Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
నేను పక్కా మాస్, మా పక్క ఊరి పిల్ల లైన్లోకి వచ్చింది, కొడితే రెండు రోజులు కోమాలోకి #mystory218
ఒక రోజు నేను సిటీకి వెళ్లాను. సంధ్య థియేటర్ లో ఆర్ ఎక్స్ 100 మూవీ చూసి బయటకొచ్చాను. నా చుట్టు ముట్టూ నాలుగు బైక్ లను ఆపారు. వాళ్లలో కొందరి ఫేస్ లు ఎప్పుడో చూసినట్లుగా అనిపించాయి.#mystory218
మాది పక్కా పల్లెటూరు. నేను మాస్.. నా ప్రేమా మాసే. పట్నమోళ్ల మాదిరిగా రోజుకు పదిసార్లు చూసుకుని పదేపదే మాట్లాడాలని మనస్సు చెబుతున్నా... మదిలో భయంతో చెప్పలేని నైజం కాదు నాది. నేను అదో రకం. మనస్సులో ఏది ఉంటే అది చెప్పే రకం. తర్వాత ఏమైతుందో అని ఆలోచించి మాట్లాడే రకం కాదు నేను. మా ఊర్లో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ జీవితాన్ని సంతోషంగా అనుభవించే మహారాజుని నేను. అందుకే మా ఊరు అంటే నాకెంతో ఇష్టం. ఊరిని వదలడమంటే నా ప్రాణం విడిచిపెట్టడమే.
నాలాంటి మాస్ గాడికి మా పక్క ఊరి పిల్ల లైన్లోకి వచ్చింది. ఆమె కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. బాగా తెలివైన అమ్మాయి. పల్లెటూరులో ఉంటుంది కాబట్టి చూడడానికి కాస్త మాస్ గా ఉంటుంది కానీ ఆమె బాగా రెడీ అయితే సినిమా హీరోయిన్ కూడా తన అందానికి సరితూగదు.

సైకిల్ పై ముందు కూర్చొంటే
పక్క ఊరి నుంచి మా ఊరికి రావాలంటే ఆటోలే దిక్కు. అప్పుడప్పుడు అవి కూడా ఉండవు. ఆటోలు తిరగడం లేదు నాకు తెలిస్తే వెంటనే సైకిల్ వేసుకుని ఆమె దగ్గర వాలిపోయేవాణ్ని. తను సైకిల్ పై ముందు కూర్చొంటే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేది. క్షణాల్లో తనని కంపెనీ వద్ద డ్రాప్ చేసేవాణ్ని.

గాజులు కొనిచ్చాను
మా పక్క ఊర్లో తిరుణాళ్లకు వెళ్లినప్పుడు తనకు గాజులు కొనిచ్చాను. మరుసటి రోజు తను పట్నంలో నాకు షర్ట్ తీసుకొచ్చింది. దాన్ని వారం రోజుల పాటు అలాగే వేసుకున్నా. అంత ప్రేమ తనంటే. ఆదివారం పూట ఇద్దరం పట్నానికి వెళ్లేవాళ్లం. ఉదయం నుంచి రాత్రి వరకు అంతా తిరిగి రాత్రికి మళ్లీ ఎవరి ఊళ్లకు వాళ్లం వెళ్లేవాళ్లం.

లోకం అస్సలు కనపడేది కాదు
ఆ పిల్ల వాళ్ల నాన్న తాగుబోతు. దీంతో వాళ్ల అమ్మ, ఈ అమ్మాయి ఇంటిని నడిపేవారు. తనతో ప్రేమలో ఉన్నప్పుడు నాకు ఈ లోకం అస్సలు కనపడేది కాదు. తను తప్ప మరెవరూ ఈ లోకంలో లేరనుకునేవాణ్ని. అలా చాలా రోజులు మా ప్రేమాయాణం నడిచింది.

