నా కజిన్ నన్ను ఆ విషయంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టాడు - My Story #23

Written By:
Subscribe to Boldsky

కొన్ని కులాల్లో, కొన్ని ప్రాంతాల్లో కజిన్ ను వివాహం చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణం. మా కులంలో, మా ప్రాంతంలోని అమ్మాయిలు కూడా కజిన్ ను వివాహం చేసుకుంటారు. చాలామంది చేసుకున్నారు కూడా. అయితే నాకు ఈ విషయం నచ్చేది కాదు. అలా చేసుకునే వాళ్లని చూసే నవ్వుకునే దాన్ని.

పెళ్లిలో కలిశాం

పెళ్లిలో కలిశాం

నాకు ఒక కజిన్ ఉన్నాడు. అతనితో నాకంతా పరిచయం ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి పెళ్లిళ్లప్పుడు కలిసేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కూడా కాదు. అయితే సడన్ గా ఒకసారి ఫేస్ బుక్ లో నాకు మెసేజ్ పంపాడు. నేను కూడా రిప్లై ఇచ్చాను. ఇద్దరం కొద్ది సేపు చాట్ చేశాం.

చాట్ తో పరిచయం పెరిగింది

చాట్ తో పరిచయం పెరిగింది

చాట్ వల్ల మా మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఎలా అయితే రిప్లై ఇస్తానో అలాగే అతనికి రిప్లై ఇచ్చాను. తను మాత్రం నన్ను వేరేలా భావించాడు. నీవు చాలా అందంగా ఉన్నావు.. సెక్సీగా ఉన్నావంటూ ఒకరోజూ మెసేజ్ పెట్టాడు. ఫేస్ బుక్ లోని నా ఫోటోలన్నింటినీ సేవ్ చేసుకుని ఒక వీడియో తయారు చేసి పంపాడు.

మెసేజ్ లు పంపుతూనే ఉన్నాడు

మెసేజ్ లు పంపుతూనే ఉన్నాడు

నాకు అతడు చేసిన పనులు అస్సలు నచ్చలేదు. నేను అతన్ని ఫేస్ బుక్ లో బ్లాక్ చేద్దామనుకున్నాను. అయితే ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని వదిలేశాను. ఇలాంటి మెసేజ్ లు పంపొద్దని చెప్పాను. అయినా అతను మాత్రం మెసేజ్ లు పంపుతూనే ఉన్నాడు. నాకు ఏమి అర్థం అయ్యేది కాదు.

చాలా రకాలుగా ప్రయత్నాలు

చాలా రకాలుగా ప్రయత్నాలు

కొన్నిరోజుల తర్వాత మా కుటుంబ సభ్యులతో కలిసి మేము ఒక ఫంక్షన్ కు వెళ్లాం. అక్కడికి అతను కూడా వచ్చాడు. మా కుటుంబ సభ్యుల దగ్గర మెప్పు పొందేందుకు అతను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. వాళ్లు కూడా ఇతన్ని నమ్మారు. అతన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.

మా ఇంట్లో వాళ్లే నా దగ్గరకు పంపించేవాళ్లు

మా ఇంట్లో వాళ్లే నా దగ్గరకు పంపించేవాళ్లు

కానీ అస్సలు నచ్చలేదు. మా వాళ్లు అతనితో కలిసి బాగా మాట్లాడు అని పరోక్షంగా నాకు సలహాలు ఇచ్చేవారు. నా పక్కన అతను కూర్చొని మాట్లాడేటటువంటి సిచ్యుయేషన్స్ కూడా క్రియేట్ చేసేవాళ్లు. వాళ్లే అలా చేయడం వల్ల నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు.

చనువుగా తీసుకుని

చనువుగా తీసుకుని

అతను దాన్ని చనువుగా తీసుకుని ఏదేదో చేయాలని చూసేవాడు. ఒక్కోసారి నన్ను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఒక రోజు మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంతకూ ఆపడం లేదు.

