నిజంగా నన్ను బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి నిలబెట్టింది - #mystory137

Written By:
Subscribe to Boldsky

నందిని ఒకప్పుడు ఈ పేరు అంటే నాకు బాగా ఇష్టం. కానీ ఇప్పుడు ఈ పేరు అంటేనే అసహ్యం పుడుతుంది. అసలు నందినితో నా పరిచయం ఏర్పడ్డ తీరు ఆ తర్వాత మా ఇద్దరి లవ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మాది మంగళూరు. ఇంట్లో తినడం..నాన్న బిజినెస్ లను అప్పడప్పుడు చూసుకోవడం, ఫ్రెండ్స్ తో తిరగడమే నా పని.

ప్రేమ పేరుతో వేధించేవాడు

ప్రేమ పేరుతో వేధించేవాడు

నందినికి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు నాగ్. నాగ్ నాకు వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించేవాడు. సిన్సియర్ గా ప్రేమించి ఉండి ఉంటే నేను కూడా సపోర్ట్ చేసేవాణ్ని. కానీ నాగ్ రోజూ ఫ్రెండ్స్ తో కలిసి ఆ అమ్మాయిని వేధించేవాడట.

అందమైన అమ్మాయి కనిపించింది

అందమైన అమ్మాయి కనిపించింది

ఒక రోజు నా చెల్లెలు నాకు విషయం చెప్పగానే ఫ్రెండ్స్ తో బైక్ పై కాలేజీ దగ్గరకు వెళ్లాం. ఆ రోజు నాగ్ కాలేజీకి రాలేదు. దాంతో వెంటనే అతని ఇంటికి వద్దకు వెళ్లాం. నాగ్ కనపడితే గట్టిగా వార్నింగ్ ఇవ్వాలనుకున్నాం. కానీ ఇంటి దగ్గర అందమైన అమ్మాయి కనిపించింది.

పొలం దగ్గరకు వెళ్లాడు

పొలం దగ్గరకు వెళ్లాడు

ఆమెను చూడగానే నాలో ఉన్న కోపం మొత్తం తుస్ మని తగ్గిపోయింది. ఎవరూ కావాలండి మీకు అంది. నాగ్ అని అన్నాను. మా తమ్ముడా.. తను పొలం దగ్గరకు వెళ్లాడు.. సాయంత్రం వస్తాడు అంది. అయినా మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు... మీరు ఎవరూ అని అడిగింది.

దొరికితే కొడదాం

దొరికితే కొడదాం

మా బంధం వేరేలే.. ముందు ముందు నీకు అర్థం అవుతుంది అని చెప్పా నాగ్ వాళ్ల పొలం దగ్గరకు వెళ్లాం. నాగ్ బోరు బావి దగ్గర ఒక్కడే కూర్చొని ఉన్నాడు. నా ఫ్రెండ్స్ నాగ్ దొరికితే కొడదాం అనే కోపంలో ఉన్నారు. వారందరినీ నేను బుజ్జగించాను.

ఏం మాట్లాడుతున్నావురా

ఏం మాట్లాడుతున్నావురా

తర్వాత నాగ్ మమ్మల్ని చూశాడు.. ఎవరూ మీరు అన్నాడు.. నేను మీ అక్కను ప్రేమిస్తున్నాను.. నీకు కాబోయే బావను అన్నాను. ఏయ్.. ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు. మీ బావను అంటేనే నీకు అంత మండుతుందే మరి నా చెల్లిని నువ్వు రోజూ ఏడిపిస్తుంటేనే నాకు ఎంత మండుతుందో నీకు తెలుసా అన్నాను.

బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి తిరుగుతా

బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి తిరుగుతా

ఎక్కువ మాట్లాడితే ఇదే బోర్ బావి దగ్గర బురదలో వేసి కొడతాం అన్నాను. తర్వాత నా మీద చెయ్యి చేసుకోబోయాడు. నీకు దమ్ముధైర్యం ఉంటే నా మీద చెయ్యి వెయి.. మంగళూరులోని బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి తిరుగుతా అన్నాను. దాంతో నాగ్ సైలెంట్ అయ్యాడు.

నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావంట

నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావంట

మరోసారి మా చెల్లి జోలి వస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి ఇంటికొచ్చాం. తర్వాత నందిని మా అడ్రస్ తెలుసుకుని మా ఇంటికి వచ్చింది. ఏంటీ.. నువ్వు నిన్న మా తముడితో ఏదేదో మాట్లాడవంటా.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావంట. నీకసలు బుద్ది ఉందా? అని అంది.

