For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భర్త మానసికంగా, శారీకంగా వేధించేవాడు, ఆ అబ్బాయి నా జీవితంలోకి వచ్చాక అన్నీ సుఖాలే #mystory258

By
|

ఆయనతో ఏడుగులు నడిచాను. ఏడేళ్ల పాటు ఆయనతో ఉన్నాను. పెళ్లయిన కొత్తలో ఆయనతో గడపడం చాలా కష్టంగా ఉండేది. ఆయన నా పక్కనుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన ప్రతీది అనుమానపడేవాడు. నేను నా ఫోన్ లో ఎడ్యుకేషన్ కు సంబంధించిన విషయాల గురించి బ్రౌజింగ్ చేసినా కూడా ఆయనకు డౌట్ వచ్చేది.

నా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే అనుమానపడేవాడు. నేను పేర్లు చూపించినా కూడా నమ్మేవాడు.. ఎవరికి తెలుసు అమ్మాయిల పేర్లు ఫోన్ లో సేవ్ చేసుకుని అబ్బాయిలతో మాట్లాడుతుంటారు మీ అమ్మాయిలు అనేవారు. అలా ప్రతి విషయంలో తను నాపై అనుమానంపడడంతో నాకు అతనిపై చాలా సార్లు విరక్తి వచ్చింది.

భర్త లేకుంటే ఉండలేమా

భర్త లేకుంటే ఉండలేమా

అయినా పెళ్లి చేసుకున్నాక విడిపోతే నాకే నష్టం.. కష్టమైనా నష్టమైనా అతనితోనే ఉందామనుకున్నాను. చాలా రోజులు భరించాను. అతను పెట్టే ప్రతి కష్టాన్ని కూడా ఎవ్వరితో చెప్పుకోలేదు. భరించాను... భరించాను.. చాలా రోజుల తర్వాత అనిపించింది భర్త లేకుంటే ఉండలేమా అని.

పుట్టింటికి వెళ్లిపోయాను

పుట్టింటికి వెళ్లిపోయాను

అందుకే అతనికి దూరంగా బతకాలని డిసైడ్ అయ్యాను. అయితే అప్పటికే నాకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లను తీసుకుని మా పుట్టింటికి వెళ్లిపోయాను. మగాడంటే ఎక్కడైనా బతకగలడు.. ఏమైనా చేయగలడు కానీ ఆడవారికి మెట్టినిల్లు.. పుట్టినిల్లు తప్ప మరో ధ్యాస ఉండదు. నాకు చివరకు పుట్టినిల్లే దిక్కు అయ్యింది.

నా భార్యను నేను అలా టెంప్ట్ చేస్తాను, దీంతో తను సెక్స్ కు బాగా సహకరిస్తుంది

నా భార్యను నేను అలా టెంప్ట్ చేస్తాను, దీంతో తను సెక్స్ కు బాగా సహకరిస్తుంది

ఏడేళ్ల పాటు మా ఆయనతో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా మెట్టినింట్లో వదిలి వచ్చేశాను. మా పెళ్లినాటి ఫొటోలు, ప్రమాణాలు గుర్తొచ్చి కళ్లలో నీళ్లు ఆగలేదు. నేను పుట్టింటికి వెళ్లినా కూడా ఆయన నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. తాను తప్పు చేస్తున్నాడనే భావన ఆయనకు అస్సలు లేదు.

Most Read : నా భార్యను నేను అలా టెంప్ట్ చేస్తాను, దీంతో తను సెక్స్ కు బాగా సహకరిస్తుంది

టార్చర్ భరించలేక

టార్చర్ భరించలేక

ఆయనకు నేను ఇంట్లో ఒక పని మనిషిలాగానే ఉపయోగపడేదాన్ని. ఆయనకు అప్పటికే చాలా మంది అమ్మాయిలతో సంబంధాలుండేవి. అందుకే నన్ను సరిగ్గాపట్టించుకునేవాడు కాదు. చాలాసార్లు ఆయన టార్చర్ భరించలేక చనిపోవాలనుకున్నా. నేను చస్తాను అన్నాను కూడా మా ఆయన నాపై కొంచెం కూడా సానుభూతి చూపేవారు కాదు.

