అతను నన్ను రేప్ చేస్తుంటే సహకరించాల్సి వచ్చింది - My Story#71

Written By:
Subscribe to Boldsky

ఓ భార్య.. భర్తకు చెప్పుకోలేని ఓ బాధనే ఈ కథ...

"నువ్వు నా కోసం ఎన్నో చేశావు. నువ్వు నాకిష్టం. కేవలం ఇష్టం అని చెప్పలేను. నా ప్రాణం. కానీ జీవితంలో ఎంతటి మహామహులైనా ఒక్కసారి ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. నేను అలాంటి తప్పే చేశాను. ఆ విషయం నా మనస్సుకు తెలుసు.

అంతరాత్మ ప్రశ్నిస్తుంటుంది

అంతరాత్మ ప్రశ్నిస్తుంటుంది

అందుకే నా అంతరాత్మ ఎప్పుడూ ప్రశ్నిస్తుంటుంది. నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త విషయంలో నువ్వు ఎందుకు తప్పు చేశావని. అయితే అది నేను కావాలని చేసిన తప్పు కాదు. నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పు. కానీ నీతో ఆ విషయం చెప్పేందుకు నాకు అంత ధైర్యం లేదు.

నా భర్తని చెప్పుకోవడం..

నా భర్తని చెప్పుకోవడం..

నువ్వు నా భర్తని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నాకోసం అందరికీ దూరం అయ్యావు. నన్ను ప్రేమవివాహం చేసుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు. మన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడేందుకు.. నా కోసం నువ్వు సుదూర ప్రాంతానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నావు.

ప్రతి క్షణం నరకం

ప్రతి క్షణం నరకం

నువ్వు నా దగ్గర లేని ప్రతిక్షణం నాకు ఒక నరకంలా ఉంటుంది. అయినా అలాగే గడుపుతున్నా. ఎప్పుడూ నువ్వే గుర్తొస్తుంటావు. నీతో నేను ఇంత వరకు ఏ విషయం దాచలేదు. నువ్వు కూడా నాతో ప్రతి విషయం చెబుతుంటావు. కానీ నేను నీతో ఒక భయంకరమైన నిజాన్నిదాచాను. దాన్ని నేను ఎప్పటికీ చెప్పకూడదనుకుంటున్నాను.

క్యాబ్ లో బ్యాక్ సీట్లో..

క్యాబ్ లో బ్యాక్ సీట్లో..

ఆ రోజు నేను క్యాబ్ లో ఇంటికి వస్తున్నాను. నేను ఆ క్యాబ్ బుక్ చేయలేదు. రోడ్డుపై వస్తుంటే జస్ట్ ఆపాను. ఆ క్యాబ్ నంబర్ కూడా గుర్తుపట్టకుండా స్టిక్కర్ వేశారు. అప్పటికే ఒక వ్యక్తి బ్యాక్ సీట్లో కూర్చొన్నాడు. నేను అతని పక్కనే కూర్చొవాల్సి వచ్చింది. వాస్తవానికి అతను డ్రైవర్ కు తెలిసిన మనిషే.

అలసి పోయాను

అలసి పోయాను

నేను అప్పటికే చాలా అలిసిపోయాను. అంతకుముందు రెండు రోజులుగా నాకు నిద్రలేదు. కళ్లు మూసుకుంటే నిద్ర వస్తుంది. క్యాబ్ ఎక్కగానే గాఢ నిద్రలోకి వెళ్లిపోయాను. క్యాబ్ లోని అతను అదే అదనుగా భావించాడు. నన్ను ఇష్టానుసారంగా అతనికి నచ్చినట్లుగా చూశాడు.

బ్రెస్ట్ ను టచ్ చేశాడు

బ్రెస్ట్ ను టచ్ చేశాడు

ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ చాలా లూజ్ గా ఉంది. దాంతో పాటు నేను ఆ రోజు హడావిడిగా ఉండి లో దుస్తులు కూడా ధరించలేదు. నేను నిద్రలో ఉన్నప్పుడు అతను నా బాడీని మొత్తం చూశాడు. నా బ్రెస్ట్ ను టచ్ చేశాడు. తర్వాత నన్ను అతను దగ్గరకు తీసుకున్నాడు. గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు నాకు మెలకువ వచ్చింది.

గొంతుపై కత్తి

గొంతుపై కత్తి

నేను నిద్రలో నుంచి తేరుకునేలోపే నా గొంతుపై అతను కత్తి పెట్టాడు. అతనికి డ్రైవర్ కూడా సహకరించాడు. నాకు కొన్ని నిమిషాల వరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కారు ఎక్కడ ఉందో తెలియడం లేదు. నా డ్రెస్ మొత్తం ఎలా అంటే అలా అయ్యింది.

రేప్ కు సహకరించా

రేప్ కు సహకరించా

అతను నన్ను రేప్ చేయబోయాడు. అతనికి సహకరించకపోతే నన్ను కచ్చితంగా చంపేస్తాడని అనిపించింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నాకు ఆలోచించుకునే టైమ్ కూడా అతను ఇవ్వలేదు. కళ్ల వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయినా ఏమి చెయ్యలేని నిస్సహా స్థితిలో ఉండిపోయాను.

బలవంతంగా సమర్పించుకున్నా

బలవంతంగా సమర్పించుకున్నా

ఏం చేయలేకనే అతనికి నేను సహకరించాల్సి వచ్చింది. అతను చెప్పినట్లు వినాల్సి వచ్చింది. అతనికి నన్ను బలవంతంగా సమర్పించుకోవాల్సి వచ్చింది. ఎదురు తిరిగితే ప్రాణాలు పోతాయనే భయంతో ఆ రోజు అలా చేశాను.

పరువు పోతుందని

పరువు పోతుందని

తర్వాత కేసు పెడదామంటే పరువు పోతుందని ముందడుగు వెయ్యలేకపోయాను. ఆ రోజు అక్కడ జరిగిన విషయం ఇప్పటికీ మనస్సులో ఉంచుకుని గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాను. మనం ఎంత హోదాలో ఉన్న.. సమాజంలో మనకు ఎంత గుర్తింపు ఉన్నా.. ఎంత మంది పెద్దపెద్ద వాళ్లు తెలిసినా.. ఒక్కో సందర్భంలో కాలం మనం చేతిలో ఉండదు.

అన్యాయం చేయకూడదనుకున్నా

అన్యాయం చేయకూడదనుకున్నా

అలాంటి పరిస్థితిలో ఏం చేయలేనినిస్సహాయ స్తితికి వస్తాం. అలాంటి పరిస్థితే నాకు ఆ రోజు ఎదురైంది. నా భర్తకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను అన్యాయం చేయకూడదనుకున్నా. కానీ ఆ రోజు అలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అనుకోలేదు.

నువ్వు ఎలా స్పందిస్తావో

నువ్వు ఎలా స్పందిస్తావో

ఆ సమయంలో ఏం చేయాలో తెలియక నేను సహకరించాల్సి వచ్చింది. దీన్ని నీకు చెబితే నువ్వు ఎలా స్పందిస్తావో నాకు తెలియదు. కానీ నా అంతరాత్మ మాత్రం ప్రతి రోజు నన్ను ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటుంది. నీకు విషయం చెప్పకుండా నిన్ను మోసం చేస్తేన్నానని నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏమి చేయలేను."

English summary

i wish i could tell you this but i can’t i don’t have the guts to

i wish i could tell you this but i can’t i don’t have the guts to