పెళ్లికి ముందే సెక్స్ వద్దన్నాను.. ఏం కాదులే రబ్బర్ (కండోమ్) యూజ్ చేద్దాం అన్నాడు - My Story #98

Written By:
Subscribe to Boldsky

నేను బాగా చదవాలి.. నేను మంచి జాబ్‌ కొట్టాలనేది మా అమ్మనాన్నల ఆశయం. నా లక్ష్యం కూడా అదే. నేనే మొదట్నుంచీ సరదాలు, ప్రేమలకు చాలా దూరంగా ఉండేదాన్ని. అందువల్లే ఎంబీఏ పూర్తయ్యాక నేనే క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో సెలెక్ట్ అయ్యాను. మంచి జీతంతో నాకు ఒక ఎమ్మెన్సీలో జాబ్ వచ్చింది.

ఫేస్ బుక్ ఓపెన్ చేశాను

ఫేస్ బుక్ ఓపెన్ చేశాను

అయితే నేనే ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించేదాన్ని కాదు. ఒక రోజు నా ఫోన్ లో ఫేస్‌బుక్‌ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని దాన్ని ఓపెన్ చేశాను. నాకు ఫేస్ బుక్ లో అకౌంట్ ఉన్నా ఫేస్ బుక్ ను ఎప్పుడో సారి ఓపెన్ చేసేదాన్ని.

చాలా బుద్ధిమంతుడు అనుకుని

చాలా బుద్ధిమంతుడు అనుకుని

చాలా రోజుల తర్వాత ఓపెన్ చేశాను కాబట్టి ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఒక అబ్బాయి నుంచి వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ను ఒకే చేశాను. అతను అందంగా ఉన్నాడు. ప్రొఫైల్ లో మంచి ఉద్యోగం చేస్తున్నట్లు కూడా పోస్ట్ చేశాడు. చాలా బుద్ధిమంతుడనుకొని ఓకే చేశా.

తన మెసేజ్‌ కోసం ఎదురు చూసేదాన్ని

తన మెసేజ్‌ కోసం ఎదురు చూసేదాన్ని

మరుసటి హాయ్‌.. సంధ్య. ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు అని మెసేజ్ పంపాడు. నేనూ స్పందించాను. అతను మెసేజ్ పంపిన తీరు నాకు నచ్చింది. అతని మెసేజ్ ల్లో అంతా మర్యాదనే ఉంది. అవన్నీ నన్నాకట్టుకున్నాయి. ఎప్పుడూ ఏ అబ్బాయిని పట్టించుకోని నేను తన మెసేజ్‌ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను.

ఫోన్ రాకుంటే ప్రాణం పోయేది

ఫోన్ రాకుంటే ప్రాణం పోయేది

కొన్ని రోజులు మా మధ్య చాటింగ్‌ సాగింది. తర్వాత నంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. రోజూ ఫోన్ చేసేవాడు. ఒక రోజు తన నుంచి ఫోన్ రాకున్నా కూడా ప్రాణం పోయేది.

పెళ్లి సంబంధాలు చూడొద్దు

పెళ్లి సంబంధాలు చూడొద్దు

అతను కూడా నాపై చాలా ప్రేమ చూపేవాడు. అలా మా ప్రేమ కొనసాగుతుండగానే మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పాను.

రవిని ప్రేమిస్తున్నా

రవిని ప్రేమిస్తున్నా

నీ మనసులో ఎవరైనా ఉన్నారమ్మా అని అడిగాడు నాన్న. అవును.. నాన్న.. నాకు ఫేస్ బుక్ లో రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పాను. ఒకర్నొకరు నేరుగా చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ప్రేమేంటని నాన్న కాస్త కోప్పడ్డాడు. అమ్మ కూడా కోప్పడింది.

ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో

ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో

తర్వాత మా అమ్మనాన్న కూడా కూల్ అయిపోయారు. వాళ్లు నన్ను ఏమి అనలేదు. వాళ్లకి నేనంటే ప్రాణం. సరే.. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటున్నారు కదా. ఆ అబ్బాయిని ఒక్కసారి చూసి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తాం అన్నాడు మా నాన్న. మా పెళ్లి జరగాలని నేనే ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో.

అమ్మానాన్న శాడిస్ట్ లు

అమ్మానాన్న శాడిస్ట్ లు

తర్వాత కొన్ని రోజులుగా మా నాన్న రవి గురించి తనకు తెలిసిన వారి ద్వారా కనుకున్నాడు. అబ్బాయి మంచివాడని మా నాన్నకు చెప్పారు. కానీ అతని అమ్మానాన్న మాత్రం చాలా శాడిస్ట్ లు అట.

అలాంటి ఇంటికి నిన్ను ఇస్తే ఎలా సంధ్య అని మా నాన్న అన్నాడు.

పెళ్లి క్యాన్సిల్

పెళ్లి క్యాన్సిల్

తర్వాత జరిగిందంతా రవికి వివరించా. నాకోసం నువ్వు ఇంతగా పోరాడుతున్నావ్‌ అంటే నువ్వు నిజం నాకు దేవతతో సమానం అన్నాడు. అతడిపై ప్రేమ మరింత పెరిగింది. కానీ అతడి కుటుంబం పై నాన్నకు సదభిప్రాయం లేదు. దాంతో మొత్తానికి మా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

నన్ను మర్చిపో

నన్ను మర్చిపో

‘రవి.. నన్ను మర్చిపో. నేను నీ జీవితంలోకి రాలేదనుకో' అని మెసేజ్ పెట్టా. తర్వాత నాకు జాబ్ వచ్చిన కంపెనీకి ట్రైనింగ్ వెళ్లాను. నాతో ఒక్కసారి మాట్లాడు అంటూ అతను కొన్ని వందల మెసేజ్‌లు పంపాడు. కానీ మా అమ్మనాన్నకు నచ్చని పెళ్లి నేను చేసుకోలేను అన్నాను.

