For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్తీక్ తో జీవితాంతం ఆ సుఖం అనుభవించాలనే నా భర్తను చంపా - My Story #34

నాకు మాత్రం కార్తీక్ అంటే మోజు పెరిగిపోయింది.నా భర్తతో నేను చాలా అయిష్టంగా బతుకుతుండేదాన్ని. నాకు సంసారంపై అంత సంతృప్తి ఉండేది కాదు. కార్తీక్‌తో చెప్పి నా భర్తను అడ్డు తొలిగించుకుందామని పథకం వేశాను.

By Bharath
|

నా పేరు జ్యోతి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నా పేరు మారుమోగిపోతుంది. మొన్న వరకు స్వాతి (నాగర్‌కర్నూలు) అంతటా తెలిసిపోయింది. అలాంటి కథనే నాది. నేను కూడా స్వాతి మాదిరిగానే మా ఆయన్ని దారుణంగానే నమ్మించి ప్రియుడితో కలిసి చంపించాను. తర్వాత నా ప్రియుడితో కలిసి జీవితాంతం హ్యాపీగా ఉందామనుకుంటే నా కథ అడ్డం తిరిగింది.

హ్యాపీగానే ఉన్నాం

హ్యాపీగానే ఉన్నాం

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం రాచాల. అతని పేరుకమ్మరి నాగరాజు. కార్పెంటర్. నాది బేగంపేట. ఇద్దరం పెళ్లయ్యాక కొన్ని రోజులు హ్యాపీగానే ఉండేవాళ్లం. తర్వాత ఎందుకో ఆయనంటే నాకు మోజు తగ్గింది. నాకు అతనిపై ఇష్టం రోజురోజుకు తగ్గుకుంటూ వచ్చింది.

మా ప్రేమ ఇలా మొదలైంది

మా ప్రేమ ఇలా మొదలైంది

నాకు పెళ్లికి ముందు నుంచే కార్తీక్‌తో పరిచయం ఉంది. నా వివాహానికి ముందు నాచారంలో జరిగిన బంధువుల వివాహానికి నేను వెళ్లాను. అక్కడ కార్తీక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారింది. మా కులాలు వేరు కావటంతో అతనితో నా పెళ్లికి మా కుటుంబీకులు నిరాకరించారు.

నాగరాజుతో పెళ్లి

నాగరాజుతో పెళ్లి

తర్వాత రాచాలకు చెందిన నాగరాజుకిచ్చి పెళ్లి చేశారు. మాకు మూడేళ్ల అమ్మాయి జీవిత, పది నెలల బాబు ఉన్నారు. మూడు నెలల క్రితం మళ్లీ కార్తీక్‌ తో నా వివాహేతర సంబంధం మొదలైంది. మా ఇద్దరి మధ్యన నా భర్త నాగరాజును అడ్డు తొలగించుకోవాలని భావించాను. నా భర్త కార్పెంటర్. నా భర్తతో హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో నివాసం ఉండేదాన్ని.

కార్తీక్ ను తరుచు కలిసేదాన్ని

కార్తీక్ ను తరుచు కలిసేదాన్ని

పెళ్లి అయిన తర్వాత నేను కార్తీన్ కలవలేదు. కానీ నా భర్తపై ఎక్కువగా ఇష్టం లేకపోవడంతో నాకు నా ప్రియుడు కార్తీక్ గుర్తొచ్చాడు. మొత్తానికి కార్తీక్‌ నంబరును సంపాదించాను. అప్పటి నుంచి నేను తరచూ మాట్లాడుతుండేదాన్ని. అప్పుడప్పుడు నేరుగా వెళ్లి కలసి వచ్చేదాన్ని.

వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం

ఈ క్రమంలో నాకు కార్తీక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం తరుచూ కలుస్తూ ఉండేవాళ్లం. మా విషయం నా భర్త నాగరాజుకు తెలిసింది. నీ ఆగడాలు చాలా ఎక్కువయ్యాయి. కాస్త పద్ధతి మార్చుకొమ్మని చెప్పాడు. కొన్నిసార్లు మందలించాడు.

మోజు పెరిగింది

మోజు పెరిగింది

కానీ నాకు మాత్రం కార్తీక్ అంటే మోజు పెరిగిపోయింది.నా భర్తతో నేను చాలా అయిష్టంగా బతుకుతుండేదాన్ని. నాకు సంసారంపై అంత సంతృప్తి ఉండేది కాదు. కార్తీక్‌తో చెప్పి నా భర్తను అడ్డు తొలిగించుకుందామని పథకం వేశాను.

స్పాట్ ఇలా పెట్టాం

స్పాట్ ఇలా పెట్టాం

ఆ రోజు డిసెంబర్ 30. మా ఆయన ఎప్పటిలాగే రాత్రి భోజనానికి కూర్చొన్నాడు. తర్వాత ఆ భోజనాన్ని వడ్డించాను. తర్వాత నా భర్త పాలు తాగాడు. అందులో నిద్రమాత్రలు కలిపాను. నా భర్త నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే కార్తీక్‌కు ఫోన్‌ చేశాను. అతను ఇంటికి చేరుకోగానే ఇద్దరం కలిసి నాగరాజు తలపై రాడ్‌తో కొట్టాం. అనంతరం దిండుతో ఊపిరాడకుండా చేశాం. దీంతో నా భర్త చనిపోయాడు.