పుట్టింటికి వెళ్లాక

పుట్టింటికి వెళ్లాక

నన్ను మా ఆయన రోజూ ఏదో కారణంతో తిట్టేవాడు నా బ్యాడ్ లక్ వల్ల నిన్ను చేసుకున్నాగానీ లేదంటే నాకు మంచి అమ్మాయి పెళ్లాంగా వచ్చేదనేవాడు. తన వల్ల నాపై నేను నమ్మకం కోల్పొవాల్సి వచ్చింది. నేను పుట్టింటికి వెళ్లాక తను మళ్లీ వచ్చి నన్ను తీసుకెళ్తాడేమోనని ఒక చిన్న ఆశ ఉండేది. ఎంతైనా భర్త దగ్గరే ఉంటే ఆ భరోసా వేరే ఉంటుంది.

మెంటల్ గా ఎంత టార్చర్ చేశాడో

మెంటల్ గా ఎంత టార్చర్ చేశాడో

అయితే తను విడాకులు కోరాడు. నా మనస్సును మరింత బాధపెట్టాడు. నేను వెంటనే ఒకే చెప్పేశాను. అయితే ఆ తర్వాత సమాజం నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. నా గురించే తప్పుగా మాట్లాడుకున్నారు. వాస్తవానికి మా ఆయన నన్ను మెంటల్ గా ఎంత టార్చర్ చేశాడో ఎవ్వరికీ తెలియదు.

Most Read : మా ఆయన ఆ భంగిమలో పాల్గొన్నప్పుడు వెంట్రుకలను గట్టిగా వెనక్కి లాగుతాడు, బూతులు మాట్లాడతాడు

తర్వాత నాకన్న చిన్నవాణ్ని పెళ్లి చేసుకున్నా

తర్వాత నాకన్న చిన్నవాణ్ని పెళ్లి చేసుకున్నా

కొన్నాళ్లకు ఒక ప్రైవేట్ జాబ్ లో జాయినయ్యాను. అక్కడ పరిచయమైన ఒక అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తను నా కంటే చిన్నవాడైనా నాకు సంబంధించిన ప్రతి విషయం తను అర్థం చేసుకునేవాడు. తను నన్ను ఏ రోజు కూడా ఇబ్బందిపెట్టలేదు.

మాససికంగా, శారీరకంగా నరకం

మాససికంగా, శారీరకంగా నరకం

నా మొదటి భర్తతో ప్రతి రోజూ నేను నరకం అనుభవించాను. మాససికంగా, శారీరకంగా అతను నాకు నరకం చూపించాడు. అతని మళ్లీ పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి కూడా ఏడాదేలోపు విడిచిపెట్టి వెళ్లిపోయింది. లోకం మొదట నన్ను తప్పుగా అర్థం చేసుకుంది.

మంచి స్థాయిలో ఉన్నా

మంచి స్థాయిలో ఉన్నా

కానీ అతని నుంచి విడిపోయాక స్వతంత్ర్యంగా బతకడం మొదలుపెట్టాను. నాకు వచ్చిన ప్రతి ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను. ఆఫీస్ వాళ్లే నన్ను చాలాసార్లు విదేశాలకు కాన్ఫరెన్స్ కోసం పంపారు.

Most Read : డబ్బు కోసం ఆ వృత్తిలోకి, ఆంటీ రెగ్యులర్ బుక్ చేసుకునేది, ఆ భంగిమల్లో చేయలేకపోయేవాణ్ని

ఇబ్బందులు లైఫ్ ను మారుస్తాయి

ఇబ్బందులు లైఫ్ ను మారుస్తాయి

జీవితంలో ఎదుయ్యే ఇబ్బందులు కూడా మన లైఫ్ ను మారుస్తాయని నాకు అర్థమైంది. కాబట్టి ఏ సమస్యను ఇబ్బందిగా ఫీల్ కాకండి. నిజంగా నా మొదటి భర్తే నా జీవితాన్ని మార్చాడని అనిపిస్తూ ఉంటుంది. అతను నాకు విడాకులు ఇవ్వకుంటే నేను ఇప్పటికీ ఆ చీకట్లో.. కష్టాల్లో నలిగిపోయేదాన్ని.

English summary

How My Husband Changed My Life

How My Husband Changed My Life