పెళ్లికి ముందే ముద్దు సెక్స్ అన్నీ కావాలన్నాడు - My Story #1

Written By: Bharath
Subscribe to Boldsky

ఒక అమ్మాయికి అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరింది. తర్వాత వీరిద్దరూ సరదాగా కొన్ని సార్లు మాట్లాడుకోవడానికి కలిశారు. వీరిద్దరి మధ్య ఆ సమయంలో చాలా విషయాలే జరిగాయి. ముద్దు దగ్గరి నుంచి సెక్స్ వరకు ప్రతి అంశానికి ఇందులో చోటుంది. మరి ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుందా? అతను ఆ అమ్మాయికి నచ్చాడా? అనే విషయాలను ఆ అమ్మాయి మాటల్లోనే చూద్దామా..

సంప్రదాయాలపై గౌరవం

సంప్రదాయాలపై గౌరవం

నేను బాగానే చదువుకున్నాను. సిటీలో పెరిగాను. కాస్త ఫ్యాషన్ బుల్ గా ఉంటాను. అయితే మన సంప్రదాయాలపై నాకు చాలా గౌరవం ఉంది. ప్రేమ, పెళ్లి ఆ తర్వాత దంపతుల మధ్య ఉండే ఆ అనుబంధం పై కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ మా నాకు కాబోయే వ్యక్తి విషయంలో మాత్రం పెళ్లి కాకముందే నాకు చాలా అనుభవాలే ఎదురయ్యాయి.

మా పెద్ద వారు చూసిన సంబంధం

మా పెద్ద వారు చూసిన సంబంధం

నేను మా పెద్దవాళ్లు చూసిన సంబంధాన్నే చేసుకోవాలనుకున్నాను. అయితే ఆ అబ్బాయి గురించి ముందు తెలుసుకుని అతని మంచి వాడా నన్ను బాగా చూసుకుంటాడా లేదా అనే విషయాల్లో నాకు క్లారిటీ వచ్చాకే పెళ్లి చేసుకుందామనుకున్నా. మొత్తానికి మా వాళ్లు ఒక సంబంధం చూశారు.

మా వాళ్లు నేను ఇంటికి వెళ్తే ఆ సంబంధం గురించే మాట్లాడేవారు. ఫైనల్ గా నేను ఆ సంబధాన్ని ఒప్పుకున్నాను. అయితే అతన్ని ఒక్కసారి కలవాలని అనుకున్నా. ఇందుకు అందరూ అంగీకరించడంతో కలిశాను.

ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాను

ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాను

అతని ఫేస్ బుక్ లో నేనే మెసేజ్ పెట్టాను. అతను కూడా సమాధానం ఇచ్చాడు. చివరకు ఒకరి ఫోన్ నంబర్లు ఒకరం ఇచ్చుకున్నాం. అతను నాకు నచ్చాడు. మాదే పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినప్పటికీ ఇద్దరం ఒకరికొకరం ఫోన్ లో ప్రపోజ్ చేసుకున్నాం.

ఇద్దరం రెస్టారెంట్ లో

ఇద్దరం రెస్టారెంట్ లో

ఒక సండే రోజు మేమిద్దరం కలవాలనుకున్నాం. అనుకన్నట్లుగానే ఇద్దరం ఇళ్లలో పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లాం. మేమిద్దరమూ ఒక రెస్టారెంట్ లో కలిశాం. మొదటి సారి ఒకరినొకరు కలిసినప్పుడు ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉంటుంది. అతనితో ఎన్నో కబుర్లు చెప్పాలని నాకు ఉంది.

ఫస్ట్ కలిసినప్పుడే ఆ పని చేయాలనుకున్నాడు

ఫస్ట్ కలిసినప్పుడే ఆ పని చేయాలనుకున్నాడు

తనతో కలిసి మాట్లాడాలని, తన చెయ్యిని ఆత్మీయంగా పట్టుకుని నడవాలని నా మనస్సులో ఉంది. కానీ అతనిలో మాత్రం వేరే ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది. అతను కాసేపు మాట్లాడాక నన్ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే నాకు మాత్రం భయం వేసింది. అతన్ని వారించాను. పక్కకు జరిగాను.

ఆ రోజు అక్కడే ఉన్నాం

ఆ రోజు అక్కడే ఉన్నాం

మేము వెళ్లింది కాస్త లాంగ్ ఏరియాకు ఆ రోజు అక్కడే స్టే చేయాలనుకున్నాం. అక్కడే రూమ్ బుక్ చేసుకున్నాం. రూమ్ లో చాలా సేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. చాలా విషయాల గురించి చర్చించాం. ఇద్దిర అభిరుచుల నుంచి ప్రతి విషయంపై మాట్లాడుకున్నాం.

నన్ను బెడ్ పైకి నెట్టి

నన్ను బెడ్ పైకి నెట్టి

ఆ తర్వాత అతనిపై కాస్త నమ్మకం వచ్చింది. మాటల మధ్యలోనే అతను నన్ను బెడ్ పైకి తోశాడు. నాపై పడి ముద్దుపెట్టుకున్నాడు. నేను కూడా అతని ముద్దను ఆస్వాదించాను. అతనిపై ఇష్టం కలిగింది.. కాబోయే భర్తే కదా అని ఆ సమయంలో కమిట్ అయ్యాను.

సెక్స్ చేద్దామా అన్నాడు

సెక్స్ చేద్దామా అన్నాడు

తర్వాత కొద్దిసేపటికి ఇద్దరం కలిసి రాత్రి భోజనం చేశాం. ఆ తర్వాత అక్కడే మేము తీసుకున్న రూమ్ కు వచ్చాం. అతను మనిద్దరం సెక్స్ లో పాల్గొందామా అని అడిగాడు. కానీ నేను అందుకు అంగీకరించలేదు. సంప్రదాయాలపై గౌరవం ఉన్న ఏ ఒక్కరూ కూడా పెళ్లికాకుండానే దానికి అంగీకరించరని నా అభిప్రాయం. సరే ఒకే లివ్ ఇట్ అని అన్నాడు.

