బస్సులో లైట్స్ ఆఫ్.. అమ్మాయిని కిస్ చేశా.. ఆమెతో గడిపిన క్షణాలు జీవితాంతం జ్ఞాపకాలు- #mystory118

Written By:
Subscribe to Boldsky

నా పేరు రాజు. నేను ఒక సివిల్ ఇంజినీర్ ను. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. రీసెంట్ గా ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో జాయినయ్యాను. అక్కడ నా టాలెంట్ ఏంటో చూపించాలనుకున్నాను. అందుకు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేయడం మొదలుపెట్టాను.

పనిలోనే నిమగ్నం

పనిలోనే నిమగ్నం

దాదాపు ఏడు నెలలుగా పనిలోనే నిమగ్నం అయ్యాను. అస్సలు తీరిక ఉండేది కాదు. ఒక్కోసారి మేము కన్ స్ట్రక్షన్ చేసే అపార్ట్ మెంట్ దగ్గర ఉండే స్టోర్ రూమ్ లోనే ఉండేవాణ్ని.

చాలా స్టైలిష్ గా ఉండేవాణ్ని

చాలా స్టైలిష్ గా ఉండేవాణ్ని

నన్ను నేను మరిచిపోయాను. బీటెక్ లో ఉన్నప్పుడు చాలా స్టైలిష్ గా ఉండేవాణ్ని. కానీ జాబ్ లో జాయినయ్యాక నా రూపు రేఖలు మారిపోయాయాయి.

జుట్టు, గడ్డం బాగా పెరిగిపోయాయి

జుట్టు, గడ్డం బాగా పెరిగిపోయాయి

నా జుట్టు, గడ్డం బాగా పెరిగిపోయాయి. అస్సలు నన్ను నా ఫ్రెండ్స్ చూస్తే కూడా గుర్తు పట్టలేనంతగా తయారయ్యాను. ఇక నా ఫ్రెండ్స్ మాత్రం ప్రేమ పేరుతో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లు.

లవ్ కు చాలా దూరం

లవ్ కు చాలా దూరం

నాకు బీటెక్ లో కూడా లవ్ స్టోరీ లేదు. లవ్ చేయాలంటే చాలా సమయం కేటాయించాలి. అందుకే నేను లవ్ కు చాలా దూరంగా ఉండేవాణ్ని.

చాలా టైమ్ వేస్ట్

చాలా టైమ్ వేస్ట్

నా కాలేజీ ఫ్రెండ్స్ గానీ, నేను జాబ్ చేసే చోట నాతో పాటు పని చేసే నా కోలీగ్స్‌ గానీ ప్రేమ విషయంలో చాలా టైమ్ వేస్ట్ చేసేవారు. అందుకే నాకు ప్రేమ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు.

టైమ్ వేస్ట్ చేస్తే చాలా ఇబ్బందులు

టైమ్ వేస్ట్ చేస్తే చాలా ఇబ్బందులు

ఒంటిరిగా ఉండడమే చాలా మేలు అనుకునేవాణ్ని. అలానే ఉండేవాణ్ని. నా లెక్క ప్రకారం ముందు జీవితంలో సెట్ కావాలి. తర్వాతే ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించాలి. అలాకాకుండా లవ్ కోసం టైమ్ వేస్ట్ చేస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందనేది నా అభిప్రాయం.

ఉగాదికి మా ఊరు వెళ్దామని

ఉగాదికి మా ఊరు వెళ్దామని

మొన్న ఉగాదికి మా ఊరు వరంగల్ వెళ్దామని బెంగళూరులో బస్టాండ్ కు వెళ్లాను. నేను వారం ముందుగానే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. ఒక అరగంట ముందే బస్టాండ్ కు వెళ్లాను.

ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామని

ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామని

బస్టాండ్ లోని బల్లపై కూర్చొన్నాను. చాలా రోజులుగా ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు. అందుకే ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామని ట్రై చేశాను. సెల్పీలో నాతో పాటు చాలా ముఖాలు క్యాప్చర్ అయ్యాయి. అందులో ఒక అందమైన అమ్మాయి ముఖం కూడా ఉంది.

ఇలాంటి అమ్మాయి ఒక్కరు చాలు

ఇలాంటి అమ్మాయి ఒక్కరు చాలు

వెనక్కి తిరిగి చూశాను. చూడగానే మతి పోయే అందం ఆమెది. పదుల సంఖ్యలో అమ్మాయిలను ఇష్టపడడం కంటే ఇలాంటి అమ్మాయి ఒక్కరు చాలు అనుకున్నాను. లక్ష్మీదేవతలా ఉన్న ఇలాంటి ఆమెనే నా భార్యగా వచ్చింటే బాగుండని మనస్సులో అనుకున్నాను.

అదే బస్ ఎక్కింది

అదే బస్ ఎక్కింది

అంతలో నేను ఎక్కాల్సిన బస్ వచ్చింది. నాతో పాటుగా తను కూడా హడావుడిగా బ్యాగ్ తో అదే బస్ ఎక్కింది. నేను చాలా రోజుల కిందే రైట్ సైడ్ విండో సీట్ బుక్ చేశాను. వాస్తవానికి ఒక అమ్మాయి సీట్ బుక్ చేసుకుంటే ఆమె పక్కనే మరో అబ్బాయి బుక్ చేసుకోవడానికి మన టీఎస్ ఆర్టీసీ అస్సలు అనుమతించదు.

