For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పురుషాంగం అంత పెద్దగా ఉంటేనే అందులో సంతృప్తి పొందుతారా?

  By Bharath
  |

  శృంగారం గురించి ఆలోచించే ప్రతి మగాడు ముందుగా సందేహపడేది తన పురుషాంగం పరిమాణం గురించి. దీని గురించి చాలామందికి చాలా అపోహలుంటాయి. పురుషాంగం సైజు పెద్దదిగా ఉంటేనే అందులో బాడా ఎంజాయ్ చేస్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే పురుషాంగం పొడవు కన్నా అది తగినంత లావుగా ఉంటేనే మేలు.

  ఎందుకంటే యోనిలోకి అంగం పెట్టిన తర్వాత మీ భాగస్వామికి అంగ ప్రవేశం జరిగినట్లు కూడా తెలియకపోతమే మాత్రం మీది మరీ సన్నగా ఉంటుందని అర్థం. కొందరి అమ్మాయిల యోని కూడా బాగా సాగినట్లు ఉంటుంది. అందువల్ల మీ పురుషాంగాన్ని యోనిలో పెట్టిన కూడా ఆమెకు ఎలాంటి భావన కలగదు. కాబట్టి మీరు అంతంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

  ఇక పురుషాంగం సైజు ఎంత ఉండాలనే దానిపై చాలా అధ్యయనాలు జరిగాయి. పురుషాంగం పొడవు నాలుగు అంగుళాలుంటే చాలు. శృంగారంలో ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం పురుషాంగం సైజ్ సరిపోతుంది.

  యోనిపైనే ఉంటాయి

  యోనిపైనే ఉంటాయి

  అమ్మాయిలకు సంతృప్తినిచ్చే కేంద్రాలన్నీ కూడా యోని పైభాగానే ఉంటాయి. యోని లోపల ఏమి ఉండవు. కేవలం పురుషుడు స్ఖలించే వీర్యాన్ని పైకి పంపించడం కోసమే యోనిలోపలికి పురుషాంగాన్ని పెట్టి శృంగారం చేస్తుంటారు కానీ వాస్తవానికి యోని లోపల ఆమెను సంతృప్తి పరిచే ఎలాంటి భాగాలుండవు. మీ పురుషాంగం యోనిలోపలికి బాగా ప్రవేశింపజేయడం ద్వారా ఆమె ఎంజాయ్ చేస్తుందనుకోవడంఅపోహ.

  అందుకు మందుల్లేవు

  అందుకు మందుల్లేవు

  పురుషాంగం సైజు అనేది సహజంగా పెరగాలి. మీరు యవ్వనంలోకి వచ్చేసరికి మీ అంగం సైజ్ పెరిగి ఉంటుంది. అది పెరిగిన తర్వాత ఇక అది తగ్గటం, పెరగటమన్నది ఉండదు. పెంచేందుకు ఎలాంటి మందులూ లేవు కూడా. మందులు వాడకపోవడం చాలా మంచిది.

  బాగా స్తంభించాలి

  బాగా స్తంభించాలి

  పురుషాంగం పటుత్వంగా ఉండి, బాగా స్తంభించగలిగితే చాలు. ఎందుకంటే స్తంభించిన పురుషాంగం యోనిలో ప్రవేశించినపుడు అది స్త్రీని సెక్స్ పరంగా భావప్రాప్తికి చేరుస్తుంది. పురుషాంగం పొడవు ఎంత ఉన్నా స్తంభన లేకపోయినట్లయితే ఆ సైజుతో ఏమీ చేయలేనట్లవుతాడు పురుషుడు.

  అమ్మాయిలు పట్టించుకోరు

  అమ్మాయిలు పట్టించుకోరు

  మీరు సెక్స్ చేస్తున్నప్పుడు మీ పురుషాంగం సైజు గురించి అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరు. కానీ అబ్బాయిలు మాత్రం ఎక్కువగా పురుషాంగం సైజ్ గురించి వర్రీ అవుతుంటారు. నా పురుషాంగం బాగానే ఉందా? నిన్ను బాగా సంతృప్తిపరుస్తున్నానా? అని ఆడవాళ్లతో అనే మగవాళ్లు కూడా ఉన్నారు.

