మన ప్రేమ గురించి కెమిస్ట్రీ సర్ కు తెలుసు.. కాలేజీలో వచ్చిన రూమర్స్ నాకు గుర్తు - #mystory134

Written By:
Subscribe to Boldsky

మనం అప్పుడు ఇంటర్ చదువుతున్నాం. వాలైంటెన్ డేన నువ్వు నా డెస్క్ వద్దకు వచ్చి ప్రపోజ్‌ చేశావు. నా బెంచీపై గులాబీ పువ్వు, గ్రీటింగ్ కార్డు పెట్టి వెళ్లావు. నా మస్సులో నీపై ప్రేమ ఉంది కానీ.. చెప్పాలంటే భయం. ఫ్రెండ్స్ అందరి ముందు నువ్వు అలా నాకు ఐ లవ్ యూ చెబితే నేను ఫీలయ్యాను. అందరికీ నాపై చిన్నచూపు కలుగుతుందని నా భయం.

కెమిస్ట్రీ సర్ కు తెలిసినప్పుడు

కెమిస్ట్రీ సర్ కు తెలిసినప్పుడు

కెమిస్ట్రీ సర్ కు మన గురించి తెలిసినప్పుడు.. ఆయన మనల్ని తిట్టినప్పుడు నేను ఏడ్చాను. నువ్వు నా దగ్గరకు వచ్చి నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగావు. ఆ సమయంలో నీకు నేను ఏం చెప్పాలనే విషయం అర్థం అయ్యేది కాదు.

ఎన్నో రూమర్లు

ఎన్నో రూమర్లు

అందరూ మన గురించి తప్పుగా మాట్లాడుకునేవారు. నేను ఎప్పుడూ ప్రేమించానని చెప్పలేదు. కానీ కాలేజీలో మాత్రం మన ఇద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చాయి. కనీసం నీతో నేను ఎన్నడూ మాట్లాడింది కూడా లేదు.

ప్రేమాయాణం

ప్రేమాయాణం

నువ్వు నన్ను ఒన్ సైడ్ లవ్ డీప్ గా చేయడం వల్ల నేను కూడా నీతో ప్రేమాయాణం నడుపుతున్నానని అందరూ అనుకున్నారు. వాస్తవం ఏమిటో నీకు నాకు మాత్రమే తెలుసు.

ఇష్టమని చెప్పలేకపోయా

ఇష్టమని చెప్పలేకపోయా

నువ్వు ఇంటర్ లో రెండేళ్లు నన్ను ప్రేమిస్తున్నా అని వెంటపడ్డావు. నువ్వంటే నాకు కూడా ఇష్టమని ఆ సమయంలో నేను చెప్పలేకపోయా. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమో కాదో నాకు తెలియదు.

నీ ప్రేమలోపడ్డాను

నీ ప్రేమలోపడ్డాను

అందుకే ప్రేమ్.. నువ్వు నన్ను అన్ని సార్లు ప్రేమిస్తున్నా అని చెప్పినా కూడా నేను ఏమీ చెప్పలేకపోయాను. నువ్వు ఇంటర్ లో చేరిన మొదటి రోజే నేను నీ ప్రేమలోపడ్డాను. నువ్వు నన్ను ప్రేమించానని నీ మనస్సులో మాట చెప్పేవాడివి కానీ నాతో ఏనాడు తప్పుగా ప్రవర్తించ లేదు.

ఎందుకుచెప్పలేదో తెలుసా?

ఎందుకుచెప్పలేదో తెలుసా?

నేను నీ ప్రేమను అంగీకరించకుండా తిరస్కరించడానికి నాకు కారణం కూడా దొరకలేదు. కానీ నీకు ఎందుకు ఒకే చెప్పలేదో తెలుసా? నీకు ఒక్కసారి ఐ లవ్ యూ టూ అని చెబితే నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేనుండలేను.

ఏదైనా చెయ్యడానికి వెనుకాడవు

ఏదైనా చెయ్యడానికి వెనుకాడవు

మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అని తెలుసు. నేను నీ ప్రేమను అంగకరిస్తే నువ్వు నాకోసం ఏదైనా చెయ్యడానికి వెనుకాడవు. నీ మనస్తత్వం నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఎదురైనా నన్ను నువ్వు వదులుకోవు... ఇవన్నీ తెలిసే నేను నీకు ఒకే చెప్పలేదు.

జీవితం నాశనం అవుతుందని

జీవితం నాశనం అవుతుందని

ఎందుకంటే నీ ప్రాణానికి తెగించి నువ్వు మా వాళ్లతో గొడవపడతావని తెలుసు. ఆ క్రమంలో నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే నీకు ఓకే చెప్పలేదు ప్రేమ్. నా వల్ల నీ జీవితం నాశనం అవుతుందనే నేను ఏమీ చెప్పలేదు ప్రేమ్.

బాగా స్థిరపడ్డావట

బాగా స్థిరపడ్డావట

నేను ఆ రోజు నీకు ఒకే చెప్పకపోవడం వల్ల నువ్వు కొన్నాళ్లు బాధపడి మరిచిపోయి ఉంటావ్. నువ్వు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఇప్పుడు జీవితంలో బాగా స్థిరపడ్డావని నాకు తెలిసింది.

చాలా లక్కీ

చాలా లక్కీ

నేను మా ఇంట్లో చూసిన సంబంధాన్ని ఒకే అన్నాను. అతన్నే పెళ్లి చేసుకున్నాను. నా జీవితం కూడా బాగుంది. కానీ ప్రేమ్.. నువ్వు చేసుకోబోయే అమ్మాయి మాత్రం చాలా లక్కీ.

నువ్వు నాకు బలం

నువ్వు నాకు బలం

నీ ప్రేమ ఏమిటో నాకు తెలుసు ప్రేమ్. ఇంటర్ లో నువ్వు నాకు ఒక బలం. నీ లవర్ అని తెలిసి నా వైపు ఒక్కరూ కూడా కన్నెత్తి చూసేవారు కాదు. నీ మాటల్లో ఏదో పవర్ ఉంది. ఎవరైనా నీ మాటలకు ఫ్లాట్ కావాల్సిందే.

తెలియని ఫీలింగ్‌

తెలియని ఫీలింగ్‌

ఇప్పటికీ ఊరికి వచ్చినప్పుడు నువ్వు కనబడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్‌ కలుగుతుంది. నిన్ను చూస్తుంటే మెమోరీస్ సీడీనీ డీవీడీ ప్లేయర్ లో వేసి ప్లే చేసినట్లుంది. నిన్ను చూస్తే ఎప్పుడూ ఏదో తెలియని ఆనందం.

మంచి అమ్మాయి భార్యగా వస్తుందని..

మంచి అమ్మాయి భార్యగా వస్తుందని..

కానీ నీ బాగు కోసమే నేను ప్రేమను ఒప్పుకోలేదు. నువ్వు బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉండాలన్నదే నా కోరిక. నీకు నా కన్నా మంచి అమ్మాయి భార్యగా వస్తుందని నా నమ్మకం. ఇదంతా నేను నీతో నేరుగా చెప్పలేకపోయినా... నా మనస్సును అర్థం చేసుకునే గుణం నీకుందని నాకు తెలుసు ప్రేమ్.

English summary

a lover he was a lover she was but what was love

a lover he was a lover she was but what was love
Story first published: Saturday, March 31, 2018, 15:55 [IST]