ఆమె తన టైం పాస్ కోసం నా జీవితంతో ఆడుకుంటోంది - My Story #31

Written By:
Subscribe to Boldsky

నా పేరు అర్జున్ రెడ్డి. నాది కర్నూలు. నేను ఒక న్యూస్ సైట్ లో పని బెంగుళూరలో పని చేస్తా. నాదొక భిన్న వ్యక్తిత్వం. నేను ఎవరి జోలికి వెళ్లను. నా బతుకు నేను బతుకుతుంటాను. నేనో పవన్ కల్యాణ్ టైప్. నన్ను ఎవరైనా ఏమన్న అంటే ముందు భరిస్తా. చాలా సార్లు భరిస్తా. నా ఓపిక ఉన్నంత వరకు సహిస్తా. అలా అని పిరికివాణ్ని వాదు. నాపై దాడి చేసిన వాణ్ని చంపేంత ధైర్యం ఉంది.

వారికి బుద్ధి ఉండదు

వారికి బుద్ధి ఉండదు

మరి ఎందుకలా ఉంటావు అని అడిగితే.. కొందరు వ్యక్తులు వయస్సు పరంగా ఎదిగి ఉంటారు. వారికంత ఇంగిత జ్ఞానం ఉండదు. సరిగ్గా బుద్ది కూడా ఎదిగి ఉండదు. అలాంటి వాళ్లను మూర్ఖులుగా భావిస్తా. వారిని వదిలేస్తా. అలాంటి మూర్ఖత్వం ఉన్న వ్యక్తి ఇంకా బరి తెగించి నా జీవితాన్నే టార్గెట్ చేస్తే మాత్రం నేను సహించను.

టార్గెట్ చేస్తే

టార్గెట్ చేస్తే

తను ఎన్నో తప్పులు చేస్తూ అందరి ముందు నన్ను తప్పు మనిషిగా చిత్రీకరిస్తే నేను భరించలేను. నేను టార్గెట్ చేస్తే మామాలుగా ఉండదు. నేను నమ్మిన దాన్ని లేదా నేను నమ్మి బతుకుతున్న విషయంలోగానీ నన్ను కించపరిస్తేగానీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి.

పని చేసే చోట..

పని చేసే చోట..

నేను పని చేసే చోట కూడా ఒక ఆమె ఇలాంటి డ్రామాలే ఆడింది. పైకి ఒక మాట.. నేను పక్కకు వెళ్తే ఇంకో మాట మాట్లాడుతూ నన్ను ఏదో చేయాలనుకుంది. కానీ పక్కన ఉన్న సాటి ఆడవాళ్లు అసలు విషయం తెలుసుకుని ఈ డ్రామా లేడీ గురించి నాకు అంతా చెప్పారు. మన తప్పు లేకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు.

విడిచిపెట్టకూడదు

విడిచిపెట్టకూడదు

మనల్ని ఒకరు విసిగించకుంటే మనం కూడా ఒకరి జోలికి వెళ్లాల్సిన అవసరం. మనల్ని టార్గెట్ చేస్తే మనం అవతలి వ్యక్తి ఎలాంటి వారైనా విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇదంతా నా ఉద్యోగానికి సంబంధించిన సమస్య. మీకు చెప్పాల్సిన అసలు కథ ఇంకోటి ఉంది. అది నా ప్రేమకథ.

ఇన్ డైరెక్ట్ గా ఆడుకుంటుంటే..

ఇన్ డైరెక్ట్ గా ఆడుకుంటుంటే..

ఇంతగా ఎందుకు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే.. కండల తిరిగిన మొనగాళ్లకే నేను ఎదురు నిలబడి గెలిచాను. కానీ ఆడమనిషి నన్ను ఇన్ డైరెక్ట్ గా ఆడుకుంటుంటే తట్టుకోలేకపోయాను. నా ముందు ఒక మాట మాట్లాడుతుంది. నేను పక్కకు వస్తే నా గురించి ఇంకో రకంగా చెబుతుంది.

ఉక్రోశం

ఉక్రోశం

అందుకే నాలో ఉన్న ఉక్రోశం బయటకు వచ్చింది. తనను చంపాడానికైనా రెడీ అన్నట్లుగా మారాను. అలా ఎవరి కోసమో మారాను.. ఎందుకు మారాననే కదా మీ డౌట్...అయితే నా కథ తెలుసుకోండి.