  9 నుంచి 16 సెంటీమీటర్లు

  9 నుంచి 16 సెంటీమీటర్లు

  ఇకపోతే పురుషాంగం స్తంభించి ఉన్నప్పుడు పురుషుని పురుషాంగం 13 సెంటీమీటర్లు ఉంటుంది. ఐతే ఇది కొందరిలో 9 సెంటీమీటర్లే ఉంటే మరికొందరిలో ఇది 16 సెంటీమీటర్ల దాకా ఉండొచ్చు. మొత్తమ్మీద 9 నుంచి 16 సెంటీమీటర్ల మధ్య స్తంభించిన పురుషాంగం ఉంటుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

  కామసూత్రలో ఇలా

  కామసూత్రలో ఇలా

  చారిత్రక భారతీయ పుస్తకం కామ సూత్రలో పురుషాంగ పొడవు మరియు చుట్టకొలత గురించి పలు వైరుధ్యాలు పేర్కొనబడ్డాయి. కామ సూత్రలో పురుషుల పురుషాంగాలను జంతువుల పేర్లతో అంటే కుందేలు (చిన్న పరిమాణం), ఎద్దు (మధ్యస్థమైన పరిమాణం) మరియు గుర్రం (పెద్ద పరిమాణం)గా వర్గీకరించారు.

  ఈ వయస్సులో పెరుగుతుంది

  ఈ వయస్సులో పెరుగుతుంది

  బాలురులో కౌమరదశలో, 11 నుంచి 18 ఏళ్ల వయస్సు మధ్యలో పురుషాంగం పొడవు పెరగడం ప్రారంభమవుతుంది. 21 ఏళ్లు వచ్చే వరకు పురుషాంగం పెరుగుతూనే ఉంటుంది. తర్వాత దాదాపుగా ఆగిపోతుంది.

  ఇంతలా సాగుతుంది

  ఇంతలా సాగుతుంది

  పురుషాంగం సగటున 12 నుంచి 13 సెం.మీ. పొడవు వరకు సాగుతుంది. అలాగే అంగస్తంభన సమయంలో, పురుషాంగం సగటు పొడవు 14 నుంచి 16 సెం.మీ.లగా ఉంటుంది. పట్టుసడలిన పురుషాంగం చుట్టుకొలత సగటున 9 నుంచి 10 సెం.మీ. మరియు అంగస్తంభన సమయంలో 12 నుంచి 13 సెం.మీ. ఉంటుంది.

  తక్కువగా ఉందని

  తక్కువగా ఉందని

  కొంతమంది పురుషులు, పురుషాంగం తక్కువ పొడవు ఉండటం అనే అంశం మానసిక సమస్యగా మారవచ్చు. స్మాల్ పెనిస్ సిండ్రోమ్ అనేది ఒక పురుషుడు తన జననావయవాలను నేరుగా (టాయిలెట్‌ల్లో) లేదా పరోక్షంగా (స్విమ్మింగ్ పూల్‌లో దిగడానికి దుస్తులు ధరించినప్పుడు లేదా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు) ఇతరులు చూసేస్తారేమో అని ఆందోళన పడే పరిస్థితిని సూచిస్తుంది.

  మహిళల అభిప్రాయం

  మహిళల అభిప్రాయం

  అత్యధిక సర్వేల్లో మహిళలు పురుషాంగ పొడవు గురించి ఎలాంటి ఆందోళనను వ్యక్తం చేయలేదు. ఒక సర్వేలో సుమారు 6% మంది మహిళలు మాత్రమే వారి భాగస్వాములు సగటు పొడవు పురుషాంగం కంటే తక్కువ పొడవు కలిగి ఉన్నట్లు భావించారు. ఈ సర్వేలో 55% మంది మాత్రమే పురుషులు వారి పురుషాంగ పొడవు గురించి సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొనగా, సుమారు 85% మంది మహిళలు వారి భాగస్వామి యొక్క పురుషాంగ పొడవు గురించి సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. 14% మంది మహిళలు మాత్రమే వారి భాగస్వామి పొడవైన పురుషాంగం కలిగి ఉండాలని కోరుకున్నారు.

