తను అడిగినప్పుడల్లా కిస్ ఇవ్వాలి క్లాస్ లో హగ్ ఇవ్వాలి - My Story #70

Written By:
Subscribe to Boldsky

నాకు అతను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో పరిచయం అయ్యాడు. మొదట మేమిద్దరం ఎంసెట్ కౌన్సెలింగ్ లో కలిశాం. అప్పుడే అతను నాకు పరిచయం అయ్యాడు. తర్వాత ఇద్దరం ఒకే బ్రాంచ్ తీసుకున్నాం. ఇద్దరం ఒకే కాలేజీలో జాయినయ్యాం. మొదట అతను నాకు ఫ్రెండ్ మాత్రమే. తర్వాత అతను నా బాయ్ ఫ్రెండ్ అయ్యాడు.

మేమిద్దరమే స్పెషల్ అట్రాక్షన్

మేమిద్దరమే స్పెషల్ అట్రాక్షన్

ఇద్దరి మనస్సులో ఉన్న ప్రేమను ఒక రోజు బయటపెట్టాం. ఎవరు ముందు చెప్పాలో అని చాలా రోజులు ఆలోచించాం. అయితే ఒక రోజు ఇద్దరం ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో కలిశాం. ఆ రోజు పార్టీలో మేమిద్దరమే స్పెషల్ అట్రాక్షన్.

రొమాంటిక్ గా ఉంటుందని అనుకున్నాను

రొమాంటిక్ గా ఉంటుందని అనుకున్నాను

పార్టీ అయిపోయాక తను నీకు ఒక మాట చెప్పాలన్నాడు. నేను కూడా అతనికి ఒక మాట చెప్పాలి అన్నాను. ఇద్దరం మనస్సులో ఉన్న మాటను చెప్పుకున్నాం ప్రేమలోకి దిగాక నా లైఫ్ ఫుల్ రొమాంటిక్ గా ఉంటుందని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది అసలు విషయం.

చాలా ఇబ్బంది పెట్టేవాడు

చాలా ఇబ్బంది పెట్టేవాడు

నేను అతన్ని చాలా గుడ్డిగా నమ్మాను. చాలా మంచి వాడు అనుకున్నాను. కానీ నాకు అతను అస్సలు అర్థం అయ్యేవాడు కాదు. అతనిది ప్రేమనో నాపై ఉండే ఉండే అతి ప్రేమనో నాకు అర్థం అయ్యేది కాదు. రోజూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు.

అన్ ఫ్రెండ్ చేయించాడు

అన్ ఫ్రెండ్ చేయించాడు

నా ఫ్రెండ్స్ మొత్తం బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్లు. నేను మాత్రం నా బాయ్ ఫ్రెండ్ ఎలా చెబితే అలా వినాల్సి వచ్చేది. మొదట అతను నా ఫేస్ బుక్ లోని బాయ్స్ ఫ్రెండ్స్ ను మొత్తం అన్ ఫ్రెండ్ చేయించాడు. నేను బాయ్స్ తో స్కూల్ లో ఇంటర్ లో దిగిన ఫొటోలను ఎఫ్ బీ లో పోస్ట్ చేశాను. వాటిని డిలీటీ చేయించాడు.

అబ్బాయిలతో మాట్లాడితే కోప్పడేవాడు

అబ్బాయిలతో మాట్లాడితే కోప్పడేవాడు

అతను చెప్పినట్లు వినకపోతే నన్ను టార్చర్ చేసేవాడు. దాంతో అతను ఎలా చెబితే అలా వినేదాన్ని. నేను ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడితే చాలా కోప్పడేవాడు. తిట్టేవాడు. దాంతో నేను అబ్బాయిలతో మాట్లాడడం మానేశాను. నాపై ఉండే అతి ప్రేమ నన్ను అలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనుకునేదాన్ని.

అడిగినప్పుడల్లా ముద్దు ఇవ్వాలి

అడిగినప్పుడల్లా ముద్దు ఇవ్వాలి

నేను అతను అడిగినప్పుడల్లా ముద్దు ఇవ్వాలి. అతను క్లాస్ అయిపోతేనే హగ్ అడిగేవాడు ఇచ్చేదాన్ని. కానీ అందులో అస్సలు ప్రేమ కనిపించేది కాదు. అంతా అనుమానం. నన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే అతని ఆందోళన మాత్రమే కనిపించేది. నన్ను ఎవరైనా ట్రాప్ చేస్తారేమోనని అతనికి చాలా భయం ఉండేది. అందుకే అతను నాపై అతను అతి ప్రేమ చూపించేవాడు.

