For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బాలిలో నా భార్యతో జాలీగా ఎంజాయ్ చేశాను .. నా భార్య బాలిలో స్వర్గం చూపించింది - #mystory184

  |

  చచ్చేలోపు ఒక్కసారైనా ప్రకృతి ప్రసాదించినా అందాలన్నీ చూడాలన్నది నా ఆశ. అందుకే నా భార్యతో బాలి ట్రిప్ ప్లాన్ చేశాను. బాలి గురించి నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు కచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్లాలని నాకు అనిపించింది. అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడికి పయనం అయ్యాను.

  హనీమూన్‌ వెళ్లే జంటలకు

  హనీమూన్‌ వెళ్లే జంటలకు

  హనీమూన్‌ వెళ్లే జంటలకయినా, కుటుంబంతో ఆనందంగా విహారానికైనా, చివరకూ ఒంటరి పక్షులకయినా చక్కటి అనువైన ప్రదేశం బాలి. ఇండోనేషియాకు ప్రధాన ఆదాయ వనరుగా బాసిల్లితున్న బాలి ఒక ద్వీపం. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లొస్తే భూమిపైనే మీరు స్వర్గం చూసినట్లు ఫీలవుతారు.

  పుడమికి పచ్చని చీర చుట్టినట్టు

  పుడమికి పచ్చని చీర చుట్టినట్టు

  బాలిలో పుడమికి పచ్చని చీర చుట్టినట్టు పరుచుకున్న వరిచేలు మనకు దర్శనం ఇస్తాయి. గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పురాతన కట్టడాలు, అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలు కూడా ఉంటాయి. ఇక మన రుచుల మాదిరిగానే నోరూరించే రుచులుంటాయి.

  సముద్రం అంచుకు వెళ్తే

  సముద్రం అంచుకు వెళ్తే

  బాలిలో ఒక వీధి నుంచి వెళ్తుంటే మంత్రాలు చెవిన పడతాయి.

  మరో వీధిలోకి ప్రవేశిస్తే.. పాశ్చాత్య సంగీతం వినిపిస్తుంది.

  ఇక అదే ఊరికి మరో చివరన సముద్రం అంచుకు వెళ్తే.. బతికున్నంత కాలం ఈ స్వర్గంలో ఉంటే చాలు అని అనిపిస్తుంది.

  ప్రత్యేకతలెన్నో ఉన్నాయి

  ప్రత్యేకతలెన్నో ఉన్నాయి

  అందమైన వాతావరణం.. ఆహ్లాదకరమైన సముద్ర తీరాలు..ఆధ్యాత్మికతను పంచే ఆలయాలు.. అలరించే ఆటలు..ఆశ్చర్యపరిచే సంప్రదాయాలు.

  ఇవన్నీ ఒకేచోట ఉంటే అదే బాలి. పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల అంచున ఉన్న బాలీలో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి.

  సాహస క్రీడల్లో మునిగిపోయాను

  సాహస క్రీడల్లో మునిగిపోయాను

  బాలిలో వీధివీధినా హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. అందుకే బాలి ‘దేవుళ్ల ద్వీపం'గా గుర్తింపు పొందింది. బాలి సుమారు ఐదున్నరవేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. బాలీలో నేను నా భార్యతో సాహస క్రీడల్లో మునిగిపోయాను. క్లబ్బుల్లో, పబ్బుల్లో ఆనందించాను. మేము

  బాలీలో ఉలవటు ఆలయానికి వెళ్లాం. డెన్పసార్‌ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రం అంచులో ఉన్న పర్వత శిఖరంపై ఉలవటు ఆలయాన్ని నిర్మించారు.

  రెండు పర్వతాలు

  రెండు పర్వతాలు

  కడలిని చీల్చుకుంటూ పైకి వచ్చిన రెండు పర్వతాలు పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. ఉలవటు ఆలయంలో ప్రధాన దైవం మహావిష్ణువు. ప్రాంగణంలో భారీ కుంభకర్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తారు. సూర్యాస్తమయం ఇక్కడ చూడ ముచ్చటగా ఉంటుంది.

  జాలీగా గడిపాం

  జాలీగా గడిపాం

  బాలీకెళ్లిన మేము ఎంతో జాలీగా గడిపాం. అయితే అక్కడ మావైపే కొన్ని జాలిగా చూస్తూ ఉండిపోయాయి. అవే మర్కటాలు (కోతులు). ఉబుడ్‌ సమీపంలో వానర సంరక్షణ కేంద్రం ఉంది. సఫారీలో తిరిగి కోతి చేష్టలను చూడొచ్చు. అవి నా భార్య చేతిలో కెమెరా, కళ్లద్దాలు లాకెళ్లాయి. పండ్లు, తినుబండారాలు సమర్పించడంతో వదిలేశాయి.

  ఏనుగు గుహ

  ఏనుగు గుహ

  ఇర వానర సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఏనుగు గుహ ఉంది. లోనికి వెళ్లాక విశాలమైన ప్రాంగణం ఉంటుంది. కొలనులు, ఆలయాలు చూశాం. ఉబుడ్‌ నగర చుట్టుపక్కలున్న పల్లెల్ని కూడా చూశాం.

  బాలీలో అడుగుపెట్టిన మరుక్షణం నేను లక్షాధికారి నుంచి కోటీశ్వరుడిని అయిపోయాను.ఎందుకంటే మన ఒక్క రూపాయికి సుమారు 215 ఇండోనేషియన్‌ రూపియాలతో సమానం.