డైరెక్ట్ గా చెప్పాను

డైరెక్ట్ గా చెప్పాను

నాకు అప్పటికే అతనిపై చాలా కోపం ఉండేది. ఇక అతన్ని భరించలేక ఒకరోజు నేరుగా చెప్పాను. నువ్వుంటే నాకిష్టం లేదు. అయినా ఇలా వెంటపడితే ప్రేమ పుట్టదు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా కూడా మెకానికల్ గానే నీతో కాపురం చేయాల్సి వస్తుందని చెప్పాను.

ఇబ్బంది పెట్టేవాళ్లు

ఇబ్బంది పెట్టేవాళ్లు

మా ఇంట్లో వాళ్లు నన్ను అతన్ని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టేవాళ్లు. అయినా ఈ పెద్ద వాళ్లకు అస్సలు బుద్దిలేదు. డబ్బు ఉందని ఎవడ్ని అంటే వాణ్ని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుుంటారు. కొద్దిగా అయినా అర్థం చేసుకోవాలి.

నల్లమొద్దులాంటోడికి ఇస్తారు

నల్లమొద్దులాంటోడికి ఇస్తారు

ప్రభుత్వ ఉద్యోగం ఉందని ఒక నల్లమొద్దులాంటి వాణ్ని చేసుకోమంటారు. వాణ్ని పెళ్లి చేసుకుని రేపు పొద్దున్న వాడి వెంట ఎక్కడికైనా వెళ్తే చూసేవాళ్లంతా అమ్మాయేమో కుందనపు బొమ్మలాగా ఉండి వీడేంటి ఇలా ఉన్నాడనుకుంటారు.

పిల్లల్ని ఎలా కంటారో ?

పిల్లల్ని ఎలా కంటారో ?

ఇక కజిన్స్ చేసుకోవడం అంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్లతో ఎలా కాపురం చేస్తారు. ఎలా పిల్లల్ని కంటారో నాకు మాత్రం తెలియదు. తర్వాత మా ఇంట్లో వాళ్లు అతనితో పెళ్లి సంబంధం గురించి కూడా మాట్లాడారు. నేను మా వాళ్లకు ఒక్కటే చెప్పాను. ఇది నా జీవితం. మీరు నన్ను ఇష్టానుసారంగా ఎవడికంటే వాడికిచ్చి పెళ్లి చేస్తే అస్సలు సహించను అని చెప్పాను.

నచ్చితేనే కదా కాపురం

నచ్చితేనే కదా కాపురం

వాళ్లు కూడా ఏమి అనకుండా సైలెంట్ అయిపోయారు. ఆ పెళ్లి సంబంధం గురించే మాట్లాడడం లేదు. అయితే మా కజిన్ మాత్రం రోజూ ఏదో వంకతో ఇంటికి రావడం నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతను అలా చేయడాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ నా మనస్సులో ఏముందో కూడా అతను తెలుసుకోవాలి. నాకు నచ్చితేనే కదా రేపు పెళ్లాయ్యాక కూడా కాపురం చేసేది. లేకుంటే ఎలా చేయగలుగుతాను.

శృంగారం ఎలా చేయగలుగుతాం

శృంగారం ఎలా చేయగలుగుతాం

కజిన్ తో పెళ్లి అంటేనే ఇష్టం లేదు. పెద్దలు బలవంతం చేసి పెళ్లి చేసినా శృంగారం విషయంలో, అతని రోజూ కాపురం చేయడానికి నా ఇష్టం అవసరం కదా. ఏ ఇంట్లో అయినా పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తే ఆ కాపురం కూడా ఎక్కువ రోజులు ఉండదు.

నచ్చిన వాడికే ఇవ్వండి

నచ్చిన వాడికే ఇవ్వండి

ఈ విషయాన్ని పెద్దలు గుర్తించి మీ కూతర్లకు నచ్చిన వాడికే పెళ్లి చేయండని నా మనవి. అబ్బాయిలు కూడా అమ్మాయిలకు నచ్చకున్నా కూడా వారి చుట్టూ తిరిగి వాళ్ల ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితంలో మీరే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

English summary

Mystory My Cousin Forces Himself On Me Because It's His Right

Mystory My Cousin Forces Himself On Me Because It's His Right
Story first published: Tuesday, January 2, 2018, 16:00 [IST]