భార్య బరితెగించిందని భర్త బరితెగించకూడదు

Written By:
Subscribe to Boldsky

కొందరు భార్యలు భర్తల్ని మోసం చేస్తుంటారు. అందరూ అలాగా ఉండకపోవొచ్చు గానీ చాలామంది భార్యలు భర్తలను మభ్యపెడుతుంటారు. భర్త ముందు చాలా బాగా నటిస్తారు. కానీ అతను ఆఫీసుకు వెళ్లగానే అసలు రూపాన్ని బయటపెడతారు. బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేయడం మొదలుపెడతారు.

చాలామంది భార్యలు చీట్ చేస్తున్నారు

చాలామంది భార్యలు చీట్ చేస్తున్నారు

చాలామంది మొగుళ్లను వారివారి భార్యలు చీట్ చేస్తున్నారని విషయం పలు సర్వేల్లోనూ వెల్లడైంది. ముఖ్యంగా వారి జీవితంలో ఎదురవుతున్న పలు సంఘటనల కారణంగా వారు మొగుళ్లను చీట్ చేస్తున్నట్లు సర్వేలో తేలింది. 40 ఏళ్ల లోపు మహిళలే ఎక్కువగా ఇలా భర్తలను మోసం చేస్తున్నారట.

ఒప్పుకున్నారు కూడా

ఒప్పుకున్నారు కూడా

తాము స్వయంగా ఇలా చేస్తున్నట్లు కొందరు భార్యలు సర్వేలో ఒప్పుకున్నారు. ఎందుకలా చేస్తున్నారని అడిగితే... తమకు తమ భర్తల నుంచి కావాల్సినంత ప్రేమ దొరకడం లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారు. పెళ్లయిన కొత్తలో తమపై చూపిన ప్రేమను ఇప్పుడు చూపడం లేదని చాలామంది భార్యలు పేర్కొన్నారు.

ప్రేమ కరువవడమే

ప్రేమ కరువవడమే

పూర్తిగా తమ భర్త నుంచి ఆశించిన ప్రేమ కరవవుతుండటం వల్ల తమ దారి తాము చూసుకుంటున్నట్లు భార్యలు అసలు విషయం చెప్పేశారు. మరి కొందరేమో ఇలా చేస్తే లైఫ్ లో ఓ థ్రిల్ ఉంటుందని.. అందుకే అలా చేస్తున్నామని కూడా చెబుతున్నారు.

భార్యలు పక్కా మోసం

భార్యలు పక్కా మోసం

అయితే కొందరు భార్యలేమో తమ భర్తలు అక్రమ సంబంధాలను కలిగి ఉండడం వల్ల కోపం వచ్చి తాము కూడా వేరే వ్యక్తులతో అలాంటి సంబంధాలను పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి భర్తలను భార్యలు పక్కా మోసం చేస్తున్నారనే విషయం తేలింది. మరి ఆమెను అలా జీవితాంతం వేరే వ్యక్తులకు విడిచిపెట్టకుండా మీ మార్గంలోకి తెచ్చుకునేందుకు మీరు కొన్ని రకాల పనులు చేయాలి.

బోర్ గా ఫీలవుతూ

బోర్ గా ఫీలవుతూ

చాలామంది భార్యలు మీరు ఆఫీసుకు వెళ్తే వారు ఇంట్లో ఒంటరిగా ఉండడంతో చాలా బోర్ గా ఫీలవుతుంటారు. ఆ సమయంలో ఎవరితోనైనా చాటింగ్ చేయాలని లేదంటే మాట్లాడాలని వారికి అనిపిస్తుంది. దాంతో వారు ఇతరులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆ పరిచయాలు మీ కొంప ముంచుతాయి.

జాబ్ చేసే చోట...

జాబ్ చేసే చోట...

ఇక కొందరు ఆడవాళ్లు ఇంటి దగ్గర కూడా ఉండరు. జాబ్ చేస్తూ ఉంటారు. అయినా వారికి కూడా ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలను చూడగానే ఆఫీసుల్లో సొల్లు కార్చుకునే వెదవలు చాలామందే ఉంటారు. వాళ్లకు అవతలి వ్యక్తికి పెళ్లయ్యిందనే ఆలోచన కూడా ఉండదు.

టన్నుల కొద్దీ ప్రేమ

టన్నుల కొద్దీ ప్రేమ

దొరికింది ఛాన్స్ అని పెళ్లయిన మహిళను వలలో పడేయానికి వాళ్లు పాటించని ట్రిక్ అంటూ ఉండదు. ఆమెపై టన్నుల కొద్దీ ప్రేమను వలకబోస్తారు. పని పాటలేని అలాంటి వారందరి నుంచి భార్యలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భర్తపై ఉంటుంది.

ఆమెతో ప్రేమగా మాట్లాడాలి

ఆమెతో ప్రేమగా మాట్లాడాలి

మీ భార్యతో ఎక్కువగా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. చాలామంది భర్తలు పని ఒత్తిడిలో ఉండి భార్యలను పట్టించుకోరు. దీంతో వారికి మీపై కోపం వస్తుంది. ప్రేమ తగ్గిపోతుంది. ఆమెపై మీకు ఎంతో ప్రేమ ఉన్నా కూడా మీకు టైం దొరకకపోవడంతో అంత ప్రేమను వ్యక్తపరచలేరు.