ఫోన్ లో ఏవేవో ఫొటోస్

ఫోన్ లో ఏవేవో ఫొటోస్

మొత్తానికి ఆ రోజు రాత్రి ఎలాంటి సంఘటనలు జరగకుండా గడిచిపోయింది. ఉదయం నేను త్వరగా లేచాను. బెడ్ పై ఉన్న తన ఫోన్ తీసుకొని ఏదో యాదృచ్ఛికంగా అలా ఓపెన్ చేశాను. అందులో అతను ఒక అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలున్నాయి.

ఏడ్చడం మొదలుపెట్టాను

ఏడ్చడం మొదలుపెట్టాను

వాటిని చూశాక నాకు ఏడుపు వచ్చింది. నేను అతన్ని చాలా నమ్మాను. కాబోయే భర్తకు ఇలా వేరే అమ్మాయితో సంబంధం ఉంటే ఏ అమ్మాయికైనా బాధ కలుగుతుంది కదా. అందుకే నాకు కూడా చాలా బాధ అనిపించింది.

అక్కడి నుంచి వచ్చేశాను

అక్కడి నుంచి వచ్చేశాను

అక్కడి నుంచి ఉదయమే ఇంటికొచ్చేశాను. నా మదిలో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఫోటోలే గుర్తొస్తున్నాయి. అతన్ని చేసుకోవాలా వద్దా అని నాలో నేను సతమతం అవుతున్నాను.

ఫోన్ చేసి అలా అన్నాడు

ఫోన్ చేసి అలా అన్నాడు

నాకు ఒక రోజు అతన్ని నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఒకే అంటే సరే. లేదంటే చెప్పు.. మా బంధువుల్లో ఇంకో అమ్మాయి ఉంది. తనను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయింది. అంటే నన్ను సెకెండ్ ఆప్షన్ పెట్టుకున్నాడని నాకు అర్థమైంది.

నేను అనుకున్నది వేరు

నేను అనుకున్నది వేరు

నేను అతని గురించి అనుకున్నది వేరు. నేను ఇష్టపడిన మొదటి వ్యక్తి తనే. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనతోనే జీవితాంతం ఉండాలనుకున్నాను. కానీ అతని మనస్సులో మాత్రం ఏవేవో ఆలోచనలున్నాయి.

సెక్స్ ఒక్కటే జీవితమా

సెక్స్ ఒక్కటే జీవితమా

ఇద్దరి మధ్య సెక్స్ ఒక్కటే జీవితం కాదు కదా. ఇద్దరి మనస్సులను ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తేనే కదా జీవితం కదా. ఆడవాళ్లు అంటే కేవలం సెక్స్ బొమ్మలు కాదు కదా. వారికి మనస్సు ఉంటుంది. తమ భాగస్వామి తమని ఎక్కువగా ప్రేమించాలనే కోరిక ఉంటుంది. అది తప్పా? కేవలం సెక్స్ కు మాత్రమే ఆడవారిని ఉపయోగించుకుంటామంటే ఎవరూ ఇష్టపడరు కదా.

అతన్ని డైరెక్ట్ గా కలువాలనుకున్నా

అతన్ని డైరెక్ట్ గా కలువాలనుకున్నా

నేను చాలా డిస్టర్బ్ అయిన తర్వాత అతన్ని నేరుగా కలవాలని అతని రూమ్ కు వెళ్లా. ఈ సారి ఇంట్లో వాళ్ల పర్మిషన్ ఏమి తీసుకోలేదు. ఆ సమయంలో అతను బాత్రూమ్ లో ఉన్నాడు. నేను కాసేపు వెయిట్ చేశా. అతని బెడ్ పై ఉన్న ఫోన్ తీసుకున్నా. అందులో ఏదో అలా యూట్యూబ్ లో వీడియోలు చూడాలనుకున్నా.

నేను కూడా పోర్న్ చూస్తా

నేను కూడా పోర్న్ చూస్తా

నేను ఏమి అబ్బాయిలను తప్పుపట్టడం లేదు. చాలా మంది అమ్మాయిలు పోర్న్ చూస్తారు. నేను కూడా చూస్తా. అంతమాత్రానా ఎలా అంటే ప్రవర్తిస్తారనుకుంటే పొరపాటే. నా హద్దుల్లో నేను ఉంటా. అతను బాత్రూమ్ నుంచి వచ్చాక కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లిపోయా.

నేను అతన్ని ప్రేమిస్తున్నాను

నేను అతన్ని ప్రేమిస్తున్నాను

మా ఇద్దరి మధ్య ఈ తక్కువకాలంలో ఎన్ని జరిగినా నాకెందుకో అతనంటే ప్రేమ మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు అతను తెలియక చేసే పనులు, అలాగే నాపై అతను చూపే ప్రేమ ఇలా ఏదో తెలియని విషయాలు నన్ను అతని ప్రేమలో పడేలా చేశాయి. కానీ అతను కేవలం నన్ను సెక్స్ కోసమే పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. నన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకునేటట్లు అయితేనే నేను అతనితో ఏడు అడుగులు వేస్తాను.

English summary

My Story I Loved Him The Way He Was, But All He Could Think Of Was Sex

My Story I Loved Him The Way He Was, But All He Could Think Of Was Sex
Story first published: Wednesday, December 13, 2017, 13:30 [IST]