నాకు మూడ్ వచ్చినప్పుడు కాదు.. మా ఆయనకు టైమ్ దొరికితేనే సెక్స్ చేస్తాడు

Written By:
Subscribe to Boldsky

నా భర్తను నేను ఎంతో కోరుకుని మరీ పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో నాకు చాల సంబంధాలు చూశారు. కానీ నా చిన్ననాటి స్నేహితుడు రామ్ ని నేను ప్రేమించి మా ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను.

అప్పుడు నేను ఏది చెబితే అదే వేదం

అప్పుడు నేను ఏది చెబితే అదే వేదం

పెళ్లి అయిన కొత్తలో మా ఆయన నాతో చాలా బాగుండేవాడు. నేను ఏం చెప్పినా కూడా ఎదురు చెప్పేవాడు కాదు. అప్పుడు నేను ఏది చెబితే అదే వేదం. ఎన్ని పనులున్నా సరే నాకోసం అడ్జెస్ట్ చేసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మా ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

అలిసిపోయి పడుకుంటాడు

అలిసిపోయి పడుకుంటాడు

నేను ఏవేవో ఊహించుకుంటూ రాత్రి ఆయన కోసం ఎదురుచూస్తుంటాను. నా భర్త ఆఫీసు నుంచి ఒక్కోసారి పది గంటలకు వస్తాడు. వచ్చీరాగానే అలిసిపోయి పడుకుంటాడు. ఇక సెలవు రోజుల్లో కూడా అస్సలు ఇంటి దగ్గర ఉండడు.

మూడ్ వచ్చినప్పుడు కాకుండా

మూడ్ వచ్చినప్పుడు కాకుండా

మా ఆయనతో సరదాగా గడుపుదామంటే అస్సలు కుదరడం లేదు. నాకు మూడ్ వచ్చినప్పుడు కాకుండా మా ఆయనకు టైం దొరికితేనే సెక్స్ అన్న పరిస్థితి వచ్చింది. దీంతో మా మధ్య దూరం పెరుగుతోంది.

శృంగారమే పెంచగలదు

శృంగారమే పెంచగలదు

నాకు తెలిసినంత వరకు మన జీవితానికి డబ్బు ఎంత అవసరమో... సెక్స్ కూడా అంతే ముఖ్యం. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధాన్నిశృంగారమే పెంచగలదు. అలాంటి సెక్స్ ను మనం బిజీ అనే సాకుతో నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు. దీని వల్ల దాంపత్య జీవితం మరింత బలహీనం అవుతుంది.

మనస్సు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం

మనస్సు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం

నేను మా ఆయన ఇద్దరం ఉద్యోగం చేస్తాం. దీంతో మాకు అస్సలు టైమ్ దొరకదు. కానీ దొరికిని సమయాన్ని కూడా శృంగార జీవితానికి సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కనీసం మేమిద్దరం మనస్సు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం. ఇద్దరం కలిసి భోజనం చేయడం లేదు. రాత్రి భోజనం కబుర్లు చెప్పుకోవడం లేదు. ఇలా ప్రతి విషయంలో ఇద్దరం వేర్వేరుగానే ఉంటున్నాం.

శృంగార సాగరంలో తేలిపోవాలని

శృంగార సాగరంలో తేలిపోవాలని

జనాలంతా చూడడానికి ఇద్దరం కలిసి కాపురం చేస్తున్నాం. కానీ ఇద్దరి మనస్సులు రోజురోజుకు ఎంతో దూరం అవుతున్నాయి.

మా ఇద్దరికీ సెలవు దొరికినపుడు ఒక్క క్షణం కూడా మా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఎంచక్కా పడకగదిలో ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. అన్ని టెన్సన్స్ ను, ఆఫీసు గొడవలను పక్కన పెట్టేసి శృంగార సాగరంలో తేలిపోవాలనిపిస్తుంటుంది.

బిజినెస్ పార్ట్‌నర్స్‌ కాదు కదా

బిజినెస్ పార్ట్‌నర్స్‌ కాదు కదా

మా ఇద్దరికీ సంపాదన బాగానే ఉంది. కానీ నా భర్తతో నేను సుఖంగా లేనప్పుడు ఎంత సంపాదన ఉన్నా వ్యర్థమే కదా. అయినా మేమిద్దరం భార్యాభర్తలం కానీ బిజినెస్ పార్ట్‌నర్స్‌ కాదు కదా. కానీ మా ఆయనకు ఆ ఆలోచన కొద్దిగా కూడా లేదు.

సంపాదన మోజులో పడి

సంపాదన మోజులో పడి

భార్యాభర్తల మధ్య పడకగదిలో పెరిగే దూరం మా ఇద్దరి మధ్య సంబంధాన్ని దెబ్బ తీస్తోంది. చివరకు మా సంసారం విచ్ఛిన్నమయ్యే అవకాశముంది అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. చాలా మంది భార్యాభర్తలు సంపాదన మోజులో పడి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారనేది నా అభిప్రాయం.

దాంపత్య జీవితం పదిలంగా ఉండాలి

దాంపత్య జీవితం పదిలంగా ఉండాలి

సంపాదనతో పాటు సంసారంపై కూడా ప్రతి భార్యాభర్త కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శృంగార జీవితాన్ని కాపాడుకోవడంతో పాటు దాంపత్య జీవితం పదిలంగా ఉండాలంటే కచ్చితంగా భార్యాభర్తలిద్దరూ బిజినెస్ట్ పార్టనర్స్ మాదిరిగా కాకుండా లైఫ్ పార్ట్‌నర్స్‌గా ఉండాలనేది నా అభిప్రాయం.

నా భర్తను నా దారిలోకి తెచ్చుకున్నాను

నా భర్తను నా దారిలోకి తెచ్చుకున్నాను

సమయం దొరికినప్పుడల్లా సరదాగా గడపాలి. సెక్స్ కు ఎట్టి పరిస్థితుల్లో దూరం కాకూడదు. ఏవేవో కారణాల వల్ల సెక్స్ ను వాయిదా వేయడం సరికాదు అనేది నా అభిప్రాయం. ప్రస్తుతం అష్టకష్టాలు పడి నా భర్తను నా దారిలోకి తెచ్చుకున్నాను. ప్రతి భార్యాభర్త కూడా సంపాదన అనే ఉచ్చు నుంచి బయటకు వచ్చి సంసారాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.

English summary

my husband has lost interest in me

my husband has lost interest in me
Story first published: Thursday, April 12, 2018, 9:00 [IST]