For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్యాసుల సంధ్య అంటే నాకు తిక్కరేగేది, అబ్బాయిలు ఎల్లయ్య, పుల్లయ్య పెట్టుకుంటారా? #mystory219

|

పెళ్లి అయిన తర్వాత లైఫ్ మొత్తం మారుతుందని జనాలంటారు. నా జీవితం మాత్రం వివాహమయ్యాక అస్సలు మారకూడదని నేను అనుకునేదాన్ని. కానీ మా అత్తింటి వారు అన్నీ మార్చేశారు. పెళ్లికి ముందు నేను చాలా ఫ్యాషనబుల్ గా ఉండేదాన్ని. స్లీవ్ లెస్ టాప్.. చినిగిపోయిన జీన్స్ వేసుకుని చిందులేసేదాన్ని. కానీ పెళ్లియ్యాక అంత మారిపోయింది.

సన్యాసుల సంధ్యగా మార్చారు

సన్యాసుల సంధ్యగా మార్చారు

రోజూ చీరనే కట్టుకోవాలి. ఉదయమే లేవాలి. తులసి పూజ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక నా పేరు సంధ్య సంజాముల. నా భర్త పేరు సతీష్ సన్యాసుల. మా పెళ్లియిన తర్వాత నా పేరు సన్యాసుల సంధ్యగా మార్చారు. నాకు అక్కడ మండింది.

భర్త ఇంటి పేరును మార్చరు

భర్త ఇంటి పేరును మార్చరు

ఏం అన్నీ భార్యలే భరించాలా? భర్తలకు ఒక్క నిబంధన కూడా ఉండదా. మా ఆయనే నా ఇంటి పేరును పెట్టుకోవొచ్చు కదా.

వివాహం అయ్యాక భార్య ఇంటి పేరు మారుస్తారు కానీ భర్త ఇంటి పేరును మాత్రం మార్చరు. దీని గురించి ప్రశ్నిస్తే ఒక్కొక్క మగమహానుభావుడు ఒక్కో రకంగా వివరణలు ఇస్తారు.

అర్చన ఉందా అని అడిగితే

అర్చన ఉందా అని అడిగితే

ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారం, దీన్ని ఇప్పుడు మార్చడం కుదరదు. అయినా ఎవ్వరికీ లేనిది నీకెందుకు అంటూ సమాధానాలిస్తారు. ఇక మా స్నేహితురాలికి పెళ్లి కుదరగానే తన పేరే మార్చేశారు. తన పేరు అర్చన అయితే వరలక్ష్మి అని అత్తింటి వారు పెట్టారట. ఆ మధ్య నేను తనకు ఫోన్ చేస్తే వాళ్ల ఆయన లిఫ్ట్ చేశాడు. ఏమండీ అర్చన ఉందా అని అడిగితే.. లేదండీ రాంగ్ నంబర్ ఇది మా ఆవిడ వరలక్ష్మి నంబర్ అని పెట్టేశాడు.

ఎల్లయ్య, పుల్లయ్య పేర్లు పెట్టుకుంటారా?

ఎల్లయ్య, పుల్లయ్య పేర్లు పెట్టుకుంటారా?

తర్వాత నంబర్ సరి చూసుకుని మళ్లీ ఫోన్ చేస్తే అర్చన అసలు విషయం చెప్పింది. అదేంటే అని అడిగితే.. మా జాతకాలు కలవలేదంటా అందుకే మా పేర్లు మార్చారు అని చెప్పింది. ఇక్కడ కూడా అమ్మాయి పేరు మార్చారు కానీ అబ్బాయి పేరు మార్చలేరు. జాతకాలు కలుస్తాయంటే ఏ అబ్బాయైనా ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య పేర్లు పెట్టుకోమంటే పెట్టుకుంటారా? అస్సలు పెట్టుకోరు. కానీ అమ్మాయిలు మాత్రం పెట్టుకోవాలి.

పద్నాలుగో శతాబ్దం నుంచే ఉంది

పద్నాలుగో శతాబ్దం నుంచే ఉంది

వివాహం అయ్యాక ఇంటి పేరు మార్చడం అనేది అమ్మాయిని తక్కువ చేయడమే అని నా భావన. దీని వల్ల మా అమ్మాయిలకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోతుంది. దీని గురించి మా బామ్మను అడిగితే ఈ ఆచారం పద్నాలుగో శతాబ్దం నుంచే ఉంది. ఇది మనదేశంలోనే కాదు. చాలా దేశాల్లో ఉంది అని చెప్పింది.

భర్తను కన్విన్స్ చేసి

భర్తను కన్విన్స్ చేసి

అయితే కొందరు చదువుకున్న అమ్మాయిలు మాత్రం తెలివిగా.. ఏమండి సర్టిఫికెట్స్ లో నా పేరు ఇలా ఉంది.. అలాగే ఉండనివ్వండి లేదంటే సమస్యలు వస్తాయని భర్తను కన్విన్స్ చేసి తమ పేర్లను అలాగే ఉంచుకోగలుగుతున్నారు. కానీ నాలాంటి అమ్మాయిలు అలా చెప్పలేక పేరు మార్చుకోవాల్సి వస్తుంది. కొన్ని దేశాల్లో పోరాటాలు చేసి మహిళలు పెళ్లి తర్వాత కూడా తమ ఇంటి పేరునే కొనసాగించేలా చట్టాలు తెచ్చుకున్నారు.

సన్యాసుల సంధ్య అంటే నాకు తిక్కరేగుతుంది

సన్యాసుల సంధ్య అంటే నాకు తిక్కరేగుతుంది

మనదేశంలో కూడా అలాంటి చట్టాలు రావాలి. నేను ఏ సంప్రదాయాన్ని తప్పు పట్టడం లేదు. ఆడవారు అన్నింట్లో సమానమే అని చెబుతూ ఇలా వైరుద్యం చూపడం సరికాదని మాత్రమే నా అభిప్రాయం. ఎందుకంటే నన్ను ఎవరైనా సన్యాసుల సంధ్య అంటే నాకు తిక్కరేగుతుంది. అందుకే ఏ అమ్మాయి అలాంటి ఇబ్బంది పడకూడదని నేను భావిస్తున్నా. నా వైవాహిక జీవితం అంతా బాగున్నా ఇంటిపేరు ఒక్కటే నన్ను వేధిస్తూ ఉంటుంది.

English summary

i love my married life but don't want to change my surname

My argument to such women would be that men seem to do fine and have as much of a sense of belonging as they need without having to change their name. Here the story Why only women take their husbands surname after marriage I don't agree.
Story first published: Wednesday, August 29, 2018, 11:57 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more