ఆమెకు భరోసా ఇవ్వు

ఆమెకు భరోసా ఇవ్వు

ఎలాంటి కష్ట సమయంలోనైనా తాను భరోసా ఉంటాననే విషయంలో ఆమెకు ఎక్కువగా భరోసా ఇవ్వాలి. నా ప్రాణానికి అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుకుంటానని ఆమెకు నమ్మకం కల్పించాలి. నన్ను నమ్మిన ఎప్పటికీ మోసం చెయ్యననే నమ్మకాన్ని తనకు కల్పించాలి.

టూర్స్ కు వెళ్తూ ఉండాలి

టూర్స్ కు వెళ్తూ ఉండాలి

మీకు సమయం దొరికినప్పుడల్లా భార్యతో కలిసి టూర్లకు వెళ్లడానికి ప్రయత్నించడం. వీలైతే ఒక రోజు మొత్తం ఆమెతోనే గడపండి. ఆమె కోసం కనీసం వారంలో ఒక రోజును పూర్తిగా కేటాయించేలా ప్రణాళిక వేసుకోండి. ఎప్పుడైతే మీ ప్రేమ తక్కువవుతుందో అప్పుడే ఆమెకు వేరే ఆలోచనలు వస్తాయి.

కోపం వద్దు

కోపం వద్దు

చాలామంది భర్తలు భార్యలపై కోప్పడుతుంటారు. దీంతో వారు అసహనానికి గురవుతారు. మీరు ఆమె మళ్లీ అలాంటి తప్పులు చేయకూడదని చిన్నగా మందలిస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం దాన్నే మనస్సులో ఉంచుకుని ఉంటుంది. అదే సమయంలో ఎవరైనా వ్యక్తి ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడితే వారి వైపు ఆమె మొగ్గు చూపుతుంది.

సున్నితంగా వ్యవహరించు

సున్నితంగా వ్యవహరించు

ఒకవేళ ఆమె మిమ్మల్ని మోసం చేసిందని మీకు తెలిసినప్పుడు ఆమెతో మీరు వ్యవహరించే తీరు కాస్త సున్నితంగా ఉండాలి. ఆవేశానికి గురై ఆమె కొట్టకండి. అలా చేస్తే ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ఆమె ప్రియుడితో కలిసి అనాలోచి నిర్ణయాలు తీసుకుంటుంది. దీని వల్ల అందరి జీవితాలు నాశనం అవుతాయి.

మీ దారిలోకి తెచ్చుకోండి

మీ దారిలోకి తెచ్చుకోండి

ఆమె ఎవరి మాటకు విలువ ఇస్తుందో అలాంటి వారితో చెప్పించి చూడండి. లేదంటే సైకాలాజిస్ట్ వద్దకు తీసుకెళ్లండి. శాంతియుతంగానే ఆమెను మీరు మీ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. అలా చేస్తేనే ఆమె మళ్లీ మీ దారిలోకి వస్తుంది.

ఒకఛాన్స్ ఇవ్వండి

ఒకఛాన్స్ ఇవ్వండి

మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆమెకు మీరు ఒక్కఛాన్స్ ఇచ్చి చూడండి. ఇలాంటి తప్పులు చాలమంది భార్యలు చేస్తూనే ఉంటారు. భర్త వద్ద ఆ విషయాన్ని దాచి ఉంచడానికి వారు చేయని ప్రయత్నం అటూ కూడా ఉండదు. అయితే మీరు మాత్రం మీ సహనాన్ని కోల్పొకుండా మరోసారి అలాంటి తప్పు చేయొద్దని ఆమెకు చెప్పండి.

భర్త ప్రేమ కింద ఏది సరిరాదు

భర్త ప్రేమ కింద ఏది సరిరాదు

వాస్తవానికి ఒక భర్త భార్యపై చూపే ప్రేమ కింద ఏది సరిరాదు. కానీ మేకతోళ్లు ధరించిన కొందరు తోడేళ్లుగాళ్లు మాయమాటలు చెప్పి ఆమె మనస్సును మార్చుతారు. అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమెకు పరిచయం కాకుండా ఉండేలా చూసుకోండి. ఈ ఆడవాళ్లు కూడా నమ్మించి గొంతు కోసే వాళ్లనే బాగా నమ్ముతారు. ముందు వాళ్లకు అలాంటి కోరికలు లేకుంటే ఇలాంటి తప్పులు అస్సలు జరగవు.

English summary

how to forgive a cheating partner

how to forgive a cheating partner.. Trust once broken, is one of the most difficult dynamics to restore in a relationship. And without trust, there can be no vulnerability. Without vulnerability there can be no emotional intimacy and no physical intimacy. When defensive walls go up, communication breaks down and distance sets in. Hurt and resentment grows, and the relationship space becomes bitter, hostile and toxic. In such a toxic environment, the relationship withers away and dies.
Story first published: Friday, January 19, 2018, 13:30 [IST]