రొమాన్స్ ఉండేది కాదు

రొమాన్స్ ఉండేది కాదు

ఎక్కడైనా బయటకు వెళ్లినా కూడా రొమాన్స్ ఉండేది కాదు. ఎంతసేపున్నా కూడా నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా ? నీ మనస్సులో నేను ఒక్కణ్నే ఉన్నా కదా అంటూ అనుమానపు ప్రశ్నలు అడిగేవాడు. అలా నన్ను చాలా టార్చర్ పెట్టేవాడు.

సెక్స్ అంటేనే నాకు ఇష్టం లేదు

సెక్స్ అంటేనే నాకు ఇష్టం లేదు

ఒకవేళ అతను నన్ను ముద్దుపెట్టుకున్నా.. హగ్ చేసుకున్నా... ఇంకేది చేసిన నాకు ఫీలింగ్ వచ్చేది కాదు. అతను కూడా ఏదో మెకానికల్ గా ఆ పనులు చేసేవాడు. ఒక రోజు అతను తన రూమ్ కు తీసుకెళ్లాడు. సెక్స్ చేద్దామన్నాడు. నేను ఒప్పుకోలేదు. అసలు అతనితో సెక్స్ అంటేనే నాకు ఇష్టం లేదు. అతనిపై ఆ ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడూ రాలేదు. అందుకే నేను ఒప్పుకోలేదు.

జీవితాంతం కలిసి ఉండలేము

జీవితాంతం కలిసి ఉండలేము

వాస్తవానికి నేను అతన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేసేదాన్ని. కానీ అతను మాత్రం నన్ను అనుమానిస్తూ ప్రేమించేవాడు. అలా బీటెక్ నాలుగేళ్లు నాకు ఇష్టం లేకుండానే అతనితో గడపాల్సి వచ్చింది. బీటెక్ అయిపోయాక నేను జాబ్ లో జాయినయ్యాను. ఆ తర్వాత అతనికి చెప్పాను. ఇక మనమిద్దరం విడిపోవడమే మంచిది. మనం జీవితాంతం కలిసి ఉండలేము అని అన్నాను. అతను మొదట బాధపడ్డాడు. తర్వాత ఒకే అన్నాడు.

ఫుల్ ఫ్రీడం

ఫుల్ ఫ్రీడం

అతని నుంచి దూరం అయ్యాక నాకు ఫుల్ ఫ్రీడం లభించినట్లయింది. నేను నాకు నచ్చినట్లుగా ఉండే అవకాశం వచ్చింది. నాకు నచ్చిన ప్లేస్ లకు వెళ్లొచ్చు. ప్రతిదానికి అతని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

అబ్బాయి పరిచయం

అబ్బాయి పరిచయం

తర్వాత నాకు మా ఆఫీసులో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను కొన్ని రోజులకు బాగా క్లోజ్ అయ్యాడు. నా బాయ్ ఫ్రెండ్, లైఫ్ లో నాకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు మొత్తం అతనిలో ఉన్నాయి. నాకు అతను సూట బుల్ పార్టనర్ అనుకున్నాను. అతనికి నా జీవితం అర్పిద్దామనుకుని డిసైడ్ అయ్యాను.

ప్రేమలో మునిగితేలిపోయాం

ప్రేమలో మునిగితేలిపోయాం

నేను అతనికి ప్రపోజ్ చేశాను. అతను ఒకే అన్నాడు. తర్వాత ఇద్దరం ప్రేమలో మునిగితేలిపోయాం. పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం హ్యాపీగా ఉంటున్నాం. మా ఆయనను నేను ఏం అడిగినా కాదనడు. నేను చెప్పిన ప్రతి పని చేస్తాడు.

నాకిష్టమైన రొమాన్స్ చేస్తున్నాను

నాకిష్టమైన రొమాన్స్ చేస్తున్నాను

ప్రతి క్షణం నన్ను అతను ఆనందంగా ఉంచుతున్నాడు. నేను అతనికి అన్నీ మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాను. నేను ఎలాంటి రొమాన్స్ కావాలనుకుంటున్నానో అలాంటి రొమాన్స్ అతనితో చేయగలుగుతున్నాను. నా లైఫ్ ఫుల్ బిందాస్ గా ఉంది. నేను మళ్లీ మా ఆయనతో ప్రేమలో పడ్డాను. నిజమైన ప్రేమ అంటే ఇదే అని ఇప్పుడు తెలిసింది.

English summary

i trusted him blindly and believed

i trusted him blindly and believed
Subscribe Newsletter