శోభనం జరిగిన నెలకే నా భార్య రెండు నెలల గర్భిణీ అయ్యింది - #mystory161

Written By:
Subscribe to Boldsky

ఆమె పేరు సావిత్రి. తను మా బంధువుల అమ్మాయే. ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను ఎక్కువగా కోరుకునేవాణ్ని. ఎలాగైనా సరే తనని లైన్లో పెట్టాలని ప్రయత్నించాను. మొత్తానికి తన నంబర్ సాధించాను.

రోజూ అనామకుడి మాదిరిగా మెసేజ్ లు పెట్టేవాణ్ని. సావిత్రి నుంచి రిప్లై వచ్చేది కాదు. తన బర్త్ డే రోజు దాదాపు వెయ్యి మెసేజ్ లు పెట్టాను. అప్పుడు ఫస్ట్ టైమ్ తన నుంచి రిప్లై వచ్చింది. థ్యాంక్యూ. ఎవరూ మీరు అని మెసేజ్ పెట్టింది.

బావా... నువ్వా?

బావా... నువ్వా?

ఆ రోజు నా వివరాలు మొత్తం చెప్పాను. బావా... నువ్వా? ఎందుకిలా పేరు చెప్పకుండా ఏడిపిస్తున్నావు అంది. ఆ రోజు మొత్తం సరదాగా మాట్లాడాను. మరుసటి రోజు నా మనస్సులో ఉన్న మాటను తనతో చెప్పాను. సావిత్రి ఎలా స్పందిస్తుందోనని చాలా ఆందోళన పడ్డాను. చివరకు సావిత్రి నుంచి నేను ఊహించిన సమాధానమే వచ్చింది.

తెలియకుండా బయట తిరిగేవాళ్లం

తెలియకుండా బయట తిరిగేవాళ్లం

బావ.. నువ్వంటే నాకిష్టమే. కానీ మా ఇంట్లో పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకుందాం అంది. నేను అందుకు ఒకే అన్నాను. కానీ ఇద్దరం మా పెద్దవాళ్లకు తెలియకుండా మాట్లాడుకునేవాళ్లం. కలిసి బయట తిరిగేవాళ్లం. నా ప్రేమ గురించి నేను మా ఇంట్లో చెప్పాను.

పెళ్లికి ముందుగానే ఎంజాయ్

పెళ్లికి ముందుగానే ఎంజాయ్

మా అమ్మానాన్న సావిత్రి వాలింట్లో మాట్లాడి నా పెళ్లి జరిగేలా చేస్తామన్నారు. దీంతో నేను, సావిత్రి ఎప్పటికైనా పెళ్లి చేసుకునేవాళ్లమే కదా అని పెళ్లికి ముందుగానే ఎంజాయ్ చేసేవాళ్లం. ఎవరికీ తెలియకండా మేమిద్దరం బైక్ పై చక్కర్లు కొట్టేవాళ్లం.

సెక్స్ లో పాల్గొనేందుకు భయపడింది

సెక్స్ లో పాల్గొనేందుకు భయపడింది

ఇద్దరం సినిమాలకు వెళ్లేవాళ్లం. పార్కుల్లో ముద్దులు పెట్టుకుంటూ.. ముచ్చట్లు చెప్పుకుంటూ గంటలు తరబడి గడిపేవాళ్లం. అలా ఒక రోజు నేను సావిత్రి శారీరకంగా కలిశాం. సావిత్రికి నాతో సెక్స్ లో పాల్గొనేందుకు చాలా భయపడింది. సెక్స్ లో పాల్గొన్నాక నేను తనని ఎక్కడ మోసం చేస్తానోనని మొదట అంగీకరించలేదు.

సెక్స్ పూర్తి కాగానే

సెక్స్ పూర్తి కాగానే

చివరకు సావిత్రి నాతో సెక్స్ లో పాల్గొంది. సెక్స్ పూర్తి కాగానే సావిత్రి బాత్రూమ్ లోకి వెళ్లి క్లీన్ చేసుకుని వచ్చింది. అలా చేస్తే ప్రెగ్నెంట్ అస్సలు కారని సావిత్రి చెప్పింది. ఇదంతా జనవరిలో జరిగింది. మా రెండు కుటుంబాల్లో పెద్దలు ఒప్పుకోవడంతో ఫిబ్రవరి చివరిలో మా పెళ్లి జరిగింది.

శోభనం జరిగింది మార్చిలో కదా

శోభనం జరిగింది మార్చిలో కదా

మా ఇద్దరికీ మార్చిలో శోభనం జరిగింది. నా భార్య ఏప్రిల్‌ నెలకల్లా ప్రెగ్నెంట్ అయ్యింది. డాక్టర్ వద్దకు వెళ్తే మీ భార్య గర్భిణీ అని చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. కానీ మా బంధువులంతా షాక్ అయ్యారు. మీకు శోభనం జరిగింది మార్చిలో కదా.. అప్పుడే నీ భార్య ఎలా రెండు నెలల గర్భిణీగా మారిందని అందరూ డౌట్ పడ్డారు.

