పెళ్లి కాక ముందే నా స్నేహితురాళ్లకి సెక్స్ అనుభవాలున్నాయి.. నేను అలా సంతృప్తి చెందుతాను- #mystory157

Written By:
Subscribe to Boldsky

పెళ్లి కానీ అమ్మాయికి సెక్స్ కోరికలుంటాయి కానీ వాటిని తీర్చుకునే మార్గం లేక ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అలాగే మా సెక్స్ కోరికలను తీర్చమని వేధించే మగవారి బారి నుంచి తప్పించుకోవడానికి నానా రకాల పాట్లు పడాల్సి వస్తుంది. నా వయస్సు 32 ఏళ్లు. నాకు ఇంకా పెళ్లి కాలేదు.

ఆంటీ అని అంటూ ఉంటే

ఆంటీ అని అంటూ ఉంటే

నా తోటి అమ్మాయిలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. నా స్నేహితురాళ్ల పిల్లలు నన్ను ఆంటీ అని అంటూ ఉంటే నాకు ఏదో తెలియని బాధగా ఉంటుంది. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి కానీ నాకు కావడం లేదనే అనిపిస్తూ ఉంటుంది.

భర్తతో హనీమూన్ వెళ్లాలని

భర్తతో హనీమూన్ వెళ్లాలని

పెళ్లి చేసుకుని హ్యాపీగా నా భర్తతో హనీమూన్ వెళ్లాలని ఉంది. ప్రతి రోజూ రాత్రి నా భర్త ఆఫీసు నుంచి వచ్చే సమయానికల్లా అందంగా ముస్తాబై అతని కోరిక తీర్చాలని ఉంది. నేను రజస్వల అయినప్పటి నుంచి దాచుకున్న నా కన్నెత్వాన్ని మొత్తం నా భర్తకు ఎప్పుడెప్పుడు సమర్పిద్దామా అన్నట్లు ఉన్నాను.

నాలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే

నాలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే

మా కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడం నేను అంతగా అందంగా లేకపోవడంతోనే నాకు పెళ్లి జరగడం లేదు. కానీ నాకు కాబోయే భర్తకు నేను ఏ రోజు కూడా అన్యాయం చేయకూదని డిసైడ్ అయ్యాను. అయినా నాలాంటి అమ్మాయిని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురారు.

కట్నం విషయంలోనే

కట్నం విషయంలోనే

నమ్మించి మోసం చేసే అమ్మాయిలనే ఈ అబ్బాయిలు ఎక్కువగా నమ్ముతారు. అలాంటి వారికే విలువ ఇస్తారు. పేద అమ్మాయిలను చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నాకు తెలుసు. ఎందుకంటే నన్ను చూడడానికి వచ్చిన చాలా మంది అబ్బాయిలు కేవలం కట్నం విషయంలోనే వెనక్కి తగ్గారు.

క్యారెక్టర్ పై నిలబడుతారని చెప్పడం లేదు

క్యారెక్టర్ పై నిలబడుతారని చెప్పడం లేదు

ఒక అమ్మాయి ఇచ్చే డబ్బు ఎక్కువకాలం నిలవదని అబ్బాయిలు అర్థం చేసుకోవాలి. కట్నం పేరుతో అమ్మాయిలను మానసికి క్షోభకు గురి చేయకూడదనేది అబ్బాయిలకు నా మనవి. అయితే అందరూ అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారని నేను అనడం లేదు. అలాగే అందరూ అమ్మాయిలు నాలానే మంచిగా క్యారెక్టర్ పై నిలబడుతారని నేను చెప్పడం లేదు. కొందరు మాత్రమే అలా ఉంటారు.

వయస్సు మీదపడుతున్నా

వయస్సు మీదపడుతున్నా

నా భర్త కోసం ఇన్నాళ్లు నా కన్నెత్వాన్ని మొత్తం అలాగే దాచిపెట్టాను. నాలాగే చాలామంది యువతులకు తమ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల కారణంగా వివాహాలు ఆలస్యంగా జరుగుతుంటాయి. మరికొందరికి వివాహాలు జరగవు కూడా. నాలాగే చాలా మంది వయస్సు మీదపడుతున్నా కన్యగానే ఉంటారు.