అక్కడ పడేశాం

అక్కడ పడేశాం

కార్తీక్ తన స్నేహితుల సహాయంతో నా భర్త మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నల్లగొండ జిల్లా అంకిరెడ్డిగూడెం జిల్లేడు చెల్క ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. తర్వాత పోలీసులు నా భర్త షర్ట్ జేబులో ఉన్న చీటి ఆధారంగా నాకు సమాచారమిచ్చారు.

తప్పుడు ప్రచారం

తప్పుడు ప్రచారం

నా భర్తను చంపి బంధువులను పక్కదారి పట్టించా. నాగరాజు కనిపించటం లేదని తప్పుడు ప్రచారం చేశాను. బంధువుల అందరి ఎదుట ఏడవడం మొదలుపెట్టాను. ఏమి ఎరగని దానిలాగా నటించాను.

ఏమి తెలియనట్లు నటించా

ఏమి తెలియనట్లు నటించా

నేను అక్కడకు వెళ్లి ఏమీ తెలియనట్టు నటించాను. మృతదేహం నాభర్తదేనని, రెండురోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లాడని పోలీసులకు వివరించాను. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఆనందించాం

ఆనందించాం

దీంతో నేను నా ప్రియుడు హమ్మయ్యా అనుకున్నట్లుగానే జరిగింది. ఎక్కడ బయటపడలేదు అని ఆనందపడ్డాం. నేను ఇక జీవితాంతం కార్తీక్ తో ఆ సుఖం అనుభవించొచ్చు అనుకున్నాను. ఇంతలో షాక్.. మాకు దిమ్మదిరిగేలా పోలీసులు మమ్మల్ని విచారించి అసలు నిజాలు బయటపెట్టారు.

పోస్టుమార్టంలో దొరికిపోయాం

పోస్టుమార్టంలో దొరికిపోయాం

నా భర్త నాగరాజు చనిపోవడానికి అతడి తలపై గాయం కావడం ఒక కారణమని పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. నా ఫోన్ ద్వారా అన్ని కాల్స్ కార్తీక్ కు వెళ్లడం వల్ల తర్వాత నన్ను, కార్తీక్ ను వారి శైలిలో విచారించారు. మొత్తం కథ బయటపెట్టాల్సి వచ్చింది.

ఒక ఆడమనిషి దుర్మార్గపు ఆలచనకు...

ఒక ఆడమనిషి దుర్మార్గపు ఆలచనకు...

ఒక ఆడమనిషి దుర్మార్గపు ఆలచనకు నిదర్శనం ఈ మై స్టోరీ. గతంలో స్వాతి కూడా ఇలానే భర్తను చంపి ప్రియుడితో తన జీవితం సాగించాలనుకుంది. కానీ చివరకు ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఇలాంటి వాళ్లకు సిగ్గు రావడం లేదు. అంతగా నచ్చకుంటే భర్తకు విడాకులిచ్చి చట్ట ప్రకారం ప్రియున్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని హ్యాపీగా అనుభవించు. అందులో తప్పు లేదు. కానీ ఇలా చేయడంతో అభం శుభం తెలియని జ్యోతి పిల్లలు అనాథలయ్యారు.

పాపం చిన్నారులు

పాపం చిన్నారులు

చక్కగా సాగుతున్న సంసారాన్ని విపరీతమైన బుద్ధితో చేజేతులా నాశనం చేసుకొని వూచలు లెక్కబెడుతున్న స్వాతిలాగే జ్యోతి కూడా కటకటాలపాలైంది. ఈ రెండు సంఘటనల్లోనూ అటూ.. ఇటూ ఏ పాపం తెలియని నలుగురు చిన్నారులు తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరమయ్యారు.

భర్తలారా బీ కేర్ ఫుల్

భర్తలారా బీ కేర్ ఫుల్

ప్రతి భర్త కూడా మీ భార్యల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందరూ ఆడవాళ్లు ఇలా ఉంటారని చెప్పడం లేదు. చాలా గొప్ప మనసున్న ఆడవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ స్వాతి, జ్యోతిలాంటి వారూ కూడా లేకపోలేదు. ఆమెకు మీతో కాపురం ఇష్టం లేకుంటే ఏదో ఒకటి నిర్ణయించుకోండి కానీ ఇలా మిమ్మల్ని హత్య చేసే వరకు తెచ్చుకోకండి. భర్తలారా... భార్యలతో బీ కేర్ ఫుల్.

English summary

H​ow a wife’s phone calls blew the lid off her husband’s murder in Hyderabad​

H​ow a wife’s phone calls blew the lid off her husband’s murder in Hyderabad​
Story first published:Saturday, January 6, 2018, 17:27 [IST]
Desktop Bottom Promotion