రెండు నెలల గర్భవతి ఎలా అవుతారు?

రెండు నెలల గర్భవతి ఎలా అవుతారు?

డాక్టర్ నా భార్యను మీకు ఎప్పుడు పెళ్లి అయ్యింది అని అడిగారు. ఆమె కొన్ని వివరాలు చెప్పింది. మరి మార్చిలో మీ ఇద్దరికి శోభనం జరిగితే ఏప్రిల్ కల్లా మీరు రెండు నెలల గర్భవతి ఎలా అవుతారని అని అడిగారు. ఇదేలా సాధ్యమన్నారు. ఇదే నిజమైతే.. పెళ్లికి ముందు మీరు పరాయి పురుషుడితో సెక్స్‌లో పాల్గొని ఉండొచ్చు అని డాక్టర్ అన్నారట.

మార్చిలోనే సెక్స్‌

మార్చిలోనే సెక్స్‌

కానీ నా భార్య మాత్రం తాను మార్చిలోనే సెక్స్‌లో పాల్గొన్నట్టు డాక్టర్ తో వాదించింది. మా అమ్మనాన్న, వాళ్ల అమ్మనాన్న అక్కడే ఉండడంతో నా భార్య చాలా భయపడింది. తనకు ఆ సమయంలో ఏం చెప్పాలో తోచలేదు.

అంతకు ముందే సెక్స్‌

అంతకు ముందే సెక్స్‌

డాక్టర్ మాత్రం ఫిబ్రవరిలో పెళ్లి జరిగి.. శోభనం మార్చిలో జరగినప్పటికీ.. అంతకు ముందే.. సెక్స్‌లో పాల్గొనివుంటేనే ఏప్రిల్ నెలలకు రెండు నెలల గర్భం సాధ్యమవుతుందని చెప్పారట. తర్వాత విషయం నాకు తెలిసి వెంటనే హాస్పిటల్ కు వెళ్లాను.

ఒక్కసారే అయినా గర్భం వచ్చేస్తుంది

ఒక్కసారే అయినా గర్భం వచ్చేస్తుంది

నేను డాక్టర్ కు అన్ని విషయాలు చెప్పాను. డాక్టర్ కూడా నాకు కొన్ని విషయాలు చెప్పారు. మీరిద్దరూ పెళ్లికి ముందే అంటే జనవరి నుంచే మీరు దంపతులు కాకముందు ప్రేమికులుగా ఉండి, శారీరక సంబంధాలు కలిగివున్నట్టయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆమె అండం విడుదలయ్యే సమయంలో మీ కలయిక జరిగితే.. ఆ కలయిక ఒక్కసారే అయినా గర్భం వచ్చేస్తుందన్నారు.

జనవరిలో సెక్స్ లో పాల్గొన్నాం

జనవరిలో సెక్స్ లో పాల్గొన్నాం

జనవరిలో లైంగికంగా కలుసుకున్నపుడు నిలిచిన గర్భానికి ఏప్రిల్ నెలకు రెండు నెలలు అవుతుందని చెప్పారు. దీంతో నేను అసలు విషయం డాక్టర్ కు చెప్పాను. మేమిద్దరం జనవరిలో సెక్స్ లో పాల్గొన్నాం. కానీ నా భార్య అత్తమామలకు, తన తల్లిదండ్రులకు భయపడి ఆ విషయం చెప్పి ఉండకపోవొచ్చు అన్నాను.

పెళ్లికి ముందే అలాంటివి...

పెళ్లికి ముందే అలాంటివి...

మరీ ఈ విషయం ఆమె చెప్పకపోవడంతో అనవసరంగా మీ భార్యను అందరూ అనుమానించాల్సి వచ్చిందని డాక్టర్ అన్నారు. ఇలాంటి విషయాల్లో దంపతుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. అయినా పెళ్లికి ముందే అలాంటివి చేయడం తప్పని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు.

పెళ్లికి ముందు సెక్స్

పెళ్లికి ముందు సెక్స్

నాలాగే చాలా మంది దంపతుల మధ్య ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల భార్యను పదిమంది అనుమానిస్తారు. అందుకే ఇలాంటి విషయాల్లో అస్సలు దాపరికాలు ఉండకూడదు. దాచిపెడితే మన పరువును మనమే పోగొట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లికి ముందు సెక్స్ అనేది కూడా తప్పే.

అవమానంగా ఫీలయ్యాను

అవమానంగా ఫీలయ్యాను

మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి చేసుకోకపోయింటే ఆమె చాలా ఇబ్బందులుపడాల్సి వచ్చేది. నేను తండ్రిని అవుతున్నానని ఎంతో ఆనందించా. ఎంతో సంబరపడ్డాను. కానీ పెళ్లికి ముందే మేమిద్దరం శారీరకంగా కలిశామని ఆ రోజు అందరికీ తెలియడం కాస్త అవమానంగా ఫీలయ్యాను.

English summary

i was obviously exhilarated i was going to be a father

i was obviously exhilarated i was going to be a father
Story first published: Wednesday, April 25, 2018, 15:53 [IST]