ప్రేమించడం అంటే... రాత్రి పూట భార్యతో యాంత్రికంగా గడపడం కాదు - #mystory136

Written By:
Subscribe to Boldsky

నా పేరు వినీత. నాకు పెళ్లి అయి ఐదేళ్లు అవుతుంది. మాకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు నేను ఎన్నో ఊహించుకున్నాను. ఆదివారం వస్తే నా భర్త నన్ను పార్కుకు తీసుకెళ్లి ప్రశాంతంగా నాతో పది నిమిషాలు గడిపితే చాలు అనుకునేదాన్ని.

మురిసిపోయేదాన్ని

మురిసిపోయేదాన్ని

మా ఆయన ఆఫీసు నుంచి వస్తూవస్తూ ఒక మూరెడు మల్లెపూలు తీసుకొస్తే చాలు అని మురిసిపోయేదాన్ని. సంక్రాంతి సెలవులకు మా ఊరు వెళ్లినప్పుడు నా భర్తతో పొలం గట్లపై పిచ్చిపిచ్చిగా తిరుగుతూ పాటలు పాటలు పాడుకోవాలని ఉండేది.

వేసవిలో డాబాపై

వేసవిలో డాబాపై

వేసవిలో డాబాపై మేమిద్దరం నిద్రను మరిచి కబుర్లు చెప్పుకోవాలని ఉండేది. వర్షాకాలంలో మా ఆయనకు ఇష్టమైన బజ్జీలు వేసిచ్చి ఆయనతో పొగిడించుకోవాలని ఉండేది. ఆయన పక్కనే కూర్చొని టీవీలో మా పెళ్లి వీడియో చూడాలని ఉండేది.

జ్ఞాపకాలన్నింటినీ తనతో చెప్పుకుని

జ్ఞాపకాలన్నింటినీ తనతో చెప్పుకుని

మా ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లికి గ్యాప్ వచ్చిన సమయంలో మేము ఊసులాడుకున్న మాటలన్నింటినీ ఆయనతో కలసి గుర్తుకు తెచ్చుకోవాలని ఉండేది. మా ఆయనతో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ తనతో చెప్పుకుని ఆనందించాలని ఉండేది.

పట్టించుకునేంత తీరిక ఉండదు

పట్టించుకునేంత తీరిక ఉండదు

కానీ మా ఆయనకు సంపాదన, ఆఫీసు తప్ప మరే పని లేకుండా బిజీగా ఉన్నాడు. పెళ్లాన్ని పట్టించుకునేంత తీరిక.. సమయం మా ఆయనకు లేదు. మా ఆయన నన్ను ప్రతి విషయంలో సపోర్టు చేస్తాడు. కానీ నా ఆనందాన్ని పట్టించుకోవడంలేదని బాధగా ఉంది. మా ఆయనే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రతి మగాడు పెళ్లి అయ్యాక ప్రతి క్షణం తీరిక లేకుండా ఉన్నట్లు వ్యవహరిస్తాడు.

పెళ్లాం పడే బాధలు తెలియవు

పెళ్లాం పడే బాధలు తెలియవు

పెళ్లికి ముందు ఎంతో ప్రేమ ఒలకబోసే ప్రతి మగాడికి పెళ్లి అయిన తర్వాత పెళ్లాం పడే బాధలు తెలియవు. యాంత్రికంగా రోజూ రాత్రి పెళ్లాంతో గడిపే క్షణాలను మాత్రమే ప్రేమ కిందకు లెక్కేసుకునే మగవారు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

సరదాలు తీర్చితే చాలు

సరదాలు తీర్చితే చాలు

"చిన్నిచిన్ని సరదాలు తీర్చితే చాలు. పండుగలప్పుడు అయినా తనతో పది నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు. కాస్త పని లేనప్పుడు పది మైళ్లు బైక్ పై షికారుకు తీసుకెస్తే చాలు. ఇలాంటి కోరికలన్నీ భర్త తీరుస్తాడనే ఆశతో అమాయకంగా ఎదురు చూసే ఆడవారు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. "

తెగ పోజు కొడుతుంటాడు

తెగ పోజు కొడుతుంటాడు

నా భర్త మాత్రం ప్రపంచంలో ఉండే పని మొత్తం తానే చేస్తున్నట్లు తెగ పోజు కొడుతుంటాడు ఇంట్లో. ఒక్క క్షణం భార్య కోసం కేటాయిస్తే ఈ ప్రపంచం మొత్తానికి ఏమైపోతుందో అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఒక్క రోజు ఆఫీసుకు సెలవు పెడితే ఆఫీసు మొత్తం మూతపడిపోతుందేమో అన్నట్లుగా ఆలోచిస్తాడు.

ప్రతి క్షణం బాధపడుతుంటాను

ప్రతి క్షణం బాధపడుతుంటాను

పెళ్లికి ముందు రోజూ పది గంటలు నాతో ఫోన్లో మాట్లాడే మా ఆయన పెళ్లి అయ్యాక ఇలా మారడంతో ప్రతి క్షణం బాధపడుతుంటాను. ఎమోషనల్ గా కూడా నాతో ఎలాంటి అటాచ్ లేకుండా బతుకున్నాడు మా ఆయన. నేనే కాదు.. భర్త ప్రేమను కోరుకునే ప్రతి స్త్రీ ఇలాగే భర్త నుంచి ప్రేమను కోరుకుంటుందని నా అభిప్రాయం.

English summary

my husband doesn't support me emotionally

my husband doesn't support me emotionally
Story first published: Tuesday, April 3, 2018, 11:59 [IST]