Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
శోభనం రోజు నా వక్షోజాలను చూసి నా భర్త ఆశ్చర్యపోయాడు, స్త్రీల స్తనాల రకాల గురించి మగాళ్లకేం తెలుసు
పెళ్లయితే అయ్యిందికానీ నా భర్తను సుఖపెట్టగలనా లేదా అనే బెంగ ఎక్కువగా ఉండేది. వక్షోజాలు బాగా ఎత్తుగా ఉంటేనే అబ్బాయిలకు ఇష్టమని నా స్నేహితురాళ్లు చెప్పేవారు. వాళ్లు చెప్పిందే నిజమేనని నాకు నా శోభనం..
నాకు యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి నా బాడీ విషయంలో చాలా భయాలుండేవి. నాతోటి వారందరికీ స్తనాలు బాగా లావుగా కనిపించేవి. నాకు మాత్రం చాలా చిన్నవిగా ఉండేవి. దీంతో లోలోపలే కుమిలిపోయేదాన్ని. స్కూల్ లో, కాలేజీలో నేను ఏ అబ్బాయికి నచ్చేదాన్ని కాదు. నా స్నేహితురాళ్లకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేసేవారు. కానీ నాకు మాత్రం ఎవరూ ప్రపోజ్ చేసేవారు కాదు.
నా చదువు పూర్తయ్యాక నాకు చాలా మ్యాచెస్ వచ్చాయి. అయితే చాలా మంది అబ్బాయిలు నన్ను రిజెక్ట్ చేశారు. నా బ్రెస్ట్ అందంగా లేకపోవడం వల్లే చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారని అనిపించింది. చివరకు ఒక అబ్బాయి నన్ను ఒకే చేశాడు. అతన్నే పెళ్లి చేసుకున్నాను.

నా భర్తను సుఖపెట్టగలనా
పెళ్లయితే అయ్యిందికానీ నా భర్తను సుఖపెట్టగలనా లేదా అనే బెంగ ఎక్కువగా ఉండేది. వక్షోజాలు బాగా ఎత్తుగా ఉంటేనే అబ్బాయిలకు ఇష్టమని నా స్నేహితురాళ్లు చెప్పేవారు. వాళ్లు చెప్పిందే నిజమేనని నాకు నా శోభనం రోజు తెలిసింది. మా ఆయన నా వక్షోజాలను చూడగానే ఏంటీ ఇంత చిన్నవిగా ఉన్నాయంటూ ఆశ్చర్యపోయాడు.

వక్షోజాలు లావు అయ్యేలా..
మా ఆయన ఆ మాట అనేసరికి నాకు ఏడుపొచ్చింది. ఎలా అయినా సరే నా వక్షోజాలను లావు అయ్యేలా చేసుకోవాలనుకున్నాను. అందుకోసం చాలా రకాల వ్యాయామాలు చేశాను. చాలా రకాల ఆహారాలు తిన్నాను. అయినా ఫలితం లేదు. డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు.

పర్ఫెక్ట్ స్తనాలు ఉండాలని రూల్ ఏమైనా ఉందా
ఇక నా బాధ గురించి నాకు తెలిసిన ఒక మహిళ డాక్టర్ కు వివరించాను. అయితే ఆమె కొన్ని విషయాలు చెప్పారు. ప్రతి అమ్మాయికి పర్ఫెక్ట్ స్తనాలు ఉండాలని రూల్ ఏమైనా ఉందా? కొందరు అమ్మాయిలకు ఎద సంపద బాగా ఉండొచ్చు. దానికి వంద కారణాలుంటాయి. వాళ్లు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి కేవలం వాటి అందం గురించే ఆలోచిస్తూ వర్క్ అవుట్స్ చేస్తూ, మంచి పౌష్టికాహారం తింటూ ఉంటారు.

ఫ్యాట్ టిష్ ఎక్కువగా
వాటిని కూడా శరీరంలోని ఒక అవయంగా భావించే అమ్మాయిలు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కొందరు అమ్మాయిలకు ఫ్యాట్ టిష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి వక్షోజాలు లావుగా ఉంటాయి. కొందరిలో అది తక్కువగా ఉండడం వల్ల బాగా చిన్నగా ఉంటాయి.

జారినట్లుగా ఉంటాయి
కొందరు అమ్మాయిల స్తనాలు గుండ్రంగా ఉంటాయి. మరికొందరు అమ్మాయిలవి జారినట్లుగా ఉంటాయి. ఇంకొందరు అమ్మాయిల స్తనాలు చనుమొనలు ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి.

చను మొనల భాగం
ఇంకొందరి అమ్మాయిలవి చను మొనల భాగం బాగా ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మరికొందరివి సమాంతరంగా కనిపిస్తాయి. ఇక కొందరు అమ్మాయిలకు రెండు స్తనాలు, రెండు వక్షోజాల చను మొనలు ఒకే పరిమాణంలో కూడా ఉండవు. ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియవు. ఇవన్నీ జెన్యూపరంగా వచ్చే సమస్యలు.

అందమైన బ్రెస్ట్ చూసి
పెద్దపెద్ద సెలబ్రెటీలు కూడా స్తనాలకు సంబంధించిన సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. దాని గురించి నువ్వేమీ ఆందోళన చెందకు అంటూ ఆ డాక్టర్ నాకు భరోసానిచ్చింది. భర్తలందరికీ నేను చెప్పేదే ఒక్కటే మీరు ఎక్కడో వీడియోలో ఒక అమ్మాయి అందమైన బ్రెస్ట్ చూసి, సేమ్ అలాగే నీ భార్యకు కూడా ఉండాలనుకోవడం పొరపాటు.

అవమానపరచకండి
నా భర్తలా మీరు కూడా ఎద సంపద బాగోలేదని మీ భార్యను అవమానపరచకండి. అలా అంటే ఏ అమ్మాయి కూడా తట్టుకోలేదు. ఆ సమస్యను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతుంది. వక్షోజాలు చిన్నగా ఉండడానికి వంద కారణాలుంటాయని అర్థం చేసుకోండి.

స్తనాల ఆకృతులను చూసి..
భార్య మనస్సును చూడాలిగానీ స్తనాల ఆకృతులను చూసి ఇష్టపడకూడదు. అందరు అబ్బాయిలు అలాగే ఉంటారని నేను అనడం లేదు. అమ్మాయిల స్తనాలు పెద్దగా లేకున్నా కొందరు అబ్బాయిలు వారిపై ప్రేమ చూపిస్తుంటారు. ప్రతి అబ్బాయి తన మంచి వ్యక్తిత్వంతో అమ్మాయి మనస్సులో చోటు సంపాదించుకోవాలిగానీ ఆమెను ఎగతాళి చేసి ఆ స్థానాన్ని దిగజార్చుకోకూడదని నేను భావిస్తున్నాను.



Click it and Unblock the Notifications