ఆర్ ఎక్స్ 100 మూవీ చూసి
ఒక రోజు నేను సిటీకి వెళ్లాను. సంధ్య థియేటర్ లో ఆర్ ఎక్స్ 100 మూవీ చూసి బయటకొచ్చాను. నా చుట్టు ముట్టూ నాలుగు బైక్ లను ఆపారు. వాళ్లలో కొందరి ఫేస్ లు ఎప్పుడో చూసినట్లుగా అనిపించాయి. నేను గతంలో కొట్టిన వారు ఎవరైనా ఉండొచ్చు అనుకున్నా. నా కళ్లలో వాళ్లకు భయం కనపడలేదు. అందుకే నా వైపు కసిగా చూశారు.

మా కులం అమ్మాయిని ఎందుకు ప్రేమించావు?
ఎందుకురా మా కులం అమ్మాయిని ప్రేమించావు? అని అడిగాడు ఒకడు. అప్పుడనిపించిది. వీళ్లంతా ఆ పిల్లకు సంబంధించిన మనుషులనీ. మీరు ఎవడ్రా అన్నాను. అంతలోనే వెనుక నుంచి ఒకడు కొట్టాడు. పక్కనే ఉన్న రాడ్ తీసుకుని వాడి తలపై కొట్టాను. రక్తమడుగులో పడిపోయాడు.

ఆమె బావ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు
నన్ను వాళ్లంతా చితకబాదారు. రెండు రోజుల తర్వాత కోమాలో నుంచి తేరుకున్నా. నన్ను కొట్టిన వాళ్ల గురించి మా వాళ్లు తెలుసుకున్నారు. వాళ్లను కూడా చితకబాదారు. ఆ అమ్మాయి బావ, మరికొందరు మనుషులు నన్ను కొట్టారు. ఆమె బావ తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. దాంతో పాటు నా కులం వేరు. వాళ్ల కులం వేరు.

ట్రాక్టర్ నిండా మనుషులతో అక్కడ దిగాను
తనని కూడా వాళ్లు చాలా టార్చర్ చేశారు. నాకు మాత్రం నేను ప్రేమించిన అమ్మాయిని భార్యగా చేసుకుని ప్రేమగా చూసుకోవాలి అనే కల మాత్రమే ఉండేది. కానీ ఆ కల నెరవేరకుండా చాలా మంది అడ్డుకున్నారు.
చివరకు ఆమెకు తన బావతో పెళ్లి నిశ్చయం చేశారు. పక్క ఊరి రాములోరి గుడిలో పెళ్లి అని తెలిసింది. వెంటనే ట్రాక్టర్ నిండా మనుషులతో అక్కడ దిగాను. అడ్డువచ్చినవాళ్లు కొట్టి అమ్మాయిని ఎత్తుకొచ్చుకున్నా. అదే రోజు పెళ్లి చేసుకున్నా.

ఊరిని వదలడమంటే నా ప్రాణం విడిచిపెట్టడమే
ఊర్లో పంచాయతీ పెట్టారు. నా తప్పు ఏమీ లేకున్నా ఊరి నుంచి వెళ్లిపొమ్మని పెద్ద మనుషులు తీర్పు ఇచ్చారు. తప్పని పరిస్థితుల్లో ఊరి నుంచి బయటకు వచ్చాను. తర్వాత కూడా నాపై అటాక్ జరిగింది. ఇప్పుడు మా ఊరికి, ఆ మనుషులకు దూరంగా నా భార్యతో ఉంటున్నాను. ఒకప్పుడు మా ఊరు అంటే నాకెంతో ఇష్టం. ఊరిని వదలడమంటే నా ప్రాణం విడిచిపెట్టడమే అనుకునేవాణ్ని. కానీ ఇప్పుడు ప్రాణాలతో భార్యాపిల్లలతో సంతోషంగా బతకాలంటే ఊరికి దూరంగా ఉండాల్సిందే.



Click it and Unblock the Notifications