Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మా ఆయన ఒక్కో వారం ఒక్కో జిల్లాకు వెళ్లేవాడు, పోయిన ప్రతి చోట ఒక అమ్మాయితో సంబంధం #mystory364
మా విచారణలో మీ ఆయనకు మొత్తం పదకొండు మంది అమ్మాయిలతో మీ ఆయనకు అక్రమసంబంధాలున్నట్లు తెలిసింది అని పోలీసులు నాకు అన్ని విషయాలు పూస గుచ్చినట్లుగా చెప్పారు. అవన్నీ విన్న తర్వాత నేను దేవుడిలా భావించే..
మా ఆయన మార్కెటింగ్ జాబ్ చేస్తారు. నా పెళ్లి చూపులప్పుడు ఆయన్ని చూడగానే ప్లాట్ అయిపోయాను. ఆరడుగుల హైట్.. చాలా అందగాడు. అతన్ని చూడగానే మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోకున్నా కూడా నేను ఒకే చెయ్యాలనుకున్నాను.
ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే ఆయన కట్నం ఎక్కువ అడిగినా కూడా మా నాన్నకు నచ్చజెప్పి పెళ్లి ఫిక్స్ చేసేలా చేశాను.

మంచి భర్త అని పొంగిపోయేదాన్ని
మా బంధువులందరూ వినుజకు మంచి భర్త దొరికాడని అన్నారు. మన ఇళ్లలో అందరికంటే అందమైన అల్లుడు వినుజ భర్తనే అని అందరూ మాట్లాడుకునేవారు. దాంతో నేను కూడా పొంగిపోయేదాన్ని. అంత అందమైన వాడు నాకు భర్తగా రావడం నిజంగా నా లక్.

బుల్లెట్ బైక్ ఎక్కించుకుని వస్తుంటే..
ఆయన్ని చూసి నేను భలే మురిసిపోయేదాన్ని. సినిమా హీరోలా ఉంటాడు. మా ఊరికి తన బుల్లెట్ బైక్ నన్ను ఎక్కించుకుని వస్తుంటే నా ఆనందానికి అవధులుండేవి కావు. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు.

బేబీ, బంగారం, మమ్మీ..
నన్ను ఎన్ని ముద్దు పేర్లతో పిలిచేవాడో.. బేబీ, మమ్మీ, బంగారం, డార్లింగ్ ఇలా ప్రతి క్షణం నన్నే తలుచుకునేవాడు. ఎకానామికల్ గా కూడా మాకు ఎప్పుడూ ప్రాబ్లమ్ రాలేదు. నేను ఏం కోరితే అవి చిటెకెలో తీసుకొచ్చేవాడు.

కుల్లుకునేవారు
అందరూ మమ్మల్ని చూసి కుల్లుకునేవారు. మేము చిలుకాగోరింకల్లా ఉండేవాళ్లం. అలాంటి మా ఆయన సడెన్ గా చేంజ్ అయిపోయారు. నాపై ఆయనకు ఉన్న ప్రేమ మొత్తం తగ్గిపోయింది. నన్ను అస్సలు పట్టించుకోకుండా తయారయ్యాడు.

వారాల తరబడి
ఆఫీస్ పని మీద ఆయన క్యాంప్స్ కు వెళ్లేవాడు. వారాల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. ఆఫీస్ లో వర్క్ ప్రెజర్ బాగా ఉందని బాధపడేవాడు.

ఇంతకన్నా మంచి ఫీల్డ్ ఇంకొకటి ఉండదే
మరి ఎందుకండి అంత ఇబ్బందపడుతూ జాబ్ చెయ్యడం అంటే.. ఇంతకన్నా మంచి ఫీల్డ్ ఇంకొకటి ఉండదే. బయట అసలు జాబ్స్ లేవు. ఉన్నా ఇంత ఇన్ కమ్ రాదు. టార్చర్ ఉంటుది. అందుకే కష్టమైనా సరే నేను ఈ జాబే చేస్తానని అనేవాడు.

ఒక్కోవారం ఒక్కో జిల్లాలో
పాపం వర్క్ ప్రెజర్ వల్ల మా ఆయన ఇబ్బందులుపడుతున్నాడని నేను కూడా ఏమీ అనేదాన్ని కాదు. ఆయన వారానొకసారి ఇంటికొచ్చేవాడు. మళ్లీ క్యాంప్ ఉందని వెళ్లేవాడు. ఒక్కోవారం ఒక్కో జిల్లాలో ఉండేవాడు.

తన ఫ్రెండ్ తో ఫోన్ చేయించాడు
ఒకసారి దాదాపు నెలరోజులు అయినా మా ఆయన రాలేదు. తాను ఆఫీస్ వర్క్ లో బిజిగా ఉన్నానని, కొన్ని రోజుల వరకు ఇంటికి రాలేనని తన ఫ్రెండ్ తో ఫోన్ చేయించాడు. తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా ఆయన మొబైల్ స్విచ్ఛాప్ వచ్చింది.

పోలీస్ స్టేషన్ కు వెళ్లాను
కొన్ని రోజుల తర్వాత నాకో విషయం తెలిసింది. మా ఆయన పక్క జిల్లాలో జైల్ లో ఉన్నాడని వేరే వాళ్లు చెప్పారు. నేను వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. పోలీసులను అడిగితే అసలు విషయం చెప్పారు. మీ ఆయన చేసిన ఘనకార్యాలు చాలనే ఉన్నాయి.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి
ఆయనకు పెళ్లి అయ్యిందని చెప్పుకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్ని రకాలుగా తనను వాడుకున్నాడని చెప్పి మొదట ఒక అమ్మాయి కంప్లైట్ చేసింది. తర్వాత మరో ఇద్దరమ్మాయిలు ఫిర్యాదు చేశారు.




Click it and Unblock the Notifications
