For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి కాక ముందే ఇద్దరు పిల్లలు, లోకమంతా నన్ను అదోలా అనుకుంది, పిల్లలతో మెట్టినింట్లోకి #mystory220

మీ భర్త ఏం చేస్తుంటాడు.. ఎక్కడుంటాడు.. ఎప్పుడూ రాడే ఇటువైపు అంటూ కొందరు నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు. ఆ పిల్నల్ని నేను దత్తతగా తీసుకున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పలేకపోయే చచ్చిపోయేదాన్ని.

|

ఆ రోజు ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లి ఇంటికొస్తున్నాను. ముఖ్యమైన పోగ్రామ్స్ ఏమీ లేకపోవడం, ఎలాంటి వార్తలు లేకపోవడంతో త్వరగా డ్యూటీ అయిపోయింది. ఒక జర్నలిస్ట్ గా నాకు చేతనైనంతా సాయం నేను సమాజానికి చేసేదాన్ని. ఆ రోజు నేను వెళ్లేదారిలో ఆటోలు లేకపోవడంతో నేను నడుచుకంటూ ఇంటికెళ్తున్నాను.

రోడ్డు పక్క నుంచి చిన్నపిల్లల ఏడుపులు వినిపించాయి. గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పిల్లలు ఎక్కడున్నారోనని నా కళ్లు వెతకసాగాయి. ముళ్ల కంప మధ్య ఇద్దరు పసికందులు కనపడ్డారు. ఇద్దరూ ఆడపిల్లలే. కవలపిల్లలు. ఏ తల్లికి భారమయ్యారో అలా వదిలేసి వెళ్లి పోయింది.

వదిలేసి రమ్మని నాన్న అరిచాడు

వదిలేసి రమ్మని నాన్న అరిచాడు

ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లాను. ఇంట్లో మా అమ్మనాన్న ఆ పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయారు. వారిని అక్కడే వదిలేసి రమ్మని నాన్న అరిచాడు. లేదంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే వాళ్లే వచ్చి తీసుకెళ్లి పోతారని చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. అధికారుల అంగీకారం తీసుకుని వారిని నేనే పెంచుకుంటా అన్నాను. నాన్న వినలేదు. తనమాట వినకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు.

నాకు కష్టం కావడంతో

నాకు కష్టం కావడంతో

దిక్కుతోచని పరిస్థితుల్లో నేను ఆ పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. మొదట నాకు బయట అద్దెకు రూమ్ కూడా దొరకలేదు. తర్వాత ఒక చిన్న రూమ్ లో ఆ పిల్లలతో కలిసి ఉండేదాన్ని. వారి ఆలనాపాలనా చూసుకోవడం నాకు కష్టం కావడంతో ఒక ఆమెకు వారి బాధ్యతలు అప్పగించాను.

జర్నలిజం కెరీర్ అప్పుడే మొదలుపెట్టాను

జర్నలిజం కెరీర్ అప్పుడే మొదలుపెట్టాను

ఆమెనే రోజంతా వారి ఆలనాపాలనా చూసుకునేది. నా జర్నలిజం కెరీర్ అప్పుడే మొదలుపెట్టాను. నాకు అప్పుడు పని తప్ప మరో లోకం తెలియదు. నేను విధి నిర్వహణలో బిజీగా ఉంటూనే ఆ పిల్లల్ని పెంచాను. కానీ ఇంటి పక్కనున్న వారి నుంచి తెలిసిన వారి దగ్గరి నుంచి నాకు సూటిపోటీ మాటలు ఎదురయ్యేవి.

మీ భర్త ఏం చేస్తుంటాడు.

మీ భర్త ఏం చేస్తుంటాడు.

మీ భర్త ఏం చేస్తుంటాడు.. ఎక్కడుంటాడు.. ఎప్పుడూ రాడే ఇటువైపు అంటూ కొందరు నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు. ఆ పిల్నల్ని నేను దత్తతగా తీసుకున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పలేకపోయే చచ్చిపోయేదాన్ని. కావాలని జనం అలా టార్చర్ చేసేవాళ్లు.

అలా చెయ్యను అని తెగేసి చెప్పాను

అలా చెయ్యను అని తెగేసి చెప్పాను

పిల్లలు కాస్త పెద్దయ్యగయ్యాక వారిని అనాథశ్రమంలో వదిలెయ్యమంటూ మా అమ్మనాన్న పట్టుబట్టారు. కానీ నేను అలా చెయ్యను అని వారికి తెగేసి చెప్పాను. తర్వాత నాకు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు మా వాళ్లు. ప్రతి అబ్బాయి అదే షరతు పెట్టాడు. మీరు పిల్లల్ని ఎక్కడైనా వదిలేసిరండి పెళ్లి చేసుకుంటాం అన్నారు. నేను ఒప్పుకోలేదు.

ఇంకో పిల్లను చేసుకుందువులే

ఇంకో పిల్లను చేసుకుందువులే

కొన్నాళ్లకు నా తోటి జర్నలిస్ట్ నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. తనకు నేను అన్ని వివరాలు చెప్పాను. అర్థం చేసుకున్నాడు. అలాగే నాకు తల్లి కావాలని కోరికలేదని, ఆ పిల్లల్నే మన సొంత పిల్లల్లా చూసుకుందామని చెప్పాను. మొదట ఆలోచించాడు. తర్వాత అంగీకరించాడు. అయితే వాలింట్లో అందుకు ఒప్పుకోలేదు. ఆ పిల్ల కాకుంటే ఇంకో పిల్లను చేసుకుందువులే అన్నారు.

అమ్మా అంటూ ఉంటే

అమ్మా అంటూ ఉంటే

చివరకు నా పెళ్లి అతనితోనే జరిగింది. ఆ ఇద్దరి పిల్లల్ని మా సొంత పిల్లల్లా చూసుకుంటున్నాం. వాళ్లు నన్ను అమ్మా అంటూ ఉంటే ఆ ఆనందం చెప్పలేనిది. మొదట నేను మా అత్తారింట్లోకి ఇద్దరు పిల్లలతో అడుగుపెట్టినప్పుడు నా గురించి చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి.

ఒక మంచి విషయంలో ఫిక్స్ అయితే

ఒక మంచి విషయంలో ఫిక్స్ అయితే

ఆ పిల్లల్ని నేను అక్కున చేర్చుకున్న రోజే అనుకున్నా.. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారిని దూరం చేసుకోకూడదని. ఒక్కసారిగా మనం ఒక మంచి విషయంలో ఫిక్స్ అయితే దానికి జీవితాంతం కట్టుబడి ఉండాలి. వాళ్లను కనగానే తల్లి అనాథలను చేసింది. మళ్లీ నేను కూడా వారిని అనాథల్ని చేయదలుచుకోలేదు.

English summary

I adopted twins before marriage my in laws don't accept me

Everyone is human and fallible, and unfortunately, for whatever reason, your in-laws aren’t able to reach out to you.I adopted twins before marriage my in laws don't accept me.
Story first published:Wednesday, August 29, 2018, 15:43 [IST]
Desktop Bottom Promotion