Latest Updates
-
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!
నా భార్య సెక్స్ చేసేటప్పుడు ఏడుస్తుంది.. ఎందుకో తెలిసి నేను షాక్ అయ్యాను - #mystory156
నీకు అంతగా సెక్స్ ఇష్టం లేకుంటే చెప్పు.. నేను అస్సలు నీతో సెక్స్ చెయ్యను అని నా భార్యతో చెప్పాను. అలాంటిదేమీ లేదండి... నువ్వంటే నాకు ఎంతో ప్రేమ.. నీతో సెక్స్ అంటే కూడా భలే ఇష్టం అని ధైర్యంగా చెప్పింది
నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భార్యకు నేనంటే చాలా ఇష్టం. అయితే నా భార్య ప్రతి చిన్న విషయానికి బాధపడేది. చిన్న మాటంటే చాలు గదిలోకి వెళ్లి ఏడ్చేది. మా అమ్మ తిట్టినా కూడా బోరున ఏడ్చేది.

చాలా అందంగా ఉంటుంది
నా భార్య ప్రవర్తన చూస్తే నాకే బాధేసేది. నా భార్య చాలా అందంగా ఉంటుంది. బుగ్గ గిల్లితే ఆమె చెంప మొత్తం కందిపోతుంది. అంత అందమైన అమ్మాయి ఏడ్చుతుంటే నాకు అస్సలు చూడాలనిపించేంది కాదు.

నీకు నొప్పిగా ఉందా?
నా భార్యతో నేను సెక్స్ లో పాల్గొంటే కూడా ఆమె ఏడ్చేది. చాలాసార్లు నేను ఆమెను ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాను. కానీ కారణం చెప్పలేదు. నీకు నొప్పిగా ఉందా? లేదంటే బాధగా ఉందా? నేను చాలా గట్టిగా స్ట్రోక్స్ ఇస్తున్నానా అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. ఆమె అందుకు ఎలాంటి సమాధానం చెప్పేది కాదు.

నీతో సెక్స్ అంటే భలే ఇష్టం
నీకు అంతగా సెక్స్ ఇష్టం లేకుంటే చెప్పు.. నేను అస్సలు నీతో సెక్స్ చెయ్యను అని నా భార్యతో చెప్పాను. అలాంటిదేమీ లేదండి... నువ్వంటే నాకు ఎంతో ప్రేమ.. నీతో సెక్స్ అంటే కూడా భలే ఇష్టం అని ధైర్యంగా చెప్పింది. అంతకు ముందు ఎప్పుడు కూడా నా భార్య అంత ధైర్యంగా మాట్లాడలేదు.

సెక్స్ లో పాల్గొన్నప్పుడల్లా
మరి ఎందుకు ఏడుస్తుంటావు అన్నాను. ఏమో నాకు తెలియదండి. మనం ఇద్దరం సెక్స్ లో పాల్గొన్నప్పుడల్లా అలా అయిపోతుందండీ అని అంది. అయితే నాకు పరిచయం ఉన్న కొందరు స్పెషలిస్ట్ లను ఈ విషయం గురించి అడిగాను. వాళ్లు ఇలా చెప్పారు.

అంతులేని ఆనందం వల్లే
అయితే నవ్వినా, ఏడ్చినా కొందరికీ కన్నీళ్లే వస్తాయి అని కొందరు స్పెషలిస్ట్ లు నాకు చెప్పారు. అంతులేని ఆనందానికి, తీవ్రమైన నొప్పికి పెద్ద తేడా లేదట. బాధ, ఆనందం, కోపం, ఆందోళన ఇలా ఏ భావోద్రేకాన్ని తీసుకున్నా వాటికో ప్రత్యేకమైన ముఖకవళికలుంటాయి. ఇక సంతోషం, బాధ కలిగే సమయాల్లో ముఖకవళికలు మారుతుంటాయి.

రకరకాల ఎక్స్ ప్రెషన్స్
భార్యాభర్తలు సెక్స్ లో పాల్గొనేటప్పుడు భార్య ముఖంలో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ వస్తాయి. ఆమె అంతులేని ఆనందం అనుభవించే భావప్రాప్తి సమయంలోనూ, తీవ్రమైన నొప్పితో బాధపడే సందర్భంలోనూ ముఖంలో ఒకేరకమైన భావోద్వేగాలకు గురవుతుంది.

కళ్ల నిండా నీరు
సెక్స్ చేసేటప్పుడు ఆమెకు బాధ కలిగితే ఆమె ముఖంలో అది కనపడుతుంది. ఇక కొందరు మహిళలు భావప్రాప్తి పొందేటప్పుడు అత్యధిక ఆనందానికి లోనై కంటినిండా నీరు కార్చుతారంట. నా భార్య కూడా నాతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు బాగా ఆనందం చెందేది. అందుకే అలా కళ్ల నిండా నీరుకార్చేది.

తికమకపడుతుంటారు
ఇలా చాలామంది మహిళలు సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఏడుస్తుంటారట. అయితే అందుకు కారణాలు తెలియక మగవారు తికమకపడుతుంటారు. కొందరు బాధతో, నొప్పితో ఏడిస్తే మరికొందరు ఆనందంతో ఏడుస్తారు.

భావప్రాప్తికి గురైందా
అయితే ఒక మహిళ ముఖంలోని భావాలను మగవారి కంటే ఆడవారే బాగా గుర్తించగలుగుతారట. అయితే మహిళ సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఆమె భావప్రాప్తికి గురైందా లేదా అనే విషయాలను గుర్తించటంలో మాత్రం మగవారిదే అందెవేసిన చెయ్యి.

సెక్స్ లో పాల్గొనేటప్పుడు
ఇలా చాలా విషయాలను నేను స్పెషలిస్టుల ద్వారా కనుక్కున్నాను. చాలా మంది మగవారు ఈ విషయాలు తెలియకపోవడంతో తన భార్య తనతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఏదో నొప్పి వల్ల ఏడుస్తుందని అనుకుంటారు. అయితే నొప్పి వల్ల కూడా మహిళలు ఏడవవచ్చు. అలాగే సెక్స్ లో ఎక్కువ ఆనందం కలిగితే కూడా కంటినిండా నీరు పెడతారు.

ఆమెతో ఆనందంగా గడుపుతూ
ఇక ప్రతి భర్తకు కూడా అతన్ని అర్థం చేసుకునే భార్య దొరికితే ఆమెతో ఆనందంగా గడుపుతూ హ్యాపీగా ఉంటాడు. ప్రతి విషయం భర్తకు భార్య చెప్పుకోగలిగితే ఆ దాంపత్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే నాలా ప్రతి విషయంపై శోధిస్తూ ఉండాల్సి వస్తుంది. ఒక ఫిలాసపర్ మారి ఇతరులకు సందేశాలు ఇవ్వాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications
