Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అద్దెకు బాయ్ ఫ్రెండ్స్, అన్నీ చేయించుకోవొచ్చు కానీ, అబ్బాయిలకు మంచి డిమాండ్, మంచి ఉపాధి
ఈ యాప్ ద్వారా అమ్మాయిలు వారికి కావాల్సిన అబ్బాయిల్ని బుక్ చేసుకోవొచ్చు. అయితే బుక్ చేసుకున్న అబ్బాయిల్ని అమ్మాయిలు సెక్స్ కోసం ఉపయోగించకూడదు. అబ్బాయిలతో ప్రశాంతంగా మాట్లాడొచ్చు.. అలాగే వారితో ఔటింగ్.
సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు వెంపర్లాడుతుంటారు. కానీ అబ్బాయిల కోసం కూడా కొందరు అమ్మాయిలు పరితపిస్తుంటారు. అలాంటి వారి కోసమే రెంట్ ఫర్ బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది.
మీకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటే ఇక్కడ అద్దెకు లభిస్తాడంటూ అమ్మాయిల కోసం ముంబైలో కొత్తగా యాప్ అందులోబాటులోకి వచ్చింది. ఒంటరిగా ఉండే అమ్మాయిలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందంటూ యాప్ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు.

అబ్బాయిల్ని బుక్ చేసుకోవొచ్చు
ఈ యాప్ ద్వారా అమ్మాయిలు వారికి కావాల్సిన అబ్బాయిల్ని బుక్ చేసుకోవొచ్చు. అయితే బుక్ చేసుకున్న అబ్బాయిల్ని అమ్మాయిలు సెక్స్ కోసం ఉపయోగించకూడదు. అబ్బాయిలతో ప్రశాంతంగా మాట్లాడొచ్చు.. అలాగే వారితో ఔటింగ్ కు వెళ్లొచ్చు. వారిని పార్టీలకు పిలుచుకుని వెళ్లొచ్చు.

అబ్బాయిలంతా అర్హులు కారు
ఇక అబ్బాయిలంతా దీనికి అర్హులు కారు. ఇందుకోసం యాప్ చాలా నిబంధనలు పెట్టింది. అబ్బాయి మాట తీరు బాగుండాలి. అతని ప్రవర్తన బాగుండాలి. సైకాలాజికల్ గా అతను స్ట్రాంగ్ గా ఉండాలి. అన్ని విషయాల్లో ఒకే అనిపిస్తేనే సెలెక్ట్ చేస్తారు లేదంటే లేదు.

యువకులకే ఎక్కువగా అవకాశాలు
ఎలాంటి క్రైమ్ హిస్టరీ లేని అబ్బాయిలే ఇందుకు అర్హులే. పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తిపై కేసులుండకూడదు. ఈ వివరాలన్నీ కూడా యాప్ నిర్వహకులు ముందుగానే చెక్ చేసుకుంటారు. తర్వాతే అబ్బాయిల్ని సెలెక్ట్ చేస్తారు. యువకులకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. దీంతో అబ్బాయిలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది.

కేవలం నాలుగు గంటలు
అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటే అతనితో ఆమె కేవలం నాలుగు గంటలు మాత్రమే గడపాలి. ఒకవేళ ఎక్కువ సేపు అబ్బాయితో ఉండాలంటే మాత్రం ముందుగానే యాప్ లో టైమ్ మెన్షన్ చెయ్యాలి. సమయం పెరిగేకొద్ది రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది.

రేట్లు కూడా డిఫరెంట్
ఇక అబ్బాయిల విషయంలో రేట్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మామాలు అబ్బాయిలకైతే తక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కాస్త హ్యాండ్ సమ్ గా ఉండి మంచి ఫిజిక్ తో ఉండే అబ్బాయిలకు మాత్రం ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. ఆ అబ్బాయిల్ని సెక్స్ కు తప్ప మిగతా సంతోషాలకు ఉపయోగించుకోవొచ్చు.

మంచి ఉపాధి
ఇక అబ్బాయిలు కూడా దీని ద్వారా మంచి ఉపాధి పొందుతున్నారు. రెగ్యులర్ జాబ్స్ చేసుకుంటూనే యాప్ లో సర్వీస్ అందిస్తున్నారు. ఎక్కువ శాతం బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన అమ్మాయిలు, డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలు యాప్ ద్వారా అబ్బాయిల్ని బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారట.



Click it and Unblock the Notifications