అమ్మాయి బుక్ చేసుకోవొచ్చు

అమ్మాయి బుక్ చేసుకోవొచ్చు

అయితే అబ్బాయి బుక్ చేసుకున్న సీటు పక్కన మాత్రం అమ్మాయి బుక్ చేసుకోవొచ్చు. ఇప్పుడు కూడా అదే జరిగింది. నా సీటు పక్కనే ఆ పిల్ల కూడా సీటు బుక్ చేసుకుంది. తప్పదు మరి. పండుగ సీజన్. లేదంటే అది కూడా దొరకదు.

ముగ్గులోకి దింపాలనుకున్నా

ముగ్గులోకి దింపాలనుకున్నా

నేను వెళ్లి నా సీట్లో కూర్చొన్నాను. తను వచ్చి నా పక్కనే కూర్చొంది. ఎలాగైనా సరే అమ్మాయిని మాటల్లో దింపి ముగ్గులోకి దింపాలని అప్పుడే డిసైడ్ అయ్యాను.

విండో సీట్ లో కూర్చొనే ఛాన్స్

విండో సీట్ లో కూర్చొనే ఛాన్స్

ఇంతలో ఎక్స్‌క్యూజ్‌ మి అంది. చెప్పండి అన్నాను. విండో సీట్ లో కూర్చొనే ఛాన్స్ ఇస్తారా అంది. నాకు జర్నీలో అప్పుడప్పుడు కళ్లు తిరుగుతుంటాయి. వాంటింగ్ వస్తుందనే భయం అంది. కూర్చొండి అంటూ లేచి సీట్ ఇచ్చాను. ఏమనుకోకండి.. మీరూ ప్రత్యేకంగా బుక్ చేసుకుని ఉంటారు అంది. అలాంటిదేమీ లేదు అన్నాను.

పెళ్లి సంబంధం గురించి అనుకుంటా

పెళ్లి సంబంధం గురించి అనుకుంటా

తర్వాత నా కళ్ల వైపు చూసి తన కళ్లతోనే చిరునవ్వు చిందించింది. తర్వాత తన పేరు చెప్పింది. " నా పేరు మమత. నేను బెంగళూరులో సీఏ చేస్తున్నాను అంది." తర్వాత నా గురించి కూడా చెప్పాను. అంతలో ఆమెకు ఫోన్ వచ్చింది. పెళ్లి సంబంధం గురించి అనుకుంటా. చాలా సేపు మాట్లాడింది.

తనంటే ఇష్టం లేదు

తనంటే ఇష్టం లేదు

తర్వాత ఆ స్టోరీ మొత్తం నాకు కూడా చెప్పింది. తన మేనత్త కొడుకుని చేసుకోవాలని ఇంట్లో వాళ్లు పట్టుబట్టారని అతనంటే ఇష్టం లేదని చెప్పింది. తాను ఇంకా చాలా సాధించాలని.. తనకు ఇంకా చాలా కలలున్నాయని అంది.

మాటల్లో మునిగితేలిపోయాం

మాటల్లో మునిగితేలిపోయాం

నన్ను అర్థం చేసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి అయ్యాక కూడా నా స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలిగించని వాణ్నే ప్రేమిస్తానంది. అలా ఇద్దరం మాటల్లో మునిగితేలిపోయాం. మధ్యలో ఎన్ని స్టాప్ లు వచ్చి వెళ్తున్నాయో తెలియడం లేదు.

బస్ లో లైట్స్ ఆఫ్ చేశారు

బస్ లో లైట్స్ ఆఫ్ చేశారు

అప్పడప్పుడు కొన్ని స్టాపులలో స్నాక్స్, వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నాం. మళ్లీ మాటల్లో మునిగితేలుతున్నాం. మొత్తానికి ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. రాత్రి కావడంతో బస్ లో లైట్స్ ఆఫ్ చేశారు. కానీ ఇద్దరం గుసగుసలాడుతూనే ఉన్నాం.

నిద్రలోకి జారుకుంది

నిద్రలోకి జారుకుంది

మాట్లాడి మాట్లాడి అలిసిన తను నాపై వాలి అలాగే కళ్లు మూసుకుని నిద్రలోకి జారుకుంది. మధ్యలో సడన్ గా లేచింది. నువ్వు నిద్రపోలేదా? అంది.

నుదిటిపై ముద్దు పెట్టింది

నుదిటిపై ముద్దు పెట్టింది

ఇద్దరం ఒకరి కళ్లలోకి ఒకరం చూసుకున్నాం. నా లవ్‌ ప్రపోజల్‌ చేశాను. జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అన్నాను. ఎలా రియాక్ట్‌ అవుతుందోనని భయపడ్డాను. టెన్షన్‌ ఎక్కువైంది. కానీ నా నుదిటిపై ముద్దు పెట్టింది.

ఇద్దరికీ రాసి పెట్టి ఉంటే

ఇద్దరికీ రాసి పెట్టి ఉంటే

మన ఇద్దరికీ రాసి పెట్టి ఉంటే కచ్చితంగా మన పెళ్లి అవుతుంది అంది. ఇద్దరం ఒకరికొకంర ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నాం. ఇప్పుడే మొదలైన నా ప్రేమ ప్రయాణం.. పెళ్లిదాకా వస్తే చాలు అనుకుంటున్నాను.

English summary

My Love Story Started With A Kiss

That’s how my love story began. Not with a proposal, not on valentine’s day but with a kiss.