నా భర్త నన్నూ, నా కూతుర్ని అనుభవించాలనుకున్నాడు - #mystory170

Written By:
Subscribe to Boldsky

నా కూతురుకు పెళ్లి కుదిరిందని... నా భర్త ఆమెను బంగారంలా చూసుకుంటున్నాడని తెగ సంతోషపడ్డాను. కానీ నా భర్తే నా కూతురిపై అత్యాచారయత్నం చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు.

నాకు చిన్న వయస్సులోనే పెళ్లి చేశారు. నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు. నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. మాది పల్లెటూరు. మా ఆయనకు నాలుగెకరాల పొలం ఉండేది. ఆయనకు అమ్మానాన్న లేరు. ఒక్కడే కొడుకు. మేమిద్దరం ఊర్లో బాగా బతికేవాళ్లం.

మా ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటికే నాకు కూతురు పుట్టింది. మా ఆయన పోయిన దుఖంలో నాకు ఎలా బతకాలో తోచలేదు. కొన్ని రోజులు ఊర్లోనే పొలాన్ని సాగు చేసుకుంటూ బతికాను.

పుట్టింటికి పోదామనుకున్నా

పుట్టింటికి పోదామనుకున్నా

భర్త లేకపోవడంతో ఊరిలో చాలా మంది కళ్లు నా మీద పడ్డాయి. కూతురిని తీసుకుని పుట్టింటికి పోదామనుకున్నా. కానీ మావాళ్ల ఆర్థికపరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. నా బాధలను తలుచుకుని నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని.

భర్త లేని వారంటే

భర్త లేని వారంటే

ఆ సమయంలో నాకు నాయుడు పరిచయం అయ్యాడు. నాయుడికి పెళ్లి కాలేదు. నాపై ఎక్కువగా ఆప్యాయత చూపేవాడు. నాకు అండగా ఉండేవాడు. భరోసా ఇచ్చేవాడు. భర్త లేని వారంటే ఈ సమాజం ఇలాగే చూస్తుందని నాకు ధైర్యం చెప్పేవాడు. నాయుడు నాకన్నా చిన్నవాడు.

నన్ను పెళ్లి చేసుకో

నన్ను పెళ్లి చేసుకో

నా పొలం పనులు మొత్తనాయుడు చూసుకునేవాడు. ఒక రోజు నేను పొలానికి వెళ్లాను. ఈ పనులు మొత్తం నీకు అంతసులభం కాదు. పైగా నీకు ఒక పాప ఉంది. పొలం పనులు నేను చూసుకుంటాను. నీ పాపకు కూడా ఒక తండ్రిలా ఉంటాను నన్ను పెళ్లి చేసుకో అన్నాడు.

నేను కూడా వయస్సులో ఉన్నా

నేను కూడా వయస్సులో ఉన్నా

అతడి మాటలు నమ్మాను. పైగా నేను కూడా వయస్సులో ఉన్నాను కాబట్టి మగతోడు కోసం నాయుడిని చేసుకోవాలన్నాను. నన్ను నాయడు బాగా అర్థం చేసుకునేవాడు. కానీ ఊర్లో నేను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ అందరూ నానా మాటలు అంటారని పొలం అమ్మి దూరంగా వెళ్లి పోయాం.

కాపురం పెట్టాం

కాపురం పెట్టాం

మరో ఊరిలో పొలం కొనుక్కొని అక్కడ ఎవరికీ మా విషయం తెలియకుండా కాపురం పెట్టాం. నాయుడు జీవితాంతం నాకు, నా కూతురికి అండగా ఉంటానన్నాడు. మగవాడి అండ ఉంటే మంచిదనుకునే నాయుడిని పెళ్లి చేసుకున్నాను.

నా కూతురికి కోపం ఉండేది

నా కూతురికి కోపం ఉండేది

మా జీవితం బాగా ఉండేది. నా కూతురికి పదిహేడేళ్ళు వచ్చాయి. నేను నాయుడిని చేసుకోవడం తనకి ఇష్టం లేదు. నా విషయం కొన్ని రోజులకు ఊర్లో వాళ్లకు తెలియడంతో నా కూతుర్ని ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు. అందుకే నాయుడిపై నా కూతురికి కోపం ఉండేది.

నా బిడ్డమీద కన్నుపడింది

నా బిడ్డమీద కన్నుపడింది

నా కూతురు అందాలబొమ్మలా ఉంటుంది. ఆ పిల్లకు పెళ్లి చేయాలని అనుకున్నాను. నాయుడికి విషయం చెప్పాను. అతను అప్పుడే ఎందుకూ అనేవాడు. నాయుడికి నా బిడ్డమీద కన్నుపడిందనే విషయం నేను గుర్తించలేకపోయాను.