సెక్స్ కోర్కెలు పెరుగుతుంటాయి

సెక్స్ కోర్కెలు పెరుగుతుంటాయి

నాలాగే వారందరికీ కూడా ఏజ్ పైబడే కొద్దీ సెక్స్ కోర్కెలు పెరుగుతుంటాయని నేను అనుకుంటున్నాను. కానీ, కుటుంబ కట్టుబాట్లు, తాము పెరిగిన పరిసరాలను దృష్టిలో ఉంచుకుని ఏ తప్పుదారి పట్టరు. అలా చెయ్యాలంటే జంకుతుంటారు.

స్వయంసంతృప్తి పద్దతులు

స్వయంసంతృప్తి పద్దతులు

చాలా మంది అమ్మాయిలు నాలాగే వివాహం కాలేదని లోలోపల మథన పడిపోతుంటారు. అలాగే తమలోని సెక్స్ కోర్కెలను అణుచుకుంటుంటారు. ఇక సెక్స్ కోరికలను కంట్రోల్ చేసుకోలేని వారు.. కట్టుబాట్లను అధికమించలేని వారు.. స్వయంసంతృప్తి పద్దతులను.. హస్త ప్రయోగాలను చేసుకుంటూ ఉంటారు.

కష్టాలు శాశ్వతంగా ఉండవు

కష్టాలు శాశ్వతంగా ఉండవు

అయితే కుటుంబంలో సమస్యలు ఉండటం సహజమే. ఆ కష్టాలు శాశ్వతంగా ఉండవని నాకూ అనిపిస్తూ ఉంటుంది. పెళ్లీడుకొచ్చిన ప్రతి యువతికి ఏదో ఒక రోజు వివాహం అవుతుందని నా నమ్మకం.

విశ్వసనీయతను పెంచుకోవాలి

విశ్వసనీయతను పెంచుకోవాలి

అలాగే వయస్సు మీదపడే కొద్ది కామవాంఛ పెరగడం సహజమే కదా. కానీ పెళ్లి కాలేదనే సాకుతో అడ్డదారులు తొక్కకూడదని నా అభిప్రాయం. విశ్వసనీయతను పెంచుకుని ముందుకు సాగిపోవాలనేది నా సలహా.

సెక్స్ కోరికలు తీర్చుకుంటూ ఉంటాను

సెక్స్ కోరికలు తీర్చుకుంటూ ఉంటాను

నేను అయితే ఇంత వరకు సెక్స్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. నాకు కాబోయే భర్తకే నేను అన్ని సమర్పిస్తాను. కేవలం స్వయంసంతృప్తి పద్దతి ద్వారానే నేను సెక్స్ కోరికలు తీర్చుకుంటూ ఉంటాను. ఇది అస్సలు తప్పు కాదు కదా.

పెళ్లికి ముందే సెక్స్ అనుభవం

పెళ్లికి ముందే సెక్స్ అనుభవం

నా స్నేహితురాళ్లు కొందరు పెళ్లికి ముందు సెక్స్ అనుభవం చూశారు. నా కళ్ల ముందే అబ్బాయిలతో గడిపి మళ్లీ మరొకర్ని పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారిని ఈ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ నాలాంటి వారిని అస్సలు చేసుకోరు.

ఒక్కసారైనా అనుభవించాలని

ఒక్కసారైనా అనుభవించాలని

పెళ్లి కానీ అమ్మాయి అంటే చాలామంది కళ్లు ఆమెపైనే పడతాయి. చాలా మంది పెళ్లి అయిన మగవారు కూడా పెళ్లి కానీ అమ్మాయిని ఒక్కసారైనా అనుభవించాలని అనుకుంటూ ఉంటారు. నా జీవితంలో కూడా ఇలా చాలా సంఘటనలు ఎదురయ్యారు. చాలా మంది నన్ను సెక్స్ ఆఫర్ అడిగారు.

ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట

ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట

నేను ఏ ఒక్కరికీ కూడా ఒకే చెప్పలేదు. నేను ఒకే చెప్పకపోవడంతో చాలా మంది నన్ను ఇన్ డైరెక్ట్ గా టార్చర్ కూడా చేశారు. ఇలా పెళ్లి కానీ అమ్మాయి కష్టాలు చాలానే ఉంటాయి. అందుకే పెద్దలు ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరగాలి అంటారు.

English summary

My Life Is Miserable Because All My Friends Are Married And I Still Haven't Found A Life Partner

My Life Is Miserable Because All My Friends Are Married And I Still Haven't Found A Life Partner