నా చేతులు కాళ్లు మంచానికి కట్టేసి.. అతను సంతృప్తి చెందే వరకు అనుభవించేవాడు - My Story #19

Written By:
Subscribe to Boldsky

నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఒక లవ్ స్టోరీ ఉండేది. కానీ ఆ ప్రేమనే సాఫీగా సాగుతున్న నా జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత నేను చాలా కష్టాలు అనుభవించాను. రాజు అనే వ్యక్తి మా ఫ్యామిలీ ఫ్రెండ్. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.

చిన్నప్పటి నుంచి తెలుసు

చిన్నప్పటి నుంచి తెలుసు

చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు. ఇక కాలేజీలో అయితే తను క్లాస్ కు రానప్పుడల్లా నా నోట్ బుక్స్ తీసుకునే వాడు. మా ఇద్దరి అభిరుచులు కూడా దాదాపుగా ఒక్కటే ఉండేవి. ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలా మా ఇద్దరి అభిరుచులు కలవడం వల్ల ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం.

నాలుగేళ్ల పాటు డేటింగ్

నాలుగేళ్ల పాటు డేటింగ్

మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అతను నాకు ఒక రోజు ప్రపోజ్ చేశాడు. నేను అతని ప్రేమను అంగీకరించాను. అలా నాలుగేళ్ల పాటు మేము డేటింగ్ లో ఉన్నాం. మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో రాజు చెప్పాలనుకున్నాడు.

చచ్చిపోతామన్నారు

చచ్చిపోతామన్నారు

కానీ వాళ్ల ఇంట్లో వాళ్లు మేము పెళ్ల చేసుకోవడానికి అంగీకరించలేదు. అలా చేస్తే తాము చనిపోతామని బెదిరించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. రాజుకు నా వల్ల ప్రాబ్లం రాకూడదని నేను భావించాను. నా వల్ల తన కుటుంబం విచ్ఛిన్నం కాకూడదనుకున్నా.

చూడకుండానే ఓకే అన్నాను

చూడకుండానే ఓకే అన్నాను

అప్పటికే మా ఇంట్లో వాళ్లు తీసుకొచ్చిన చాలా పెళ్లి సంబంధాలను నేను రిజెక్ట్ చేశాను. తర్వాత ఒక సంబంధం వచ్చింది. నేను అతన్ని చూడకుండానే ఓకే అనేశాను. అతని పేరు సుధీర్. తర్వాత నా పెళ్లి అతనితో జరిగింది.

రాజు కలిశాడు

రాజు కలిశాడు

మా ఆయన హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తాడు. రాజు కూడా రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాడు. అతను ఒక రోజు షాపింగ్ మాల్ లో కనిపించాడు. ఆ రోజు నేనక్కదాన్నే షాపింగ్ కు వెళ్లాను. రాజు నా దగ్గరకు వచ్చి పలకరించాడు. అందరూ బాగున్నారా అని అడిగాడు.

మా ఆయన ఆఫీసుకు వెళ్లాక..

మా ఆయన ఆఫీసుకు వెళ్లాక..

ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. తనకు కూడా పెళ్లయిందని రాజు చెప్పాడు. తర్వాత అతను నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఎప్పుడైనా ఒకసారి మా ఆయన ఆఫీసుకు వెళ్లాక నేను, రాజు మాట్లాడుకునేవాళ్లం. అయితే ఏ రోజు కూడా నేను నా హద్దులు దాటి ప్రవర్తించలేదు.

నా భర్తకు తెలిసింది

నా భర్తకు తెలిసింది

ఒక రోజు ఈ విషయం మా ఆయనకు తెలిసింది. నాకు పెళ్లి కాక ముందు నుంచి రాజుతో సంబంధం ఉందని, ఇప్పటికీ మా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం నడుస్తుందని మా ఆయన నన్ను నిలదీశాడు. నేను అలాంటిదేమి లేదని చెప్పడంతో నన్ను తిట్టాడు... కొట్టాడు.

విడాకులు ఇస్తానన్నాడు

విడాకులు ఇస్తానన్నాడు

దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఆయన నాకు విడాకులు ఇస్తానన్నాడు. రాజు వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని నాకు అతనిపై చాలా కోపం వచ్చింది. రాజు కూడా తన భార్యను కొన్ని కారణాల వల్ల వదిలేశానని చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ నాకు ఇష్టం లేదు.

ఇంట్లో నుంచి తరిమేశాడు

ఇంట్లో నుంచి తరిమేశాడు

ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక చావు అయినా బతుకైనా అతనితోనే అని నేను డిసైడ్ అయ్యాను. అందువల్ల మా ఆయన్ని విడిచిపెట్టకూడదనుకున్నా. కానీ చివరకు మా ఆయన నాకు విడాకులు ఇచ్చాడు. మా ఇద్దరికి ఒక పాప ఉండేది. ఆ పాపను మా ఆయన తన దగ్గరే పెంచుకుంటానని.. నన్ను ఇంట్లో నుంచి తరిమేశాడు.

శృంగారానికి ఒప్పుకునేదాన్ని కాదు

శృంగారానికి ఒప్పుకునేదాన్ని కాదు

నాకు రాజును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో అతన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన రోజు నుంచి నాకు రాజు నరకం చూపేవాడు. నన్ను అతను ఒక శృంగారం బొమ్మలాగా భావించాడు. నేను అతనితో శృంగారానికి ఒప్పుకునేదాన్ని కాదు.

నన్ను మంచానికి కట్టేసి

నన్ను మంచానికి కట్టేసి

రాజు నా చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి నన్ను రేప్ చేసేవాడు. వద్దన్నా వినకున్నా అతను బాగా సంతృప్తి చెందే వరకు నన్ను నానా ఇబ్బందులకు గురి చేసేవాడు. నేను ఒక నెలలోనే అతని వల్ల గర్భం దాల్చాను. నాకు బాబు పుట్టాడు. తర్వాత మళ్లీ పాప పుట్టింది. నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పినా అతను వినలేదు.

నరకం చూపాడు

నరకం చూపాడు

మనకు కావాల్సినంత ఆస్తి ఉంది. నువ్వు ఇంకా ముగ్గురు కొడుకుల్ని కనాలి అనేవాడు. నాకు ఆపరేషన్ జరగలేదు. మొత్తం ఐదు మంది పిల్లలకు జన్మనిచ్చాను. ఆరోసారి కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ అప్పుడు నేను చాలా ఇబ్బందులుపడాల్సి వచ్చింది. డాక్టర్లు బిడ్డ బతకదన్నారు. తర్వాత నా గర్భ సంచిని తీసి వేశారు. ఇలా నాకు నరకం చూపాడు రాజు.

చనిపోయాడు

చనిపోయాడు

చివరకు అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. నా పిల్లలందరూ ఇప్పుడు మంచి స్థాయిలోనే ఉన్నారు. అందరూ ఉన్నత చదవులు చదివారు. మంచి హోదాల్లో పని చేస్తున్నారు. నా మొదటి భర్త సుధీర్ కు నాకు పుట్టిన పాప కూడా మంచి స్థాయిలో ఉంది.

తొందరపాటు నిర్ణయం వద్దు

తొందరపాటు నిర్ణయం వద్దు

నా పిల్లల పెళ్లి విషయంలో మాత్రం నేను ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదనుకున్నా. వారికి నచ్చిన వాళ్లనే పెళ్లి చేసుకోండని నేను స్వేచ్ఛనిచ్చాను.

English summary

mystory he raped me until i was pregnant six times i took matters to my own hands after that

Mystory He Raped Me Until I Was Pregnant Six Times: I Took Matters To My Own Hands After That