ఆ అలవాట్లు ఉంటే మగవారు సెక్స్ లో వీక్ అయిపోతారు

Written By:
Subscribe to Boldsky

పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు సెక్స్ అంటే భార్యాభర్తలిద్దరూ చాలా ఆసక్తి చూపుతారు. తర్వాత సెక్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపరు. దాన్ని ఏదో మెకానికల్ గా కానిచ్చేస్తుంటారు. ఆడవారి కంటే మగవారు ఎక్కువగా సెక్స్ విషయంలో ఇంట్రెస్ట్ చూపని పరిస్థితులుంటాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి.

స్ట్రెస్

స్ట్రెస్

చాలా మంది మగవారు ఎక్కువగా స్ట్రెస్ కు లోనవుతుంటారు. ఆఫీసు పనుల వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో వారికి ఎక్కువగా సెక్స్ మీద దృష్టి ఉండదు. క్రమంగా సెక్స్ జీవితానికి దూరమవుతూ ఉంటారు.

ఆల్కహాల్స్

ఆల్కహాల్స్

ఆల్కహాల్స్ తాగే మగవారిలో కూడా సెక్స్ కోరికలు కాస్త తగ్గిపోతాయి. అలాగే కాఫీ ఎక్కువగా తాగే మగవారిలో కూడా సెక్స్ కోరికలు తగ్గుతాయి. ఈ రెండు అలవాట్లు ఉన్న మగవారిలో కూడా శృంగార సామర్థ్యం మరింత తగ్గుతుంది.

నిద్ర తక్కువగా పోవడం

నిద్ర తక్కువగా పోవడం

నిద్ర తక్కువ పోవడం కూడా సెక్స్ పై అనాసక్తి రావడానికి ఒక ప్రధాన కారణం. సరైన నిద్ర లేకపోతే శరీరం శృంగారంలో పాల్గొనాలని అస్సలు కోరుకోదు. అందువల్ల మగవారు సెక్స్‌లో బాగా పాల్గొనాలంటే ఎక్కువసేపు నిద్రపోవాలి.

వ్యాయామం చేయకపోవడం

వ్యాయామం చేయకపోవడం

కొందరు మగవారు వ్యాయామం అస్సలు చేయరు. దీంతో సెక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు బాగా పని చేస్తాయి. వ్యాయామం సరిగ్గా చేసే్త సెక్స్ చేయడానికి వీలుంటుంది.

పోర్న్ చూడడం

పోర్న్ చూడడం

పోర్న్ చూసే మగవారు కూడా ఎక్కువగా సెక్స్ చేయలేరు. పోర్న్ చూసినప్పుడు పొందే ఆనందం అమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పొందలేరు. అందుకే ఏదో మొక్కుబడిగా సెక్స్ ముగించేస్తుంటారు. పోర్న్‌కు దూరంగా ఉంటే సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

అంగస్తంభన సరిగ్గాలేకపోవడం

అంగస్తంభన సరిగ్గాలేకపోవడం

కొందరి మగవారిలో అంగస్తంభన వైఫల్యం జరగడం సాధారణంగా కనిపిస్తుంది. దీనికి కారణం పరస్పర ఆకర్షణ తగ్గడం. అలాగే యాంత్రికంగా మారిన లైంగిక జీవితం వల్ల అంగస్తంభన వైఫల్యం జరుగుతుంది.

రకరకాల జబ్బులు

రకరకాల జబ్బులు

రక్తపోటు, ఉబ్బసం, గుండెజబ్బులు, సయాటిక సమస్యలతో బాధపడేవారిలో కూడా సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల స్టెరాయిడ్స్ వాడటం వల్ల డిప్రెసన్‌కు వాడే మందుల వల్ల అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.

టెస్టులు చేయించుకోవాలి

టెస్టులు చేయించుకోవాలి

మగవారిలో సెక్స్ కోరికలు తగ్గితే ఫినైల్ డాప్లర్ స్టడీ, టెస్టోస్టిరాన్ లెవల్స్, టీఎస్‌హెచ్, బ్లడ్ షుగర్ లెవల్స్, ప్రొస్టేట్ ఎగ్జామినేషన్ లాంటి పరీక్షలతో అంగస్తంభన వైఫల్యాలను గుర్తించవచ్చు.

బయటి విషయాలు బెడ్రూమ్ లో మాట్లాడడం

బయటి విషయాలు బెడ్రూమ్ లో మాట్లాడడం

ఎక్కడో జరిగిన విషయాలను, గొడవలను, బయటి విషయాలు బెడ్రూమ్ లో మాట్లాడడం మంచిది కాదు. దీంతో కూడా భార్యాభర్తలిద్దరూ సెక్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. మగవారు శృంగారానికి ఆసక్తిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను ఆడవారు గుర్తు చేస్తారు. దీంతో సెక్స్ పై ఆసక్తి తగ్గి ఆ గొడవల గురించి ఆలోచిస్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడకండి.

శరీరం కొలతలు మారడం

శరీరం కొలతలు మారడం

ఇక ఆడవారి శరీరం కొలతలు వారి ప్రసవం జరిగిన తర్వాత కాస్త మారుతాయి. వారి శరీరం లావుగా అవడం, వారి నడుము చుట్టూ మార్క్స్ ఉండటం జరుగుతుంది. అలాగే మహిళలు బరువు పెరగడం వంటివి జరుగుతాయి. దీంతో మగవారిలో వాంచలు తగ్గిపోతాయి. కాబట్టి ఆడవారు శరీరాన్ని స్లిమ్ గా ఉంచుకోవాలి.

ఇలా చేయాలి

ఇలా చేయాలి

శృంగారానికి ముందు దంపతులు సెక్స్ మూడ్‌ను పెంచే విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఫోర్ ప్లే చేసుకోవాలి. దీంతో ఇద్దరిలో తెలియని ఉద్రేకం మొదలవుతుంది. తర్వాత సెక్స్ స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల సెక్స్ పై రోజురోజుకు మోజు పెరుగుతుంది.

English summary

common causes of low libido in men

common causes of low libido in men
Story first published: Tuesday, March 20, 2018, 13:00 [IST]