  వంగి ఉండడం

  వంగి ఉండడం

  కొందరిలో పురుషాంగం స్తంభించినప్పుడు వంకరగా ఉండవచ్చు. పురుషాంగ స్తంభన అనేది స్తంభన కణజాలంలోని మృదువైన కండరాలు విశ్రాంతి ఉండటం వలన, ఎక్కువ రక్తం పురుషాంగంలోకి ప్రవేశిస్తుంది. పురుషాంగంలోని స్పాంజ్ వంటి స్తంభన కణజాలం (కార్పోరా కావెర్నాస్) రక్తంతో ఉబ్బుతుంది, ఈ కారణంగా ఈ కణజాలం అత్యధిక ఒత్తిడికి గురవుతుంది.

  పొడవుగా ఉండే పురుషాంగం

  పొడవుగా ఉండే పురుషాంగం

  పొడవైన పురుషాంగం మరియు లఘు అంగం గల పురుషులకు పురుషాంగం స్తంభించినప్పుడు కిందికి వంగుతుంది. కొందరిలో నిటారుగా ఉంటుంది. కొంతమంది పురుషుల్లో, పురుషాంగం ఎడమకు లేదా కుడికి వంగవచ్చు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

  యోని లోతు

  యోని లోతు

  సాధారణంగా స్త్రీ యోని లోతు (పొడవు) మూడున్నర అంగుళాలు మాత్రమే ఉంటుందని, ఇందులో జొప్పించేందుకు పురుషాంగం పొడవు నాలుగు అంగుళాల ఉంటే సరిపోతుంది. మరీ పెద్ద అంగం ఉన్నవారితో సంభోగం చేసే సమయంలో ఆడవాళ్లు ఇబ్బందికి గురవుతారు. పురుషాంగం పరిమాణం పెద్దగా ఉన్నకొద్దీ దాని పట్ల ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.

  భార్యను ఫోర్‌ప్లేల ద్వారానే భావప్రాప్తికి గురి చేసి ఆ తర్వాత స్ట్రోక్స్ ఇచ్చినట్టయితే భార్యకు పూర్తి సుఖాన్ని అందించడమే కాకుండా, పురుషుడు కూడా మంచి అనుభూతిని పొందుతారు.

  సున్నితంగా

  సున్నితంగా

  అంగం లోని తల భాగం చాలా సున్నితంగా ఉంటుంది. సెక్స్ చేసే సమయంలో, దీని మీద జరిగే రాపిడి పురుష స్కలనానికి కారణం అవచ్చు.

  కుచించుకుపోవడం

  కుచించుకుపోవడం

  అవును పురుషాంగం వివిధ కారణాల వలన కుంచించుకు పోతుంది. పురుష అంగంలో రక్త ప్రసరణతగ్గినప్పుడు, నాగం సెంటి మీటరు మేరకు తగ్గుతూ ఉంటుంది.

  విరిగిపోతాయి

  విరిగిపోతాయి

  పురుషాంగంలో ఎముకలు లేకపోయినా, అది విరిగిపోయే అవకాశం ఉంది. విపరీతమైన సెక్స్ చేయడం. స్తంభించిన అంగంతో కింద పడడం, ఇందుకు కారణాలు.

  6 సెకండ్లు మాత్రమే

  6 సెకండ్లు మాత్రమే

  శృంగార చివరి అంకం అయిన భావప్రాప్తి పురుషలకు 6 సెకండ్లు మాత్రమే ఉంటుంది. కానీ మహిళలకు మాత్రం భావప్రాప్తి 23 సెకండ్ల వరకు ఉండచ్చు. మొత్తానికి శృంగారంలో బాగా ఎంజాయ్ చేయాలంటే మీ పురుషాంగం సైజ్ తో అస్సలు పని లేదు. అది అపోహ మాత్రమే. కనీస సైజ్ ఉంటే చాలు.

  English summary

  Array

  15 facts you didn't know about the male private part
  Story first published: Tuesday, January 23, 2018, 13:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more