యూఎస్ సంబంధాన్ని ఒకే చేశాను

యూఎస్ సంబంధాన్ని ఒకే చేశాను

అంతలోపే నాకు యూఎస్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి సంబంధం వచ్చింది. బాగా ఆస్తి ఉంది. మంచి జీతం వస్తుంది. నేను కూడా ఒకే అన్నాను. అతని పేరు రాజేశ్. కొన్ని రోజులకు నన్ను చూడడం కోసం, అలాగే సంబంధం ఒకే అయినందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాజేశ్ ఇండియాకు వచ్చాడు.

రూమ్ బుక్ చేశాడు

రూమ్ బుక్ చేశాడు

రాజేశ్ హైదరాబాద్ లోని మా ఇంటికొచ్చాడు. మా అమ్మనాన్నలను పలకరించాడు. తర్వాత నేను, రాజేశ్ ఔటింగ్ కు వెళ్లాం. అతను ఒక హోటల్ లో రూమ్ బుక్ చేశాడు. అయినా పెళ్లికి ముందే ఇలా రూమ్ లో స్పెండ్ చెయ్యడం మంచిదికాదని చెప్పాను.

సంబంధం క్యాన్సిల్స్ చేస్తాడని

సంబంధం క్యాన్సిల్స్ చేస్తాడని

మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని మీదిమీదికి వచ్చాడు. నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను అతన్ని దూరం పెడితే ఎక్కడ సంబంధం క్యాన్సిల్స్ చేస్తాడోనని అతనికి సహకరించాను. తర్వాత లిప్ టు లిప్ కిస్ పెట్టాడు. ఇంకో అడుగు ముందుకేసి ఆ పని కూడా స్టార్ట్ చెయ్యాలని చూశాడు.

రబ్బర్ (కండోమ్) యూజ్ చేద్దాం

రబ్బర్ (కండోమ్) యూజ్ చేద్దాం

ఇంత వరకు చాలు. మిగతావన్నీ పెళ్లి తర్వాతే అన్నాను. ఏం కాదులే సంధ్య.. రబ్బర్ (కండోమ్) యూజ్ చేద్దాం అన్నాడు. నాకిష్టం లేదు అన్నాను. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే అంటావా ఏం కథ అన్నాడు. అప్పుడు ఒకే. అప్పుడు నువ్వు ఎలా అలా కానీ ఇప్పుడొద్దు అన్నాను. సరే అని రూమ్ నుంచి బయటకు వచ్చాం. తర్వాత నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లాడు.

రాజేశ్ మోసం చేశాడు

రాజేశ్ మోసం చేశాడు

ముహుర్తాలు పెట్టుకునే సమయానికి ఎక్కువ కట్నం ఇస్తున్నారని రాజేశ్ మరో అమ్మాయికి తాళి కట్టాడు. చాలా బాధేసింది. ఇక ఆఫీసులో కూడా ఇబ్బందులు వచ్చాయి. నేను ట్రైనింగ్ లో సరిగ్గా పార్టిసిపేట్ చెయ్యడం లేదని నన్ను తీసివేశారు. ఈ బాధల నుంచి తేరుకోకముందే అమ్మానాన్నలు నన్ను శ్యామ్ అనే మా బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు.

సెక్స్ విషయంలో శ్యామ్ తో టార్చర్

సెక్స్ విషయంలో శ్యామ్ తో టార్చర్

చదువయ్యేదాకా నా జీవితం నా చేతుల్లోనే ఉండేది. ఎప్పుడైతే ఫేస్‌బుక్‌కి అతుక్కుపోయానో అప్పట్నుంచే వూహించని మలుపులు తిరిగింది. శ్యామ్ నన్ను రోజూ టార్చర్ పెడుతున్నాడు. నా బాధ ఇప్పుడు ఎవ్వరికీ చెప్పాలో అర్థం కావడం లేదు. నా భర్త శ్యామ్ రోజూ తాగి వస్తాడు. సెక్స్ విషయంలో టార్చర్ చేస్తాడు.

రవి చాలా మంచోడు

రవి చాలా మంచోడు

ఏదేమైనా జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. రవి చాలా మంచి వ్యక్తి. అతనితో నా పెళ్లి జరిగి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో. నావల్ల అతను చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అందుకే అతడ్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా.

అందుకే అలా చేయాల్సి వచ్చింది

అందుకే అలా చేయాల్సి వచ్చింది

‘రవి ప్రేమించడానికి రెండు మనసులు చాలు. ఆ ప్రేమ ఫలించి ఇద్దరు ఒక్కటవ్వాలంటే మాత్రం రెండు కుటుంబాలూ కలవాల్సిందే. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్లు ఏడిస్తే నేను సుఖంగా ఉండలేను. అందుకే అలా చేయాల్సి వచ్చింది'.

అలా చేస్తేనే హ్యాపీ

అలా చేస్తేనే హ్యాపీ

మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వారితో జీవితాంతం ఉంటేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాకాకుండా వేరే దారిలో వెళ్తే జీవితం ప్రతి క్షణం నరకమే. రవి ఇప్పటికీ నీ నుంచి ఫేస్ బుక్ లో ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తూ ఉంటాను.

English summary

i have waited for you on facebook

i have waited for you on facebook