శోభనం రోజు బ్లడ్ రాకపోతే పెళ్లికి ముందు వేరే వ్యక్తులతో సెక్స్ లో పాల్గొన్నట్లేనా? - #mystory153

Written By:
Subscribe to Boldsky

నా భర్తతో నాకు పెళ్లి అయినప్పటి నుంచి రోజూ ఆయన నుంచి ఏదో ఒక విషయంలో ఇబ్బందులుపడుతున్నాను. నా భర్త మొదటి రాత్రి నాతో సెక్స్ చేశాక నాపై అనుమానం పడడం మొదలుపెట్టాడు. నీకు గతంలో ఎవరితోనైనా సెక్స్ అనుభవం ఉందా అని అడిగాడు. లేదు అని చెప్పాను. కానీ ఆయన నమ్మలేదు. మా ఆయన ఫ్రెండ్స్ ఆయనకే ఏవేవో విషయాలు చెప్పారంట.

కచ్చితంగా బ్లడ్ రావాలి

కచ్చితంగా బ్లడ్ రావాలి

" ఫస్ట్ నైట్ రోజు సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా బ్లడ్ రావాలి. అలా రాకుంటే కచ్చితంగా నీ భార్యకు ఎవరితోనైనా సంబంధం ఉండి ఉంటుందని అని చెప్పారంట. " దీంతో నాపై నా భర్త డౌట్ పడేవాడు. ఆయనకు వివరించాలంటే నాకు కూడా ఆ విషయాలపై అవగాహన ఉండేది కాదు.

మరొకరి కింద నలిగి వచ్చిందా

మరొకరి కింద నలిగి వచ్చిందా

నా స్నేహితురాలికి నా సమస్య మొత్తం వివరించాను. ఆమె ఈ విధంగా చెప్పింది.. ఆమె మంచి నాలెడ్జ్ ఉండడంతో ఆమె నాకు అన్ని వివవాలు వివరించింది. సాధారణంగా ఒక యువతిని ఒక యువకుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ యువతి తన వద్దకు కన్నెత్వంతో వచ్చిందా.. లేక మరొకరి కింద నలిగి వచ్చిందా అనే సందేహం ప్రతి యువకుడిలో కలుగుతుందని నా స్నేహితురాలు చెప్పింది.

సెక్స్ లో పాల్గొనలేదని అర్థం

సెక్స్ లో పాల్గొనలేదని అర్థం

ఆమెకు కన్నెపొర ఉంటే గతంలో ఎవరితోనూ సెక్స్ లో పాల్గొనలేదని అర్థం అని మగాళ్లు అనుకుంటారట. లేదంటే కచ్చితంగా గతంలో ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొని ఉంటుందని అబ్బాయిలు అనుమానపడుతారట.

స్తనాలను పరిశీలిస్తారట

స్తనాలను పరిశీలిస్తారట

ఇక మొట్టమొదటిసారి అంగ ప్రవేశం చేస్తే కన్నెపొర ఉంటే కొద్దిపాటి రక్తం చిమ్ముతుందని భర్తల అభిప్రాయం అట. ఇక కొందరు కన్యత్వానికి చిహ్నంగా స్తనాలను పరిశీలిస్తారట. స్తనాలు గుండ్రంగా ఉండి గట్టిగా ఉన్నట్లయితే ఆ యువతి కన్నెత్వం కోల్పేదని భావిస్తారట.

లేనిపోని సందేహాలు

లేనిపోని సందేహాలు

ఇలా చాలా మంది యువకులకు తమ భార్యల కన్నెత్వంపై లేనిపోని సందేహాలు కలిగి ఉంటారట. ముఖ్యంగా శోభనం రోజు రాత్రి అంగ ప్రవేశం జరిగిన తర్వాత యోనిలోని రక్తం వచ్చినట్టయితే తన భార్య కన్నె అని భావిస్తారట. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా తన భార్యకు పెళ్లికి ముందే ఇతరులతో సెక్స్ సంబంధం ఉండివుంటుందని భావిస్తుంటారట.

