For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బావను పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాలో.. అందులో విఫలం అయినందుక బాధపడాలో తెలియడం లేదు - #mystory117

ఇక ఆ రాత్రి నాకు నిద్రపడితే ఒట్టు. కళ్లు మూసినా.. కళ్లు తెరిచినా నాకు బావ బన్నీనే గుర్తొస్తున్నాడు. నా మనస్సులో విషయం నేరుగా బావకు చెప్పాలి అనుకున్నాను.

|

మా ఇంట్లో నాకు ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నారు. అయితే నేను ఎవ్వరికీ నచ్చేదాన్ని కాదు. నాకు ఎవ్వరూ నచ్చేవారు కాదు. నేను కాస్త లావుగా ఉండేదాన్ని. ఇలా లావుగా ఉంటే నన్ను ఎవరూ ఇష్టపడరని అనుకున్నాను. అందుకే వర్క్ అవుట్స్ చేసి ఒళ్లు తగ్గించుకున్నాను.

పల్లెటూరి పిల్లను

పల్లెటూరి పిల్లను

నేను పట్నంలో ఉండి ఉండొచ్చుగానీ నా ఆనవాళ్లు మాత్రం పల్లెటూరివే. సిటీలో ఉన్నప్పుడు చాలా మోడ్రన్ గా ఉంటాను. కానీ విలేజ్ కు వెళ్తే మాత్రం నేను స్టైల్ మొత్తం మారుస్తాను.

వాకిట్లో ముగ్గు

వాకిట్లో ముగ్గు

ఉగాది పండక్కి నేను మా మేనమామ ఇంటికి వెళ్లాను. నేను వాకిట్లో ముగ్గు వేస్తూ ఉన్నాను. అంతంలో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. చూడడానికి అచ్చం ప్రభాస్ లా ఉంటాడు. అతను మా బావ. పేరు బన్నీ.

చక్కని చుక్కలా

చక్కని చుక్కలా

ఇక రాగానే చక్కని చుక్కలా ఉన్న నువ్వు చుక్కల ముగ్గు వేస్తుంటే సూపర్ ఉన్నావ్ అన్నాడు. ఆ మాట వినగానే నా మనస్సు మేఘాల్లో తేలిపోయింది.

ఇద్దరూ డాక్టర్స్

ఇద్దరూ డాక్టర్స్

ఒకే బావా.. కాస్త చూసుకుంటూ వెళ్లు ముగ్గు పాడైపోతుంది అన్నాను. మా బావ మా మామయ్య దగ్గర ఉండడు. తను వాళ్ల అమ్మ దగ్గర ఉంటాడు. మా అత్తయ్య, మామయ్యలు ఇద్దరూ డాక్టర్స్. కానీ మా మామ మాత్రం ఊర్లోని హాస్పిట్ పెట్టి చుట్టు పక్కల గ్రామాల్లోని వారందరికీ మంచి ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకునేవారు.

అస్సలు నచ్చలేదు

అస్సలు నచ్చలేదు

మా అత్తయ్యకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఆమె చిన్నప్పటి నుంచి పట్నంలో పుట్టి పెరిగింది. ఇద్దరి మధ్య వచ్చిన ఈ గొడవ వల్ల వారిద్దరూ విడిపోయారు.

బావా టీ

బావా టీ

మా బావ ఇంట్లోకెళ్లి వాళ్ల నాన్నతో మాట్లాడుతున్నాడు. నేను వెంటనే ముగ్గు వేయడం పూర్తి చేసి అతన్ని ఎలాగైనా మళ్లీ చూడాలని ఇంట్లోకి వెళ్లాను. బావా టీ తాగు అంటూ టీ అందించాను. తర్వాత మామయ్యా కూడా టీ ఇచ్చాను.

భలే ఆనందపడిపోతాడు

భలే ఆనందపడిపోతాడు

టీ తాగుతూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. బావా అని నేను పిలిస్తే మా బావా భలే ఆనందపడిపోయేవాడు. నేనంటే మా బావకు చాలా ఇష్టం.

ఇద్దరం కలిసి తిన్నాం

ఇద్దరం కలిసి తిన్నాం

మా మామయ్యా ఊర్లోని హాస్పిటల్ కు వెళ్లాడు. మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాం. ఇద్దరం కలిసి తిన్నాం. ఇద్దరం కలిసి టీవీ చూస్తూ కూర్చొన్నాం. ఎన్నో విషయాలు మాట్లాడాలనిపిస్తోంది. కానీ మాట్లాడలేకపోయాను.

ఇక్కడికి వస్తూ ఉంటాడు

ఇక్కడికి వస్తూ ఉంటాడు

బావ.. మళ్లీ మధ్యాహ్నానికే వెళ్లిపోయాడు. మా బావ మా అత్తయ్యకు తెలియకుండా ఇక్కడికి వస్తూ ఉంటాడు. అందుకే మామయ్యకు ఫోన్ చేసి తర్వగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

కళ్లు మూసినా.. కళ్లు తెరిచినా

కళ్లు మూసినా.. కళ్లు తెరిచినా

ఇక ఆ రాత్రి నాకు నిద్రపడితే ఒట్టు. కళ్లు మూసినా.. కళ్లు తెరిచినా నాకు బావ బన్నీనే గుర్తొస్తున్నాడు. నా మనస్సులో విషయం నేరుగా బావకు చెప్పాలి అనుకున్నాను. బావా... నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా మనస్సులో కొన్ని వేలసార్లు అనుకునేదాన్ని.

