For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె బార్న్ విత్ గోల్డ్ స్పూన్, నేను ట్రాక్టర్ కు పనులకు వెళ్లి బతికేటోన్ని, ప్రపోజ్ చేశా #mystory370

అలా ఒప్పిద్దామంటే కొన్ని వందల సమస్యలు అడ్డొస్తాయి. వాటన్నింటినీ దాటుకుని వెళ్లే ధైర్యం చాలా మంది అబ్బాయిలు చేయరు. అందుకే మన కళ్లముందే ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికిచ్చి పెళ్లి చేసినా కూడా ఏమీ అనలేము

|

సినిమాల్లో మాదిరిగా ప్రతి ఒక్కరూ వారి ప్రేమను గెలిపించుకోలేరు. అమ్మాయిని సిన్సియర్ ప్రేమించొచ్చుగానీ వాళ్ల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది నిజ జీవితంలో చాలా వరకు జరగదు.

అలా ఒప్పిద్దామంటే కొన్ని వందల సమస్యలు అడ్డొస్తాయి. వాటన్నింటినీ దాటుకుని వెళ్లే ధైర్యం చాలా మంది అబ్బాయిలు చేయరు. అందుకే మన కళ్లముందే ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికిచ్చి పెళ్లి చేసినా కూడా ఏమీ అనలేము.

నాన్నచిన్నతనంలోనే చనిపోయాడు

నాన్నచిన్నతనంలోనే చనిపోయాడు

మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు. నేనే ఇంటికి ఆసరయ్యాను. ఉదయం ఐదు గంటలకే లేచి ట్రాక్టర్ వర్క్ కు వెళ్లేవాణ్ని. తర్వాత కాలేజీకి వెళ్లేవాణ్ని. అలా నా చదువు పూర్తి చేశాను.

నాపై జాలి చూపేది

నాపై జాలి చూపేది

నేను కాలేజీలో ఉండగా నాపై ఒక అమ్మాయి చాలా అభిమానం చూపేది. నా పరిస్థితి తనకు తెలియడంతో నాపై జాలి చూపేది. నా కాలేజీ ఫీజ్ మొత్తం తనే కట్టింది. దీంతో ఆమె అంటే నాకు చాలా అభిమానం పెరిగింది.

రోజ్ ప్లవర్ ఇచ్చేవాణ్ని

రోజ్ ప్లవర్ ఇచ్చేవాణ్ని

రోజూ తనకు రోజ్ ప్లవర్ ఇచ్చేవాణ్ని. ప్రేమగా తీసుకునేది. తనని ప్రేమించే అర్హత నాకు లేదని తెలుసు. నేను ఏ విషయంలోనూ తనను ప్రేమించేందుకు అర్హున్ని కాదు. నేను అందగాణ్ని కాను. కానీ తను మాత్రం ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది.

Most Read :మా ఆయన ఆఫీస్ లోని అమ్మాయిలపై చూపే ప్రేమ నాపై ఒక్క శాతం కూడా చూపడు#mystory369Most Read :మా ఆయన ఆఫీస్ లోని అమ్మాయిలపై చూపే ప్రేమ నాపై ఒక్క శాతం కూడా చూపడు#mystory369

బై బర్త్ గోల్డ్ స్పూన్ బేబీ

బై బర్త్ గోల్డ్ స్పూన్ బేబీ

పని చేస్తేగానీ పూటగడవని పరిస్థితి నాది. తాను మాత్రం చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్ బేబీ. చదువులో కూడా నేను చాలా డల్. తను మంచి ర్యాంకర్. ఇలా ఏ విషయంలో చూసుకున్నా తనతో నేను అస్సలు పోటీపడను. అందుకే నాకు తనపై ఎంత ప్రేమ ఉన్నా కూడా దాన్ని మనస్సులోనే పెట్టుకున్నాను.

నీవంటే ఆమెకు చాలా ప్రేమ

నీవంటే ఆమెకు చాలా ప్రేమ

కానీ నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఆమెకు ప్రపోజ్ చెయ్యమని చెప్పేవారు. ఆమె క్లాస్ లో ఎవరితోనూ మాట్లాడదు. కేవలం నిన్నే అంత ప్రేమగా పలకరిస్తుందంటే నీవంటే ఆమెకు చాలా ప్రేమ ఉందని అర్థం అని అనేవారు.

ప్రపోజ్ చేయాలని అనిపించేది

ప్రపోజ్ చేయాలని అనిపించేది

ఫ్రెండ్స్ అంతా అలా అంటూ ఉండడంతో అప్పుడప్పుడు నాకు కూడా ఆమెకు ప్రపోజ్ చేయాలని అనిపించేంది. కానీ ధైర్యం చాలేది కాదు. డిగ్రీ ఫైనలియర్ లో ఉండగా ఆమెకు నేను ప్రపోజ్ చేశాను. చాలా ధైర్యం చేశాను. ఆమె ఏమన్నా అనుకుంటుందేమోనని నా భయం. కానీ నా లక్ బాగుండి తను ఒకే చేసింది.

Most Read :పెళ్లికి ముందు నేనంటే పడి చచ్చేవాడు, ఎంత వెంటపడ్డాడో, పెళ్లయ్యాక #mystory368Most Read :పెళ్లికి ముందు నేనంటే పడి చచ్చేవాడు, ఎంత వెంటపడ్డాడో, పెళ్లయ్యాక #mystory368

లేచిపోయి వస్తే

లేచిపోయి వస్తే

మా ఇంట్లో వాళ్లను ఒప్పించు పెళ్లి చేసుకుంటాను అంది.

లేచిపోయి రావడం ఊర్లో పరువు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదంది. (మిగతా స్టోరీ #mystory371లో)

English summary

she was born with a golden spoon i am ordinary man

she was born with a golden spoon i am ordinary man
Desktop Bottom Promotion