కత్తిలా ఉన్నావ్

కత్తిలా ఉన్నావ్

మరి మీ తమ్ముడు మా చెల్లి వెంట పడుతున్నాడు అన్నాను. మీచెల్లి నచ్చిందేమో అందుకే వెంటపడుతున్నాడు అంది. మరి నువ్వు కూడా కత్తిలాగా ఉన్నావ్.. నీ వెంట పడితే ఊరుకుంటావా అన్నాను. సరే దమ్ము ఉంటే పడూ అంటూ వెళ్లిపోయింది.

ప్రేమలో పడేశాను

ప్రేమలో పడేశాను

నన్ను నందిని రెచ్చగొట్టడంతో పది రోజులు తన వెంట పడ్డాను. ప్రేమలో పడేశాను. పెళ్లి చేసుకుందాం అన్నాను. ఒకే అంది. నేను, నందిని మంగళూరులో తిరగని సర్కిల్ లేదు. ఇక బల్మట్ట సర్కిల్ కు వెళ్లినప్పుడల్లా నాకు నాగ్ గుర్తొచ్చేవాడు. నందిని ఏం చెప్పిందో కానీ నాగ్ మా చెల్లెల్ని ఏడిపించడం ఆపేశాడు.

అస్సలు మ్యాచ్ కాదురా

అస్సలు మ్యాచ్ కాదురా

నందిని గురించి మా ఇంట్లో చెప్పి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాను. మా ఫ్రెండ్స్ మాత్రం ఒరేయ్... మామా నీకు నందినికి అస్సలు మ్యాచ్ కాదురా.. అమ్మాయి నీతో డబుల్ గేమ్ ఆడుతుందని మాకు అనిపిస్తుంది అన్నారు. నేను నమ్మలేదు.

పొలం గట్లపై సరసాలాడుతూ

పొలం గట్లపై సరసాలాడుతూ

నందిని గురించి మా ఇంట్లో చెప్పాను. అందరూ ఒకే అన్నారు. ఈ విషయం నందిని చెబుదామని ఆమె కాలేజీ దగ్గరకు వెళ్లాను. నందిని వేరే అబ్బాయితో బైక్ వై వెళ్తూ కనిపించింది. వాళ్లను ఫాలో అయ్యాను. వారిద్దరూ పొలం గట్లపైకి వెళ్లి సరసాలాడుతూ కనిపించారు.

నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావ్

నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావ్

నాకు దుఖం ఆగలేదు. ఇంతగా నమ్మితే ఇలా చేసిందేమిటి అనుకున్నాను. నందిని దగ్గరకు వెళ్లి నిలదీశాను. మేమిద్దరం చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం... అంది. మరి నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావ్ అన్నాను.

నందిని క్యారెక్టర్ ఇదా

నందిని క్యారెక్టర్ ఇదా

అవన్నీ ఇప్పుడు లైట్‌. ఇద్దరం ఎంజాయ్ చేశాం. ఇక మరిచిపో. అయినా నీ నిజాయితీ నాకు తెలుసు. నువ్వు మళ్లీ నన్ను ఇబ్బందిపెట్టవని నేను కోరుకుంటున్నాను అంది. అప్పుడు అనిపించింది నందిని క్యారెక్టర్ ఇదా అని.

బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి నిలబెట్టింది

బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి నిలబెట్టింది

కొన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లాను. బల్మట్ట సర్కిల్ కు వెళ్లినప్పుడు ఇప్పటికీ నాకు గుర్తొచ్చేది నాగ్. కానీ దాంతో పాటు నందిని కూడా గుర్తొస్తుంది. అప్పట్లో నాగ్ పై ఓడిపోతే.. బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి తిరుగుతా అన్నాను. కానీ ఇప్పుడు ఒక ఆడదాని చేతితో ఓడిపోయాను. నందిని.. నన్ను బల్మట్ట సర్కిల్ లో బట్టలిప్పి నిలిబెట్టి వెళ్లిపోయినట్లుగా ఫీలవుతున్నా.

English summary

she wants me as her lover not her husband

she wants me as her lover not her husband
Story first published: Tuesday, April 3, 2018, 15:41 [IST]