మా బాస్ ఒక్క రాత్రి గడుపుతావా అన్నాడు.. చాలా సార్లు గడిపాను.. ఉద్యోగంలో నుంచి తీసేశారు- #mystory121

Written By:
Subscribe to Boldsky

నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా భర్తకు ప్రస్తుతం జాబ్ లేదు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఎంసీఏ చేశాను. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు అక్కడ మంచి వేతనం ఇస్తున్నారు. జాబ్ కూడా చాలా బాగుంది.

కొత్త బాస్ వచ్చిన తర్వాత

కొత్త బాస్ వచ్చిన తర్వాత

అయితే మా బాస్ నుంచి నాకు రోజూ తలనొప్పి ఉంటుంది. గతంలో ఆయన లేక ముందు కాస్త వర్క్ ప్రెజర్ ఉండేది. కానీ చాలా హ్యాపీగా ఉండేది. అయితే కొత్త బాస్ వచ్చిన తర్వాత నాకు కొత్త సమస్యలు వచ్చాయి.

నాతో బాగా మెలిగితే

నాతో బాగా మెలిగితే

మా బాస్ నాకు ఎక్కువ వర్క్ ఇవ్వడు కానీ ఆయన పెట్టే టార్చర్ వేరే ఉంటుంది. నువ్వు ఆఫీస్ లో నాతో బాగా మెలిగితే నీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి అంటారు.

నా హ్యాండ్ ను గట్టిగా ఒత్తాడు

నా హ్యాండ్ ను గట్టిగా ఒత్తాడు

ఈ కొత్త బాస్‌ను రిక్రూట్ చేసిన రోజే అనుకున్నాను ఇతను కాస్త తేడా అని. ఎందుకంటే అతన్ని విష్ చేద్దామని వెళ్లాను. అతను నా హ్యాండ్ ను గట్టిగా ఒత్తాడు. అలాగే అతని చూపులు కూడా కాస్త తేడాగా ఉంటాయి. వాటన్నింటినీ నేను మొదటిరోజే గమనించాను.

క్యాబిన్ లోకి వెళ్లాక

క్యాబిన్ లోకి వెళ్లాక

ఇక నన్ను ఆ ఫైల్ తీసుకురా.. ఈ ఫైల్ తీసుకురా అంటూ అతడి కేబిన్‌కు పిలిపించుకుంటూ ఉంటాడు. క్యాబిన్ లోకి వెళ్లాక ఈజీగా బయటకు రానివ్వడు. ఏవేవో కబుర్లు చెబుతుంటాడు.

తన చూపుతోనే స్కాన్ చేస్తాడు

తన చూపుతోనే స్కాన్ చేస్తాడు

నా ముందు ఫోనులో ఏవేవో అసభ్యకర మాటలు మాట్లాడుతుంటాడు. ఇక నా బాడీనీ తన చూపుతోనే స్కాన్ చేస్తాడు. అతడి చేష్టలు మొత్తం నాకు తెలుసు. కానీ అతనిపై కంప్లెట్ ఇచ్చే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే అతను సీఈఓ బంధువు.

ఒక్కడి కోసం చూసుకుంటే

ఒక్కడి కోసం చూసుకుంటే

ఇక నాకే విసుగొచ్చి ఉద్యోగం మారుదామని ప్రయత్నించాను. కానీ ఎక్కడా కూడా ఇంత జీతాలు లేవు. అందులో టార్గెట్లు ఎక్కువగా ఉంటాయి. కొత్త వాతావరణం. ఒక్కడి కోసం చూసుకుంటే తర్వాత చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని అనుకున్నాను.

ఒక్కరాత్రి గడుపుతావా

ఒక్కరాత్రి గడుపుతావా

కొన్ని రోజుల క్రితం మళ్లీ క్యాబిన్ కు పిలిచాడు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు. చెప్పు అన్నాను. నాతో ఒక్కరాత్రి గడుపుతావా అని డైరెక్ట్ గా అడిగాడు.

జాబ్ గుర్తొచ్చి

జాబ్ గుర్తొచ్చి

నాకు ఆ క్షణం చాలా కోపం వచ్చింది. నేను బజారుదానిలాగా కనపడుతున్నానా? అని చొక్కా పట్టుకుని చెప్పుతో కొట్టాలనిపించింది. కానీ జాబ్ గుర్తొచ్చి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను.

డేటింగ్ చేయండి

డేటింగ్ చేయండి

కొన్ని రోజులు నాతో డేటింగ్ చేయండి అన్నాడు. నేను వెంటనే క్యాబిన్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాను. మూడు రోజుల పాటు లీవ్ పెట్టి వేరే ఉద్యోగం కోసం ట్రై చేశాను. ఎక్కడ జాబ్ దొరకలేదు. దొరకినా వాళ్లు పెట్టే వర్క్ టార్చర్ తెలిసి వెళ్లలేదు.

నువ్వు నాకు ఎంత సహకరిస్తే..

నువ్వు నాకు ఎంత సహకరిస్తే..

మూడు రోజుల తర్వాత మళ్లీ ఆఫీసుకు వెళ్లాను. బాస్ మళ్లీ కేబిన్‌కు పిలిచాడు. జస్ట్ డేటింగ్ అంటేనే జాబ్ మానేద్దామనుకుంటున్నావా అని అడిగాడు. నువ్వు నాకు ఎంత సహకరిస్తే నీకు ఆఫీసులో అంత మర్యాద లభిస్తుంది.

ఒక్క రాత్రి పడుకోలేవా?

ఒక్క రాత్రి పడుకోలేవా?

నాకు సహకరిస్తే నీకు ప్రమోషన్స్ వస్తాయి. జీతం పెరుగుతుంది. ఏం ఒక్క రాత్రి పడుకోలేవా అన్నాడు. మౌనంగా ఉండిపోయాను. తర్వాత బాస్ కు కమిట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక రోజు రాత్రి తనతో గడపాల్సి వచ్చింది.

సెక్స్ లో పాల్గొనకపోతే

సెక్స్ లో పాల్గొనకపోతే

ఒక్క రోజు అయిపోయింది. ఇప్పుడు ప్రతి రోజూ రమ్మంటున్నాడు. తనతో సెక్స్ లో పాల్గొనకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమోనని భయంతో తప్పని పరిస్థితుల్లో అతనితో సెక్స్ లో పాల్గొన్నాను.

జాబ్ నుంచి తీసివేశాడు

జాబ్ నుంచి తీసివేశాడు

మా ఇద్దరి గురించి తెలిసి సీఈఓ మమ్మల్ని జాబ్ నుంచి తీసివేశాడు. కంపెనీలో మా బాస్ హోదాను నమ్ముకుని అతనితో పడుకున్నా.. చివరకు శిక్ష అనుభవిస్తున్నా.

శిక్ష అనుభవించక తప్పదు

శిక్ష అనుభవించక తప్పదు

ఆఫీసుల్లో ఎంత పెద్ద హోదాలో ఉన్న వారితోనైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చివరకు ఏదో ఒక రోజు ఆ శిక్ష అనుభవించకతప్పదని నాకు అర్థం అయ్యింది.

English summary

he directly asked me to sleep with him

he directly asked me to sleep with him
Story first published: Thursday, March 22, 2018, 9:05 [IST]