ఒకరితో శారీరక సంబంధం.. మరొకరితో పెళ్లి.. ఏం చెయ్యాలో తెలియడం లేదు - #mystory138

Written By:
Subscribe to Boldsky

శ్వేత నాకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. తను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండదు. ఫోన్లో మాట్లాడదు. శ్వేత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అస్సలు ఎవరితోనూ మాట్లాడదు. మాట్లాడేంత సమయం కూడా ఆమెకు ఉండదు. అలాంటి సందర్భంలో ఒక రోజు నాకు ఆమె ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది.

శ్వేతను అడిగాను

శ్వేతను అడిగాను

నేను అంతకు ముందే రోజు శ్వేత వాలింట్లో ఫంక్షన్ ఉంటే వెళ్లాను. అప్పుడు శ్వేతతో పాటు మరో అమ్మాయి క్లోజ్ గా ఉండడం గమనించాను. ఆ అమ్మాయి ఎవరని శ్వేతను అడిగాను. ఆమె తన ఫ్రెండ్ శ్రావణి అని చెప్పింది.

లైన్ వేసుకుంటావా?

లైన్ వేసుకుంటావా?

ఇక నాకు వచ్చిన మెసేజ్ లో నిన్న శ్రావణిని చూశావు కదా.. ఎలా ఉంది? అని ఉంది. నాకు ఫస్ట్ గుర్తు రాలేదు. తర్వాత గుర్తొచ్చింది. నీ ఫ్రెండ్ కదూ.. చాలా బాగుంది శ్వేత అన్నాను. మరి లైన్ వేసుకుంటావా అంది.

నీకు నచ్చిందా ?

నీకు నచ్చిందా ?

ఇదేమిటి శ్వేత... నువ్వు ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలు మాట్లాడేదానివి కాదు. మరి ఇప్పుడు ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నావు అన్నాను. నీకు నచ్చిందా అంటూ మళ్లీ శ్వేత మొబైల్ నుంచి మెసేజ్‌ వచ్చింది.

చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు

చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు

అయినా ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవడం మంచిది కాదేమో. ఆమెకు తెలిస్తే ఏమనుకుంటుంది? అని మెసేజ్ పంపాను. మీరు చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు... నేను శ్వేతను కాదు.. ఆమె ఫ్రెండ్ శ్రావణిని అని మళ్లీ మెసేజ్ వచ్చింది.

ఎంత బతిమిలాడినా మీ నంబర్ ఇవ్వలేదు

ఎంత బతిమిలాడినా మీ నంబర్ ఇవ్వలేదు

మరి శ్వేత పేరుతో అలా మెసేజ్ లు పంపడం మంచిది కాదు కదా అన్నాను. నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు మీతో మాట్లాడాలని అనిపించింది. శ్వేతను ఎంత బతిమిలాడినా మీ నంబర్ ఇవ్వలేదు. అందుకే నేనే శ్వేత ఫోన్ నుంచి నంబర్ తీసుకుని మెసేజ్ చేస్తున్నాను అని చెప్పింది.

నేరుగా కలుసుకున్నాం

నేరుగా కలుసుకున్నాం

అలా శ్రావణితో మొదలైన నా పరిచయం తర్వాత స్నేహంగా మారింది. ఇద్దరం ప్రతి రోజూ గంటల తరబడి చాట్ చేసుకునేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత ఇద్దరం నేరుగా కలుసుకున్నాం. ఆ రోజు గంటల తరబడి మాట్లాడుకున్నాం.

ఎన్నో ట్రిప్స్

ఎన్నో ట్రిప్స్

మన విషయం గురించి శ్వేతతో చెప్పొద్దు అని శ్రావణి నన్ను కోరింది. దాంతో నేను మా విషయాలను శ్వేతతో చెప్పలేదు. శ్రావణి కొన్ని రోజుల్లోనే నాతో చాలా చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రావణి, నేను చేయని ఎంజాయ్ లేదు. మేమిద్దరం కలిసి ఎన్నో ట్రిప్స్ వేశాం.

సిన్సియర్ గా లవ్ చేస్తున్నా

సిన్సియర్ గా లవ్ చేస్తున్నా

తప్పనిపరిస్థితుల్లో నేను, శ్రావణి శారీరకంగా కలిశాం. కొన్ని రోజుల తర్వాత నాకు శ్వేత... నీతో పర్సనల్ గా మాట్లాడాలని మెసేజ్ పంపింది. శ్రావణి గురించి శ్వేత అడుగుతుందని అనుకున్నాను. కానీ శ్వేత.. తాను నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నానని చెప్పింది. నేను లేకుంటే బతకలేనని చెప్పింది.

సూసైడ్ చేసుకుంటా

సూసైడ్ చేసుకుంటా

శ్రావణితో నేను నడిపే ప్రేమాయాణం శ్వేతకు తెలియదు. నేను శ్వేతతో అసలు విషయం చెబితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నేను పెళ్లి చేసుకోనంటే శ్వేత సూసైడ్ చేసుకుంటా అంది. ప్రస్తుతం నేను ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నా.

అఘాయిత్యానికి పాల్పడుతుందోనని

అఘాయిత్యానికి పాల్పడుతుందోనని

జీవితం ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వేధిస్తుంది. శ్వేత నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తనను పెళ్లి చేసుకోకపోతే తాను ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో తెలియదు. అలాగే శ్రావణితో నాకు శారీరక సంబంధం ఉంది. ఆమెను కూడా కాదనలేను. ప్రస్తుతం ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను.

నన్ను నిలదీసింది

నన్ను నిలదీసింది

శ్వేత వాలింట్లో చెప్పి నాతో పెళ్లికి అంతా సిద్ధం చేసుకుంది. ఈ మధ్యే శ్రావణికి విషయం తెలిసి నన్ను నిలదీసింది. నాతో శారీరకంగా గడిపి.. శ్వేతను ఎలా పెళ్లి చేసుకుంటావు అంది.

శ్రావణినే పెళ్లి చేసుకుంటా

శ్రావణినే పెళ్లి చేసుకుంటా

శ్వేతను కాదంటే ఆమె ఏం చేసుకుంటుందోనని భయం. అయినా శ్వేతకే అసలు విషయం చెప్పి శ్రావణిని పెళ్లి చేసుకోవాలనకుంటున్నాను. ఎందుకంటే నేను శ్రావణినే ప్రేమించాను. ఆమెతోనే గడిపాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను.

English summary

i love her very much i cannot leave her i will marry her

i love her very much i cannot leave her i will marry her