  రెండు కోట్లకు అధిపతి

  రెండు కోట్లకు అధిపతి

  ఒక లక్ష రూపాయలు తీసుకొని వెళ్తే.. రెండు కోట్లకు అధిపతి అయిపోతారన్నమాట. ఏటీఎంలో ఒకేసారి ఐదు లక్షలు తీసుకోవచ్చు. కరెన్సీ విలువకు తగ్గట్టే ఖర్చులూ ఉంటాయి. మంచి భోజనం తినాలంటే యాభై వేలు సమర్పించాలి. గాబరా పడిపోకండి.. మన కరెన్సీలో లెక్కేసుకుంటే సుమారు రూ.220 అన్నమాట.

  సముద్ర గర్భంలో

  సముద్ర గర్భంలో

  బాలి రాజధాని డెన్పసార్‌, ఉబుడ్‌ నగరాల్లో మేము మూడు రోజులు స్టే చేశాం. అక్కడ ఖరీదైన రిసార్ట్స్‌ చాలానే ఉన్నాయి. కుటా, లెగియాన్‌, సెమిన్యక్‌, నూసాదువా, సానుర్‌ బీచ్‌లకు వెళ్లాం. ఇక

  సముద్ర తీరాల్లో స్కూబాడైవింగ్‌, సర్ఫింగ్‌, వాటర్‌ స్కీయింగ్‌, పారా సెయిలింగ్‌, బనానా రైడ్‌ వంటి సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్ చేశాం. ఇక సముద్ర గర్భంలో రయ్‌ మంటూ దూసుకుపోయే బైకులపై కూడా నేను, నా భార్య ప్రయాణించాం. అది చాలా రోమాంచితంగా ఉంటుంది.మేము అక్కడ కూడా రొమాన్స్ చేశాం.

  ఆ డ్రెస్ లో చూసి

  ఆ డ్రెస్ లో చూసి

  తర్వాత బీచ్ దగ్గరే ఒక రూమ్ రెంట్ కు తీసుకుని స్టే చేశాం.

  ఇక బీచ్ అందాలను చూస్తూ నా భార్య నేను మైమరిచిపోయాం.

  మరి ఇంత దూరం వచ్చాం కదా నేను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని ఒక జ్ఞాపకాన్ని ఇవ్వమని నా భార్యను అడిగాను. తను వెంటనే మోడ్రన్ డ్రెస్ లో నా ముందు నిల్చొంది. తను ఎప్పుడూ చీరే ధరించేది. ఆ రోజు తనని ఆ డ్రెస్ లో చూసి నన్ను నేను మరిచిపోయాను.

  తనువులను పెనవేసుకుని

  తనువులను పెనవేసుకుని

  బాలీలో జాలీగా గడుపుతా వారం రోజులుగా మా ఇద్దరి మధ్య ఆ విషయంలో గ్యాప్ వచ్చింది. ఇక దాన్ని మొత్తాన్ని ఆ రోజు ఫుల్ చేశాం. ఇద్దరం ఒక రోజంతా అందులో పాల్గొనడానికే సమయం కేటాయించాం. సముద్రపు కెరటాలను చూస్తూ మాలో దాగున్న కోర్కెలను మొత్తం తీర్చుకున్నాం. ఇద్దరం తనువులను పెనవేసుకుని తనివితీరా రసక్రీడలో తేలిపోయాం.

  ఊయల్లో మేము ఉగాం

  ఊయల్లో మేము ఉగాం

  తర్వాత మేము బాలిలోని ‘ఉబుద్‌' ప్రాంతానికి వెళ్లాం. ఇది ఊయలలకు ప్రసిద్ధి. ట్రెక్కింగ్‌, సీతాకోక చిలుకల ఉద్యావనవనానికి సమీపంలో ఉన్న ఉబుద్‌లో నాలుగు చోట్ల నాలుగు వేర్వేరు ఎత్తుల్లో ఉన్న ఊయల్లో మేము ఉగాం. 20మీటర్ల ఎత్తులో గాలిలో ఊగుతూ సముద్రాన్ని, ఆకాశాన్ని, అడవిని చూడటం ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

  వీసాతో పని లేదు

  వీసాతో పని లేదు

  హైదరాబాద్‌ నుంచి బాలి రాజధాని డెన్పసార్‌కు సింగిల్‌ స్టాప్‌ (కౌలాలంపూర్‌) విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధర 11 నుంచి 18 వేల వరకు ఉంటుంది.

  ఇక బాలి పర్యటన కోసం లక్షల్లో వెచ్చించాల్సిన పనిలేదు.

  ఇక బాలి వెళ్లాలంటే వీసాతో పని లేదు. డెన్పసార్‌లో దిగాక అనుమతి తీసుకోవచ్చు. అయితే పాస్‌పోర్ట్‌ గడువు కనీసం ఆరు నెలలు ఉండాలి. 30 నుంచి 60 రోజుల వరకు ఉండొచ్చు. హోటల్‌ బుకింగ్‌ వివరాలు, తిరుగు ప్రయాణం టికెట్లు చూపించాల్సి ఉంటుంది.

  రెండు నెలలూ మినహాయిస్తే

  రెండు నెలలూ మినహాయిస్తే

  ఏప్రిల్‌, మే, జూన్‌ బాలి పర్యటనకు అనుకూలం. డిసెంబర్‌, జనవరి నెలల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండటంతో రిసార్ట్‌ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ రెండు నెలలూ మినహాయిస్తే ఎప్పుడైనా సరే బాలి వెళ్లిరండి. జీవితాంతం గుర్తుంటుంది.

  English summary

  my first time experience in bali

  my first time experience in bali
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more