మామయ్యకు చెప్పాను

మామయ్యకు చెప్పాను

కానీ అతను కాదంటే నేను తట్టుకోలేను. అందుకే నా మనస్సులో మాట మొదట మా మామయ్యకు చెప్పాను. నాకు బావా అంటే ఇష్టం. నేను బావనే పెళ్లి చేసుకుంటా అన్నాను.

ఒరేయ్ బన్నీ.. చేసుకోరా

ఒరేయ్ బన్నీ.. చేసుకోరా

మామయ్య కూడా చాలా సంతోషపడ్డాడు. సమయం చూసుకుని నేను వాడితో మాట్లాడుతాను అన్నాను. ఓరోజు బావకు మామయ్య ఫోన్‌ చేసి ‘ఒరేయ్ బన్నీ.. సరిత నిన్నుపెళ్లి చేసుకుంటా అంటుంది. నువ్వుంటే తనకు చాలా ఇష్టం. చేసుకోరా 'అన్నాడు.

ఓకే చెప్పారు

ఓకే చెప్పారు

బావ కూడా ఒకే అన్నాడు. ఇక మా ఇంట్లో వారు కూడా.. వరుసైనోడు, పైగా మంచి ఉద్యోగం ఉన్నోడు, పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఓకే చెప్పారు.

ఎలా చేసుకుంటావ్

ఎలా చేసుకుంటావ్

ఇక బావా ఈ విషయం వాళ్ల అమ్మకు చెబుదామనుకునేలోపు... ఎవరో వాళ్ల అమ్మకు ఆ విషయం చెప్పారు. వాళ్లతో మనకు గొడవలయ్యాయి. వాళ్లింటి అమ్మాయిని ఎలా చేసుకుంటావ్ అంది అత్తయ్య.

సరితను కదా

సరితను కదా

"అమ్మా... వాళ్లతో ఎప్పుడో జరిగిన గొడవల్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు. అయినా నేను చేసుకునేది సరితను కదా అన్నాను. " అని బావ చెప్పినా అత్తయ్య వినలేదు.

అత్తయ్య ఒప్పుకునేదాకా

అత్తయ్య ఒప్పుకునేదాకా

తర్వాత విషయం నాకు చెప్పాడు. అత్తయ్య ఒప్పుకునేదాకా కొన్నాళ్లు వెయిట్ చేద్దాం అన్నాను. సరే అని బావా కూడా వెయిట్ చేశాడు. అత్తయ్యా మనస్సు కరగలేదు.

బావకు పోరు

బావకు పోరు

ఇక మా నాన్న నుంచి బావకు పోరు మొదలైంది. మా అమ్మాయి యూఎస్ సంబంధాలు వస్తున్నాయ్ బన్నీ.. నువ్వు ఏదో ఒక విషయం చెప్పు అన్నాడు. దీంతో బావకు మెంటలెక్కి పోయింది.

గుళ్లో పెళ్లి చేసుకున్నాడు

గుళ్లో పెళ్లి చేసుకున్నాడు

మామయ్య, మా అమ్మనాన్నల అంగీకారంతో నన్ను గుళ్లో పెళ్లి చేసుకున్నాడు బన్నీ బావ. మా కాపురం విజయవాడలో పెట్టాం.

కొన్నాళ్లు గడిస్తే అత్తయ్య మనసు మారుతుందని మా ఆశ.

అత్తయ్య అంటే చాలా ఇష్టం

అత్తయ్య అంటే చాలా ఇష్టం

కానీ అత్తయ్య చాలా బాధపడిందట. నా కొడుకుకు వాళ్లు ఏవేవో మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నారని బాధపడేదట. ఆ విషయాలన్నీ తెలిసి నాకు బాధేసింది. నిజంగా నాకు అత్తయ్య అంటే చాలా ఇష్టం.

మనస్సు కరగలేదు

మనస్సు కరగలేదు

బన్నీ బావ అంటే కూడా బాగా ఇష్టం. అందుకే పెళ్లి చేసుకున్నాను. కానీ తనను మామయ్య, బావ ఇద్దరూ మోసం చేశారని బాధపడేదట. ఒకరోజు నేను, బావ ఇద్దరం ఊరికి వెళ్లాం. అత్తయ్య కాళ్లపై పడ్డాం. అయినా ఆమె మనస్సు కరగలేదు.

నా మొహం కూడా చూడలేదు

నా మొహం కూడా చూడలేదు

అత్తయ్య నా మొహం కూడా చూడలేదు. మాట్లాడలేదు. వెంటనే అక్కడి నుంచి తిరిగొచ్చాం. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాలో మా అత్తయ్యను నిత్యం కంట తడిపెట్టిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. మా అత్తయ్యను ఆనందపరచడంలో నేను విఫలం అయ్యాను. మా పెద్దవాళ్లు అత్తయ్యతో ఉన్న గొడవలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.

English summary

i will marry you only if you know i have that feeling for you

i will marry you only if you know i have that feeling for you
Desktop Bottom Promotion