కన్నెపొర కూడా చిట్లిపోతుంది

కన్నెపొర కూడా చిట్లిపోతుంది

అయితే, నేటి ఆధునిక కాలంలో యువతులు వివిధ రకాల శారీరక వ్యాయామాలు చేస్తుంటారు. అలా చేసే వారిలో కన్నెపొర కూడా చిట్లిపోతుంది. ఇక క్రీడాకారిణి అయితే కన్నెపొర నిలబడి వుండే అవకాశాలు అస్సలు ఉండవు. సాధారణంగా క్రీడాకారిణులకు కన్నపొర వుండదు. వారు కాళ్ళను, శరీరాన్ని వివిధ రకాలుగా సాగతీస్తారు. దీంతో కన్నెపొర ఎప్పుడో చినిగిపోతుంది.

కన్నెపొర చీలిపోవాలన్న నియయం లేదు

కన్నెపొర చీలిపోవాలన్న నియయం లేదు

ప్రతి అమ్మాయికి శోభనం రోజునే కన్నెపొర చీలిపోవాలన్న నియమేమీ లేదు. అసలు అలా జరగడం చాలా తక్కువ. పెళ్లికి ముందు ఆ యువతికి సైకిల్ తొక్కే అలవాటు ఉన్నా.. క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటున్నా కన్నెపొర పోతుంది. అందువల్ల మొదటి రోజున రక్తం రావొచ్చు. రాకపోవచ్చు. సైకిల్ తొక్కే అలవాటు లేకున్నా ఏదో ఒక పని చేసేటప్పుడు కన్నెపొర పోవొచ్చు.

అనుమానించడం భావ్యం కాదు

అనుమానించడం భావ్యం కాదు

మొదటి కలయికలో రక్తస్రావం కానంత మాత్రాన, సైకిల్ తొక్కే అలవాటు లేనంత మాత్రాన కట్టుకున్న భార్యకు పెళ్లికి పూర్వమే సెక్స్ సంబంధాలు ఉన్నాయని అనుమానించడం భావ్యం కాదు. భార్యాభర్తల వైవాహిక బంధం ఆనందంగా ఉండాలంటే ఒకరిపై ఒకరు పరస్పర నమ్మకం చాలా అవసరం.

తెలిసీ తెలియని జ్ఞానం వల్ల

తెలిసీ తెలియని జ్ఞానం వల్ల

మొదటి రోజు కలయికలోనే ప్రతి స్త్రీకి కన్నెపొర పోయి రక్తస్రావం అవ్వాలన్న నియమేమీ లేదు. ఎవరో కొంతమంది యువకులు తెలిసీ తెలియని జ్ఞానం వల్ల మాట్లాడే మాటలను ప్రామాణికంగా తీసుకుంటే సంసారాలు ఎక్కువ కాలం నిలవవు.

చాలా విషయాల్లో డౌట్

చాలా విషయాల్లో డౌట్

నేను ఈ విషయాలన్నీ మా ఆయనకు వివరించాను. నా భర్త ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో డౌట్ పడేవాడు. వాటన్నింటినీ నేను రోజు క్లారిఫై చేస్తున్నాను. కొంతమంది సెక్సాలజిస్ట్ ల దగ్గరకు ఆయన్ని తీసుకెళ్లి విషయాలను వివరింపజేశాను.

చాలా బాగా చూసుకుంటున్నాడు

చాలా బాగా చూసుకుంటున్నాడు

ఇప్పుడు నా భర్త వైఖరి మారింది. ఇప్పుడు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ప్రతి భర్త కచ్చితంగా భార్యపై ఏదో విషయంలో అనుమానపడుతుంటాడు. భర్త అనుమానాల్ని పటాపంచలు చేస్తేనే భార్యపై అతనికి నమ్మకం కలుగుతుంది. అలాగే ఇలాంటి చెత్త అనుమానాలను భర్తలు మాని హ్యాపీగా భార్యను చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను.

English summary

my husband is doubting me at every step of life

my husband is doubting me at every step of life