Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
విచిత్రం! కొత్త జంటలు మూడు రోజుల వరకు వాష్ రూమ్ ను వినియోగించకూడదట!
విచిత్రం! నూతన వధూవరులు మూడు రోజుల వరకు వాష్ రూమ్ ను వినియోగించకూడదట!
ప్రపంచవ్యాప్తంగా వివాహానికి సంబంధించి అనేక ఆచారాలు ఆచరణలో ఉన్నాయి. వధువుకు పాలను అందించటం దగ్గర నుంచి పెళ్లి సమయంలో పాటలు పాడటం వంటి ఆచారాలకు కొదవే లేదు.
అయితే, కొన్ని ఆచారాలు సరదాగా ఉంటే మరికొన్ని ఆచారాలు ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. వాటిని ఆచారం కంటే హింసగా భావిస్తారు కొందరు. అటువంటి ఒక వింతైన ఆచారాన్ని మనం ఇండోనేషియాలో గమనించవచ్చు.

ఈ వింతైన ట్రెడిషన్ అనేది మిమ్మల్ని ఎంతో కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది. కొత్తగా పెళ్ళైన వారు మూడు రోజుల పాటు వాష్ రూమ్ ను వినియోగించకూడదట. ఇందులో ఇంకొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నూతన దంపతులు తమ రొటీన్ లో ఏ మాత్రం మార్పులు చేర్పులు చేసుకోకూడదు. కానీ, వాష్ రూమ్ ను మాత్రం వినియోగించకూడదు.
వింతైన వివాహ సాంప్రదాయాలు
ఈ వింతైన ఆచారం గురించి మరింత తెలుసుకుందాం. మూడు రోజులపాటు నూతన దంపతులు వాష్ రూమ్ ను వినియోగించకూడదు. ఈ విషయంలో వీరిపై పర్యవేక్షణ జరుగుతుంది.
ఈ స్ట్రిక్ట్ రూల్
ఇండోనేషియాలోని తైడాంగ్ అనే కమ్యూనిటీలో ఈ నియమాన్ని శతాబ్దాలుగా పాటిస్తున్నారు. ఈ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఈ నియమానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఈ ట్రెడిషన్ అనేది ఆరోగ్యకరమైనదని వారు నమ్ముతారు. తైడాంగ్ ట్రైబ్ లో ఈ నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు.
నూతన దంపతులకు శిక్షలా అనిపించే ఆచారం
ఈ విచిత్రమైన ఆచారం వలన నూతన దంపతులు ఇబ్బందులకు గురవుతారని, ఇది నూతన దంపతులను హింసించే చర్యని కొందరు భావిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకోకుండా ఒక వ్యక్తి మూడు రోజుల పాటు ఎలా ఉండగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నియమాన్ని ఉల్లఘించకుండా ఉండేందుకు ఆ ఇంటి పెద్దలు నూతన దంపతులపై ఓ కన్నేసి ఉంచుతారట కూడా!
ఆచారం వెనుక నమ్మకం!
ఈ వింతైన ట్రెడిషన్ ప్రకారం నూతన దంపతులు మూడు రోజుల పాటు కాలకృత్యాలను తీర్చుకోకూడదు. అంటే మూడు పగళ్లు అలాగే మూడు రాత్రుల పాటు కాలకృత్యాలను తీర్చుకోకూడదు. ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా వారికి మంచి జరుగుతుందని అదృష్ట దేవత వారిని కరుణించి వారి కాపురం వెయ్యేళ్ళ పాటు వర్థిల్లుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఈ ఆచారాన్ని పాటించకపోతే, ఆ దంపతుల మధ్యన విబేధాలు తలెత్తే ప్రమాదం ఏర్పడుతుందని, అలాగే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవవచ్చని నమ్మకం!
ఆచారం పూర్తైన తరువాత
ఈ ఆచారాన్ని పాటిస్తున్న సమయంలో దంపతులకు కేవలం కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందిస్తారు. ఈ నియమానికి చెందిన మూడు రోజుల సమయం పూర్తైన తరువాత ఆ జంట స్నానాదికాలు పూర్తిచేసుకోవచ్చు. రొటీన్ లో పడవచ్చు. రెగ్యులర్ లైఫ్ ను లీడ్ చేయవచ్చు.
ఇటువంటి వింతైన ఇతర ఆచారాలు!
ఈ కమ్యూనిటీకి చెందిన మరొక వింతైన ఆచారం ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్లికూతురు కోసం అనేక ప్రేమగీతాలను పాడాలి. అప్పుడే, పెళ్లి కూతురు పెళ్ళికొడుకుని చూడగలుగుతుంది. పెళ్లికూతురు పెళ్ళికొడుకు పాడిన ప్రేమగీతాలకు ముగ్ధురాలయ్యాక వారిద్దరి మధ్యనున్న తెరను తొలగిస్తారు. అప్పుడే, వారిద్దరూ ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటారు.
మరొక వింత ఆచారం!
పెళ్ళికొడుకు పెళ్ళికి ఆలస్యంగా వస్తే, నగల రూపంలో ఫైన్ ను చెల్లించాలి. అందువలన, ఈ విషయంలో పెళ్లికొడుకులు సాధారణంగా జాగ్రత్తలు పాటిస్తారు. వివాహానికి సమయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. లేదంటే, చక్కటి ఆభరణాన్ని తమ భాగస్వామికి సంతోషంగా అందిస్తారు.
ఇటువంటి వింతైన అలాగే ఆసక్తికరమైన ఆచారాల గురించి తెలుసుకోవాలంటే బోల్డ్ స్కై కు ట్యూన్ అయి ఉండండి మరి!



Click it and Unblock the Notifications
