ఉడుకెత్తించే 7 ఫోర్‌ప్లే భంగిమ‌లు తెలుసుకోవాల‌నుందా?

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఫోర్‌ప్లే లో కాస్తంత ప్ర‌యోగాలు చేస్తేనే క‌దా సెక్స్ మ‌జాగా అనిపించేది. ఒకేలాంటి ఫోర్‌ప్లే ప్ర‌యోగాల‌తో విసుగెత్తిపోయారా. ? అయితే కొత్త ప్ర‌యోగాలు చేసి శృంగార భ‌రిత అనుభ‌వాన్ని మ‌రింత ఇనుమ‌డింప‌జేసుకోండి. కొన్ని ఉడుకెత్తించే, క‌సి పెంచే ఫోర్‌ప్లే టెక్నిక్స్ చూద్దామా మ‌రి...

1. రొమాంటిక్ డ్యాన్స్‌

1. రొమాంటిక్ డ్యాన్స్‌

నేరుగా ముద్దుల్లో ప‌డిపోకుండా... మొద‌ట ఎరోటిక్ మ్యూజిక్ పెట్టుకొని చూడండి. రొమాంటిక్ పాట‌ల ల‌య‌బ‌ద్ద శ‌బ్దాల‌కు ఒళ్లు పుల‌క‌రించి నృత్యం చేసి మీ భాగ‌స్వామిని క‌వ్వించండి చాలు.. ఇక ఆ త‌ర్వాత చేయ‌బోయే సెక్స్ చందమామను చూపిస్తుంది.

2. ప్రేమ ఒల‌క‌బోస్తూ...

2. ప్రేమ ఒల‌క‌బోస్తూ...

నేరుగా శృంగారంలో పాల్గొన‌కుండా కాస్త చ‌నువు తీసుకొని మీ భాగ‌స్వామి ప‌క్క‌నే కూర్చొని చూడండి. ఆ రోజు ఎలా గ‌డిచింది, మీరు త‌న‌ను ఎంత‌గా ప్రేమిస్తున్నారు అనే సంగ‌తుల‌ను కాస్తంత ముచ్చ‌ట‌గా చెప్పేయండి. అంత ప్రేమ చాలు రాత్రికి కావాల్సిన డోసు అందించ‌డానికి.

3. మ‌సాజ్ .. మ‌సాజ్‌

3. మ‌సాజ్ .. మ‌సాజ్‌

సువాస‌న‌లు వెద‌జ‌ల్లే నూనెలు, మ‌స‌క మ‌స‌క దీపాల వెలుగు, సుమ‌నోహ‌ర రాగాలు .. వీటి మ‌ధ్య మీ భాగ‌స్వామిని వెల్ల‌కిలా ప‌డుకోబెట్టి కాస్తంత మ‌సాజ్ చేశార‌నుకోండి. అప్పుడు వారికి ఎక్క‌డ లేని ప్ర‌శాంత‌త‌, హాయి క‌లుగుతుంది. రొమాంటిక్ ఫీలింగ్ మొద‌లై నూత‌నోత్తేజంగా శృంగారం ర‌స‌భ‌రితం అవుతుంది. మ‌సాజ్ పేరుతో మీ గోర్ల‌తో చ‌ర్మాన్ని ర‌క్క‌కుండా చూసుకుంటే చాలు. త‌దుప‌రి కార్య‌క్ర‌మం ఘ‌న‌మే!

4. లో దుస్తుల‌తో ఊర‌డింపు

4. లో దుస్తుల‌తో ఊర‌డింపు

ఎప్పుడూ అవే లో దుస్తుల‌ను ఉంచుకుంటే ఏం ఆస‌క్తి ఉంటుంది. ఈ సారి మీ భాగ‌స్వామిని సెక్సీ లో దుస్తుల‌తో ఆక‌ర్షించండి. అత‌డు ఆఫీసులో ఉండ‌గానే మీరు ఇంట్లో లో దుస్తుల‌తో ఉన్న సెల్పీలు దిగి అత‌డికి పంపించి టెంప్ట్ చేసేయండి. దెబ్బ‌కు ప‌రుగెత్తుకుంటూ వ‌స్తాడు.!

5. ట్రూత్ ఆర్ డేర్‌

5. ట్రూత్ ఆర్ డేర్‌

బెడ్ పైన చేర‌గానే సెక్స్ మొద‌లు పెట్టేయ‌కుండా ఈ సారి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ట్రై చేయండి చూద్దాం. మొద‌ట ఎరోటిక్ ప్రశ్న‌లు వేయండి.. చివ‌ర్లో స్ట్రిప్ టీస్ లాంటివి ట్రై చేస్తే బాగుంటుంది.

6. ఎప్పుడూ ప‌డ‌క గ‌దే అంటే ఎలా...

6. ఎప్పుడూ ప‌డ‌క గ‌దే అంటే ఎలా...

ఎప్పుడూ ప‌డ‌క గదిలోనే శృంగారం చేయడ‌మంటే బోర్ క‌దా! ఈ సారి హాల్‌లోని సోఫా పైన లేదా కిచెన్ టేబుల్ పైన ప్ర‌యోగాలు చేయండి. బాత్రూమ్‌లో ష‌వ‌ర్ కింద కూడా బాగుంటుంది. అయితే జార‌కుండా చూసుకోండి సుమా!

7. ఐటెమ్ సాంగ్స్‌తో..

7. ఐటెమ్ సాంగ్స్‌తో..

ము.. ము.. ము.. ముద్దంటే చేదా! నీకా ఉద్దేశం లేదా.. ఇప్పుడొద్దాన‌వంటే చిన్న‌వాడా.. రేపు ఇమ్మ‌న్నా ఇస్తానా వెర్రివాడా లాంటి పాట‌లు పెట్టి మీ భాగ‌స్వామిని ఉడికించేసేయండి.

English summary

Foreplay moves to make your night exciting

A little bit experimentation during foreplay will never hurt your partner, right? Rather than going for the same foreplay moves, like always—try experimenting with something that will take your partner aback, and actually make them look forward to the sack sessions ahead! Here are some ideas to make your foreplay exciting like never before…
Story first published: Sunday, March 18, 2018, 16:00 [IST]