Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
భర్తలు అలా చేస్తే భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ఆ విషయంలో అస్సలు అలా చేయకూడదు
కొందరు భర్తల్లో నిజాయితీ లోపించడం వల్ల కూడా భార్యలు వేరొకరితో సంబంధాన్ని కొనసాగించాలనుకుంటారు. భర్త వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్యలు తాము ఎందుకు ఆ పని చేయకూడదని అనుకుంటారు.
ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. కొందరు చిన్నచిన్న సమస్యలకే విడాకులు ఇచ్చి వెళ్తుంటారు. ఇందుకు చాలా కారణాలున్నాయి.
కొందరు చిన్నచిన్న కారణాల వల్ల వైవాహిక సంబంధాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తల్లో ఎవరైనా సరే తామే ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, తమదే పై చేయి కావాలనుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కొందరు భార్యలు తమ బతుకేదో తాము బతుకుతామనే ధీమాతో ఉండడం వల్ల కూడా కాపురాలు నాశనం అవుతుంటాయి.

సర్దుకపోయేతత్వం లేకపోవడం
ఇక కొందరు భర్తలు కూడా భార్యల అభిప్రాయాలను, అభిరుచులను పట్టించుకోకుండా ఎలా అంటే అలా ప్రవర్తిస్తుంటారు. నన్ను పెళ్లి చేసుకుంది కదా, నేను ఎలా చెబితే అలా వినాలని అనుకుంటారు. అలా పెత్తనం చెలాయించడం వల్ల కూడా చాలా కాపురాలు కూలుతున్నాయి.
కొందరు భార్యాభర్తలో సర్దుకుపోయే తత్వం అస్సలు ఉండదు. దీని వల్ల కూడా భార్య భర్తతో కాకుండా మరో వ్యక్తితో ఎక్కువగా స్నేహంగా ఉండడానికి ఇష్టపడుతుంది. తనతో చీటికి మాటికి గొడవపడే భర్త అంటే భార్యకు అస్సలు ఇష్టం ఉండదు.

కడదాక కలిసి ఉండేవారు
మన సంప్రదాయంలో పెళ్లికి చాలా విలువ ఉంది. గతంలో ఒక్కసారి పెళ్లయితే ఆ దంపతులు కడదాక కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ పక్క సంస్కృతులకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం అరేంజ్ మ్యారేజ్ లతో పాటు లవ్ మ్యారేజ్ లు కూడా గట్టిగా నిలబడడం లేదు. భార్యాభర్తల మధ్య ఎక్కువగా సహనం లేకపోవడంతో ఇలాంటి దుస్థితి వచ్చింది.

నిద్ర పోయే విషయంలో కూడా గొడవ
కొందరు రాత్రి పూట నిద్ర పోయే విషయంలో కూడా గొడవపడుతుంటారు. భర్త గురక పెడుతున్నాడని కొందరు భార్యలు, నెలసరి అప్పుడు తన సమస్యలు అర్థం చేసుకోకుండా సెక్స్ లో పాల్గొనమని భర్త కోరుతున్నాడని కొందరు భార్యలు గొడవపడుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు కూడా ఇద్దరి మధ్య దూరం పెంచుతాయి. దీంతో భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆలోచిస్తుంది.

అక్రమసంబంధానికి దారి తీస్తుంది
ఇక కొందరు భర్తలు పని బిజీలో ఉండి భార్యలను పట్టించుకోరు. కనీసం ఆమె తినిందా లేదా అని కూడా అడగరు. ఆమె బాగోగులు అస్సలు పట్టించుకోరు. దీంతో ఆటో మేటిక్ గా అమ్మాయిలు వారితో చనువుగా మాట్లాడే అబ్బాయిలకు దగ్గరవుతుంటారు. క్రమంగా ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. తర్వాత అది అక్రమసంబంధానికి దారి తీస్తుంది.

వేరే దారి వెతుక్కుంటారు
ఇక కొందరు భర్తలు భార్యపై ఎక్కువగా అధికారం చెలాయిస్తారు. భార్య ఎప్పుడూ అణిగిమనిగి ఉండాలనుకుంటారు. తను ఏం చెప్పినా ఎదురు చెప్పకూడదనుకుంటారు. అలా ప్రవర్తించే అబ్బాయిలంటే అమ్మాయిలకు కోపం. సో మళ్లీ వేరే దారి వెతుక్కుంటారు.

నువ్వు ఉన్నావ్ బర్రె ముఖం వేసుకుని
మరికొందరు దంపతులు తమ భాగస్వామిని ఇతరులతో పోల్చి చూస్తారు. దీని వల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి. ఫలానా అమ్మాయి ఎంత అందగా ఉంది చూడు... నువ్వు ఉన్నావ్ బర్రె ముఖం వేసుకుని అంటే భార్యకు ఎక్కడో మండుతుంది. ఇంకొందరు రాత్రి పూట సుఖం అంతగా అందించడం లేదని డైరెక్ట్ గా చెబుతూ ఉంటారు. దీంతో కూడా అమ్మాయిలు వేరే అబ్బాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుంటారు.

భర్త వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడని
ఇక కొందరు భర్తల్లో నిజాయితీ లోపించడం వల్ల కూడా భార్యలు వేరొకరితో సంబంధాన్ని కొనసాగించాలనుకుంటారు. భర్త వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్యలు తాము ఎందుకు ఆ పని చేయకూడదని అనుకుంటారు. దీంతో కూడా అమ్మాయిల అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుంటారు.

గతంలో చేసిన తప్పుల గురించి ప్రస్తావించకూడదు
అయితే చిన్న చిన్న విషయాలకు తగదాలు పడకుండా ఉండడం, భార్య పట్ల ప్రేమ చూపించడం, ఆమె కష్టసుఖాలన్నీ కూడా అన్ని వేళల తెలుసుకోవడం వంటివి చేయాలి. మీ మాటే ఎప్పుడూ నెగ్గాలని భావించకూడదు. అనవసరంగా గతంలో చేసిన తప్పుల గురించి ప్రస్తావించకూడదు. తప్పులు అనేవి ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. వాటిపై చర్చ పెట్టి మీ బంధాన్ని తెంచుకోకండి.

సెక్స్ కు సంబంధించిన కారణాల వల్ల
ఇక భార్య మైనస్ పాయింట్లను ఇతరుల వద్ద చెప్పి ఆమెను అవమానపరచకండి. ఏ విషయంలోనూ భార్య దగ్గర దాపరికం చూపొద్దు. అలా చేస్తే అనుమానం పెరిగి బంధం బీటలు వారుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగే విషయాలను ఎవరితో కూడా చర్చించొద్దు. కొందరు సెక్స్ కు సంబంధించిన కారణాల వల్ల కూడా విడిపోతూ ఉంటారు. ఇలా అన్ని విషయాల్లో మీరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.



Click it and Unblock the Notifications