అత్యాచారయత్నం

అత్యాచారయత్నం

ఒక రోజు నేను లేనప్పుడు నా కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తనను లోబరుచుకుని కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఆ విషయం నాతో చెబితే మీ అమ్మను చంపేస్తానని నా కూతుర్ని బెదిరించాడు.

బలవంతం చేసేవాడు

బలవంతం చేసేవాడు

నాయుడు నేను ఇంట్లో లేనప్పుడల్లా తన కోరిక తీర్చమని బలవంతం చేసేవాడు. నా మాట వినకపోతే నీ తల్లిని వదిలేస్తా.. లేదంటే చంపుతా.. అప్పుడు నీ జీవితం కుక్కలు చింపినా విస్తరవుతుందని నాయడు నా కూతుర్ని బెదిరించాడు.

స్వయంగా చూశాను

స్వయంగా చూశాను

కొన్ని రోజులకు ఈ వ్యవహారం మొత్తం నాకు తెలిసింది. ఒక రోజు నాయుడు నీచత్వాన్ని నేను స్వయంగా చూశాను. నన్ను చూడగానే తలదించుకున్నాడు. అప్పుడు నా కూతురు నాయుడు తనతో ఎలా ప్రవర్తించాడో అన్నీ చెప్పింది.

అండగా ఉంటాడని నమ్మితే

అండగా ఉంటాడని నమ్మితే

అవన్నీ వింటే నాయుడిని చంపాలన్నంత కోపం వచ్చింది. నా బిడ్డకు అండగా ఉంటాడని నమ్మి పెళ్లి చేసుకుంటే, ఇంత దుర్మార్గానికి ఒడికడతాడా అని కోపం వచ్చింది. నాయుడు మనసులో కుట్ర చాలానే ఉందని తర్వాత తెలిసింది. కేవలం నా పొలం, నా అందం రెండూ దక్కుతాయనే నాయుడు నన్ను చేసుకున్నాడు.

వివాహం చేస్తానన్నాడు

వివాహం చేస్తానన్నాడు

వెంటనే నా కూతురును తీసుకుని మా బంధువుల ఊరికి వెళ్లాను. తర్వాత నాయుడు వచ్చి నా కాళ్లు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. నా కూతురికి తనే మంచిసంబంధం తెచ్చి వివాహం చేస్తానన్నాడు. ఈ ఒక్కసారికి తనను నమ్మమని బతిమిలాడాడు.

ఆనందంలో ఉండిపోయాను

ఆనందంలో ఉండిపోయాను

మొత్తానికి నాయుడు ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి, అతని కుటుంబం మంచిది కావడంతో నేను ఒకే అన్నాను. నా కూతురికి సంబంధం కుదిరిందని ఆనందంలో ఉండిపోయాను.

సిటీకి వెళ్లాను

సిటీకి వెళ్లాను

నా కూతురి పెళ్లికి బంగారం చేయించే పని మీద నేను, మా బంధువులతో కలిసి సిటీకి వెళ్లాను. నాయడు పొలానికి వెళ్లాడు. ఇంట్లో నా కూతురు ఒంటరిగా ఉంది. సిటీకి వెళ్లిన తర్వాత ఒకవేళ నాయుడు ఇంటికి వచ్చి ఉంటే? ఎలా అనిపించింది.

పిడిగుద్దులు గుద్దాడు

పిడిగుద్దులు గుద్దాడు

వెంటనే బస్సు ఎక్కి ఊరికి వచ్చాను. నేను అనుకున్నట్లుగానే అయ్యింది. నాయుడు నా కూతురిని బలవంతం చేస్తూ ఉన్నాడు. వెంటనే లోపలికి వెళ్లాను. నా కూతురిని వదులు అంటూ విడిపించాను. నాయుడు నా ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు.

తలపై కొట్టాను

తలపై కొట్టాను

అయినా అతని నుంచి కూతుర్ని విడిపించుకుని బయటపడ్డాను. రూమ్ లో ఉన్న ఒక రాడ్ తీసుకుని నాయుడు తలపై కొట్టాను. తల పగిలి రక్తం చివ్వున పైకెగిసింది. చచ్చిపోయాడేమో అనుకుని భయపడ్డాను. ఆసుపత్రికి తీసుకెళ్తే బతికాడు.

గుడ్డిగా నమ్మకూడదు

గుడ్డిగా నమ్మకూడదు

తర్వాత నా కూతురికి నేను పెళ్లి చేశాను. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా దూరంగా ఉంటున్నాను. భర్త చనిపోతే ఈ సమాజంలోని ఏ మగాడ్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు. నాయుడులాంటి దుర్మార్గులు చాలామందే ఉంటారు. నమ్మించి గొంతు కోసే ఇలాంటి వారిని నమ్మి మోసపోకండి.

English summary

my daughter was sexually assaulted at home

my daughter was sexually assaulted at home
Story first published: Saturday, April 28, 2018, 17:00 [IST]