ప్రేమించానంది

ప్రేమించానంది

ఆమె నా డిగ్రీ క్లాస్ మేట్. ఆమె నన్ను ప్రేమించానని చెప్పింది. పెళ్లి చేసుకుంటానంది. నన్ను నమ్మించింది. ఆమెను కూడా నేను ప్రేమించాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ప్రతి రోజూ నాతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడేది.

పక్కా మోసం

పక్కా మోసం

నేను ఆమెను నమ్మాను. ప్రాణానికి ప్రాణంగా నమ్మాను. తనకోసం ఏదైనా చేయడానికైనా సిద్ధం అయ్యాను. మా ఇంట్లో నాకు ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ రిజెక్ట్ చేశాను. కానీ తను మాత్రం నన్ను పక్కా మోసం చేసింది. ఇంత బరితెగించిన ఆమెనా నేను పెళ్లి చేసుకోవాలనుకుంది అనుకున్నాను.

నేనే వెంటపడ్డానంట

నేనే వెంటపడ్డానంట

నేనే ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడ్డానంట. ఆమె నన్ను ప్రేమించలేదట. ఇలా చాలా మందికి చెప్పింది. అసలు విషయం ఏమిటో నాకు తెలుసు. తనకు తెలుసు. కానీ నా ఫ్రెండ్స్ కు మాత్రం అలా చెప్పింది. నాకు అక్కడే మండింది. అమ్మాయిలు చాలా సుకుమారంగా చాలా మంచి వ్యక్తిత్వంతో ఉంటారనుకుంటాం. కానీ ఇలాంటి అమ్మాయి కూడా నూటికొక్కరు ఉండే ఉంటారు.

టైమ్ పాస్ కోసం అట

టైమ్ పాస్ కోసం అట

నాతోనేమో నేను నిన్ను టైమ్ పాస్ కోసమే వాడుకున్నాను. నాకు అంతగా ప్రేమ లేదు. మా ఇంట్లో వాళ్లు మంచి సంబంధం తెచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోని సెటిల్ అవుతాను అంది. ఈ మాటలు విన్నప్పుడు మొదట నాకేమి అర్థం కాలేదు. ఆమెకు అంత మోజు ఉండి ఉంటే నాతో మొదటే చెప్పాల్సింది.

అన్ని డ్రామాలు అవసరమా?

అన్ని డ్రామాలు అవసరమా?

ఇలా ఇన్ని రకాలుగా నంగనాచిలాగా డ్రామాలు ఆడి చివరకు నన్ను బలి చేయాలని చూస్తే నాకు బాధగా ఉండదు. ఒక అమ్మాయి.. అబ్బాయిని ఎంతో ప్రేమిస్తాడు. ఆమె కోసం ప్రాణాలైనా ఇవ్వడానికైనా రెడీ అవుతాడు. జీవితం మొత్తాన్ని తనకే సమర్పించాలనుకుంటాడు. అయితే అమ్మాయి మాత్రం సింపుల్ గా ఇంకో అతన్ని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు అంత కోపం.

అబ్బాయి మోసం చేస్తే..

అబ్బాయి మోసం చేస్తే..

అబ్బాయి.. అమ్మాయిని మోసం చేస్తే అంతా మోగిపోతుంది. మరి అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే ఎవరూ ఏమనరే. ఏం అబ్బాయిలు మనుషులు కాదా.. నిజంగా చెప్పాలంటే ఎక్కువగా మోసపోతున్నది అబ్బాయిలే.

నమ్మించి గొంతు కోస్తారు

నమ్మించి గొంతు కోస్తారు

నా విషయంలో అదే జరిగింది. నా అవసరం ఉన్నంత వరకు నన్ను వాడుకుంది. నిజంగా ఒక అబ్బాయి ప్రేమ విషయంలో కాకుండా తన కెరీరీపై ఫోకస్ చేస్తే ఏదైనా సాధించగలడు. చాలా మంది అబ్బాయిలు ఇలా అమ్మాయిలను నమ్మి వారి వెంట పడి చివరకు మోసపోతుంటారు. అందుకే.. బ్రదర్ మాయలేడీని అస్సలు నమ్మొద్దు. నమ్మించి గొంతు కోస్తుంది. బీ కేర్ ఫుల్.

English summary

Mystory She Would Openly Say That It Was Only Time-Pass But I Wanted Commitment

Mystory She Would Openly Say That It Was Only Time-Pass But I Wanted Commitment
Story first published: Thursday, January 4, 2018, 17:00 [IST]