Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నా భార్య పెద్ద రాజకీయనాయకురాలు, ఆమెకు నాతో శృంగారం అంటే ఇష్టం లేదు, ఏం చెయ్యాలి?
ఒక స్థాయిలో స్థిరపడి ప్రజలకు బాధ్యత వహించేవారు సెక్స్ అంటే తప్పుగా భావించడం నిజమే. సమాజానికి బాధ్యులుగా ఉండే తామే అలాంటి తప్పుడు పని చేయకూడదని భావిస్తుంటారు. అయితే భార్య భర్తతో, భర్త భార్యతో అందులో ప
ప్రశ్న : మాది ఉత్తర భారతదేశం. నా భార్య సర్పంచ్ స్థాయి నుంచి ఇప్పుడు మంచి రాజకీయనాయకురాలిగా ఎదిగింది. రోజూ ఆమెను కలవడానికి వందలాది మంది ఇంటికొస్తుంటారు. చాలా మంది ఆమెను అక్కాఅక్కా అంటూ పిలుస్తుంటారు.
నా భార్య కూడా చాలా సంప్రదాయంగా ఉంటుంది. అందరికీ ఆడబిడ్డలా అండగా నిలుస్తూ ఉంటుంది. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తుంది.

విపరీతమైన అభిమానం
జనాలకు ఆమె అంటే విపరీతమైన అభిమానం. ఆమె పుట్టిన రోజు వచ్చిందంటే ఫ్లైక్సీలకు పాలాభిషేకాలు చేస్తారు. అలాంటివి చేయొద్దని ఆమె అభిమానులకు చెప్పినా కూడా పట్టించుకోరు. ఆమె తన అన్ని బాధ్యతలను బాగానే నిర్వహిస్తోంది.

శారీరకంగా కలవడం లేదు
కానీ నా భార్య నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. మాకు ఒక బాబు ఉన్నాడు. వాడు స్కూల్ కు వెళ్తున్నాడు. ఒక్కరే చాలు అని కుటుంబ నియంత్రణ చేయించుకుంది మా ఆవిడ. ఇక అప్పటి నుంచి తను నాతో శారీరకంగా కలిసింది చాలా తక్కువ.

నెలలో ఒక్కసారి కూడా
కొన్నిసార్లు అయితే నెలలో ఒక్కసారి కూడా నాతో శారీరకంగా కలవదు. ఏంటే ఇలా చేస్తున్నావని అడిగితే అందరికీ బాధ్యురాలిగా ఉండే నేనే తప్పు చేస్తే ఎలా అండీ అని అంటుంది. అది తప్పు కాదే అంటే కూడా అర్థం చేసుకోదు. భర్తతో భార్య అందులో పాల్గొనడం తప్పు కాదని నా భార్యకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు. ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్.

సెక్స్ అంటే తప్పుగా భావించడం
సమాధానం : ఒక స్థాయిలో స్థిరపడి ప్రజలకు బాధ్యత వహించేవారు సెక్స్ అంటే తప్పుగా భావించడం నిజమే. సమాజానికి బాధ్యులుగా ఉండే తామే అలాంటి తప్పుడు పని చేయకూడదని భావిస్తుంటారు. అయితే భార్య భర్తతో, భర్త భార్యతో అందులో పాల్గొనడం అస్సలు తప్పుకాదు.

అర్థమయ్యేలా చెప్పండి
మీరు ఆమెకు మళ్లీ వివరించడానికి ప్రయత్నించండి. మీరు చేసే పని అస్సలు తప్పు కాదని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. ఎంతకాదన్నా కూడా ఆమెలో కూడా ఆ కోరికలుంటాయి. ఆమె అందాన్ని పొగుడుతూ ఆమెతో సరసాలాడుతూ గడపండి. ఆత్మీయంగా చూసుకుంటూ ఉండండి. చివరకు ఆమె నీ దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications
