వారికిచ్చే గౌరవం చూస్తే మనం వారికి ఎందులోనూ సరితూగం. మనం ఆర్భాటంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకుంటాం తప్పా.. సాటి తెలుగు వారిని గౌరవించే సంప్రదాయం మాత్రం నేర్చుకోం.

కిరణ్ తో స్నేహం

కిరణ్ తో స్నేహం

కిరణ్ సంగతిలోకి వద్దాం. మొదట పరిచయం.. ఆ తర్వాత ఇద్దరం కలిసి లంచ్ చేసేవాళ్లం. వాట్సాప్ లో చాటింగ్ చేసేవాళ్లం. నాకు వర్క్ లో కూడా బాగా సాయం చేసేవాడు. నన్ను టార్చర్ పెట్టే వారికి డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంతో మా స్నేహం మరింత బలపడింది.

ఫుల్ ఎంజాయ్

ఫుల్ ఎంజాయ్

ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరం కలిసి వీకెండ్స్ లో పబ్ లు పార్టీలకు వెళ్లేవాళ్లం. బెంగళూరులో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేశాం. అతని పరిచయంతో నాకు వర్క్ ప్రెజర్ అనేది తెలిసేది కాదు. మొదట ఏ ఆఫీస్ అంటే నేను భయపడేదాన్నో. అలాంటి ఆఫీస్ కు ఇప్పుడు నేను ఒక్కరోజు వెళ్లకున్నా కూడా ఏదో వెలితిగా ఉంటుంది.

పికప్.. డ్రాప్

పికప్.. డ్రాప్

రోజూ నన్ను మా ఉమెన్స్ హాస్టల్ నుంచి పికప్ చేసుకునేందుకు బైక్ పై వచ్చేవాడు. తిరిగి సాయంత్రం ఆఫీస్ నుంచి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేవాడు. నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. నా జీవితం ఇతనికే అంకితమని నేను డిసైడయ్యాను.

ఫస్ట్ కిస్

ఫస్ట్ కిస్

ఒక రోజు బైక్ పై నన్ను డ్రాప్ చేసి తిరిగి వెళ్లడానికి బయల్దేరాడు. అప్పటికే కాస్త చీకటి పడుతుంది. ఎలాంటి స్వార్థం లేకుండా నాపై చూపిస్తున్న అతని ప్రేమకు బదులుగా నేను అతని బుగ్గపై ముద్దుపెట్టాను. అతను నన్ను దగ్గరకు తీసుకుని నా నుదిటిపై ముద్దిచ్చాడు.

లిప్ టు లిప్ కిస్

లిప్ టు లిప్ కిస్

ఒక రోజు అతని ఫోన్ ఎందుకో నేను తీసుకున్నాను. ఇమేజెస్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేశాను. అందులో ఫొటోలు చూసి షాక్ అయ్యాను. మా ఆఫీసులో పని చేసే కన్నడ అమ్మాయితో అతను సరసాలాడుతున్న ఫొటోలు కనిపించాయి. ఇద్దరూ రొమాంటిక్ గా ఫొటోలు దిగారు. ఒకరినొకరు లిప్ టు లిప్ కిస్ లు పెట్టుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి.

ఏడాది నుంచి డేటింగ్

ఏడాది నుంచి డేటింగ్

మరుసటి రోజూ ఆ అమ్మాయిని ఈ విషయంపై నిలదీశా. అవును మేమిద్దరం సంవత్సరం నుంచి డేటింగ్ లో ఉన్నాం అని చెప్పింది. నాకు అతనిపై చాలా కోపం వచ్చింది. నీ దగ్గర ఏ విషయం దాచను. నీకు అన్నీ చెబుతాను అన్నీ చెప్పేవాడు. కానీ ఇంత దుర్మార్గుడని అనుకోలేదు.

మాటల్లేవు

మాటల్లేవు

ఈ విషయంపై నేను కిరణ్ ని నిలదీస్తే నాతో చాలా రోజులు మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడలేదు. మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది. కొన్ని రోజులు అలాగే బాధపడ్డాను. నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.

నమ్మించాడు

నమ్మించాడు

ఒక రోజు మళ్లీ అతను నా దగ్గరకు వచ్చాడు. నాతో మాట్లాడాలనుకున్నాడు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాననే విషయం నాకు చెప్పాడు. ఆ కన్నడ అమ్మాయితో గతంలో పరిచయం ఉండేది.. ఇప్పుడు మా రిలేషన్ షిప్ కంటిన్యూ కావడం లేదన్నాడు. ఆ అమ్మాయి తనని మోసం చేసిందని అనవసరంగా తనను నమ్మానంటూ చెప్పాడు. నువ్వే నా ప్రాణం.. నీతోనే నా జీవితం అని ఏవేవో సినిమా డైలాగ్స్ చెప్పాడు.

మళ్లీ ఓల్డ్ డేస్

మళ్లీ ఓల్డ్ డేస్

దాంతో నేను కూడా కూల్ అయ్యాను. అనవసరంగా అపార్థం చేసుకున్నా అనుకున్నా. మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాం. మళ్లీ ఫుల్ ఎంజాయ్ స్టార్ట్ అయ్యింది.. మా పాత రోజుల్లో ఎలా చేశామో అలాగే గడపడం మొదలుపెట్టాం.

కన్నడ అమ్మాయితో బంధం తెగిపోయింది

కన్నడ అమ్మాయితో బంధం తెగిపోయింది

అయితే నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అతను అప్పుడప్పుడు చాటింగ్ లో ఉండేవాడు. అతని ప్రవర్తనపై నాకు మళ్లీ సందేహం కలిగింది. కన్నడ అమ్మాయిని అడిగితే ఛీ.. వాడితో నేను అస్సలు మాట్లాడను. వాడొక వేస్ట్ ఫెలో అంది. సరే వీరిద్దరి బంధం తెగిపోయింది.. మనకు మేలులే అనుకున్నా. కానీ లోపల మాత్రం ఏదో డౌట్ కొడుతూనే ఉంది.

తమిళ్ అమ్మాయితో డేటింగ్

తమిళ్ అమ్మాయితో డేటింగ్

తర్వాత అతని ఫ్రెండ్స్ ద్వారా ఒక విషయం తెలిసింది. అతను మూడేళ్లుగా ఒక తమిళ్ అమ్మాయితో డేటింగ్ ఉన్నాడని తెలిసింది. మొదట ఆ విషయం నేను నమ్మలేదు. కానీ అతని ఫ్రెండ్స్ ఆధారాలు చూపించాక నమ్మక తప్పలేదు.

నమ్మించి మోసం చేస్తున్నావ్

నమ్మించి మోసం చేస్తున్నావ్

నన్ను ఎందుకిలా నమ్మించి మోసం చేస్తున్నావ్ కిరణ్ అని నిలిదీశాను. ఈ సారి నాకు చాలా కోపం వచ్చింది. ఒక అమ్మాయి జీవితంతో ఇలా ఎలా ఆటలాడుకుంటారనిపించింది. కానీ అతను మాత్రం ఈ సారి కూడా ఏవేవో కట్టు కథలు చెప్పాడు.

అతనికి చాలా మందితో సంబంధాలు

అతనికి చాలా మందితో సంబంధాలు

మేమిద్దరం విడిపోయామని తెలిశాక నాతో కిరణ్ గురించి చాలామంది నానా రకాలుగా చెప్పారు. అతనికి చాలామంది అమ్మాయిలతో శారీరక సబంధాలున్నాయన్నారు. కానీ అందులో కొన్ని నేను నమ్మలేదు.

అతనంటే ఇప్పటికీ ప్రేమ

అతనంటే ఇప్పటికీ ప్రేమ

అతను ఇతర అమ్మాయిలతో డేటింగ్ ఉన్నాడు కానీ నాతో మాత్రం చాలా ప్రేమగా ఉండేవాడు. నన్ను ఎంతో బాగా ప్రేమించేవాడు. ఎన్నోసార్లు తన ప్రేమను నేను చూశాను. నిజంగా అతను అలాంటి వాడైతే నాతో ఇప్పటి వరకు చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించాలి. ఎన్నో సార్లు అతనికి ఛాన్స్ కూడా వచ్చింది. కానీ అలా చేయలేదు. ఇప్పటికీ అతనంటే ప్రేమ ఉంది. జనవరి ఫస్ట్ కు మేము విడిపోయి ఏడాది అవుతుంది.

English summary

my story hes cheated on me twice but i still wont let him go

My story He's Cheated On Me Twice But I Still Won't Let Him Go