శృంగారం తర్వాత ఏం చేయాలో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

శృంగారం గురించి తెలుసుకోవడం, ఆలోచించడం తప్పు కాదు. ఈ సృష్టి మూలం.. మనం పుట్టడానికి కారణం కూడా శృంగారమే కాబట్టి దానిపై అవగాహన కచ్చితంగా అవసరమే. అయితే చాలా మందికి శృంగారం ఎలా చేయాలో తెలుసు కానీ శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదో చాలామందిలో కొన్ని అపోహలు, అనుమానాలు ఉంటాయి. అయితే శృంగారం తర్వాత చేయాల్సిన పనులు, చేయకూడనివి ఏమిటో తెలుసుకోవాలి.

క్లీన్ చేసుకోవాలి

క్లీన్ చేసుకోవాలి

చాలామంది శృంగారం తర్వాత అలాగే బెడ్ పై పడుకోవడం చేస్తుంటారు. ఈ విధంగా ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరి మధ్య సంభోగం జరిగినప్పుడు ఇద్దరి శరీరాల నుంచి స్కలనం జరగడం వలన ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి శృంగారం తర్వాత వెంటనే నీటితో ఆ ప్రదేశాలను శుభ్రపరచుకోవాలి.

వెంటనే అటువైపు తిరిగిపడుకోకూడదు

వెంటనే అటువైపు తిరిగిపడుకోకూడదు

రెండు మనసులు, చీకటి గదిలో జరిగిన శృంగార కేళి తర్వాత దంపతుల మధ్య మరింత అనుబంధం ఆనందం కలుగుతుంది. అలా కాదని శృంగారం అయిపోయిన వెంటనే ఎవరికి వారు ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోవడం వలన మంచి రిలేషన్ మెయింటేన్ చేయలేరు. ఇద్దరి మధ్య అనుబంధం పెరగడానికి, మరుసటి రోజు శృంగారంలో ఆసక్తిగా పాల్గొనాలంటే ఒక రెండు నిముషాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత పడుకోవాలి. చాలామంది మగవాళ్లు పని అయిపోగానే అటువైపు తిరిగి పడుకుంటూ ఉంటారు.

బాత్రూమ్ కి వెళ్లాలి

బాత్రూమ్ కి వెళ్లాలి

శృంగారంలో పాల్గొన్న తర్వాత చాలామంది చేయని పనిలో యూరిన్ వెళ్ళకపోవడం. స్కలనం జరిగిన కొన్ని నిముషాల తర్వాత దంపతులు కచ్చితంగా యూరిన్ చేయడం చేయాలి. ఇలా చేయకపోతే ఏదో తెలియని నొప్పిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఆ ప్రదేశంలో వస్తాయి.

లో దుస్తులు

లో దుస్తులు

శృంగారంలో పాల్గొనకున్నా లేదా రాత్రి నిద్రించే సమయంలోనైనా సరే లో దుస్తులు ధరించి అస్సలు నిద్రించకూడదు. ఈ విధంగా చేయడం వలన జననాంగాల వద్ద వేడి పుట్టి శృంగారంలో ఆసక్తిని తగ్గిస్తుంది. రోజు మొత్తంలో వేసుకున్న లో దుస్తులను కనీసం రాత్రి నిద్రించే సమయంలో ధరించకపోవడం మంచిది. స్కిన్ రాషెష్, ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండాలంటే, జననాంగాలకు చల్లని గాలి తగలాలన్నా లో దుస్తులు వేసుకోకూడదు.

అనవసర విషయాలపై చర్చ వద్దు

అనవసర విషయాలపై చర్చ వద్దు

పని పూర్తయ్యాక ఏవైనా సమస్యలపై మాట్లాడకూడదు. శృంగారం పూర్తయ్యాక దాన్ని ఎంజాయ్ చేయాలంటే సమస్యలపై అస్సలు మాట్లాడుకోకూడదు. సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

బాత్ టబ్ స్నానం వద్దు

బాత్ టబ్ స్నానం వద్దు

శృంగారం తరువాత స్నానం చేయడం మంచిదే. కానీ, బాత్ టబ్ లోకి నేరుగా వెళ్లకూడదట. యోని ప్రాంతంలో ప్రేరణకు గురై మరింత విచ్చుకుంటుంది. శృంగారం తరువాత బాత్ టబ్ స్నానం వలన మరిన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు.

హైడ్రేట్ అవసరం

హైడ్రేట్ అవసరం

వ్యాయాయం లాగానే శృంగారం జరిగాక మిమల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం అవసరం. డిహైడ్రేషన్ మీ శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. జననాంగాలను నీటితో ఎండనియ్యకుండా చేసి బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోండి.

ప్రోబయోటిక్ పదార్ధాలను తినాలి

ప్రోబయోటిక్ పదార్ధాలను తినాలి

శృంగారం తరువాత ఏం తిన్నారు అన్నది ముఖ్యం. డబ్బాలలో ఉండే చాకోలెట్స్, చిప్స్ వంటి పదార్ధాలు నోరూరిస్తాయి. కానీ, ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ పదార్ధాలను ఎక్కువగా తినాలి. శృంగారం తరువాత ఇలాంటివి తింటే మంచి బాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.

యోని తడిగా ఉంటుంది

యోని తడిగా ఉంటుంది

శృంగారం తరువాత యోని ప్రాంతం తడిగా, వెచ్చగా ఉంటుంది. అక్కడే బాక్టీరియా తకగలదు. పైగా గాలి తాగాలని బట్టలు ధరిస్తే బాక్టీరియా మరింత పెరుగుతుంది. కాటన్ దుస్తుల్లాంటివి ధరించి అక్కడ గాలి తగిలేలా చూసుకోవాలి.

ఇలా చేయకండి

ఇలా చేయకండి

తడి వైప్స్ తో మిమల్ని మీరు శుభ్రపరుచుకోవాలి అనుకోవడం సరైన పద్ధతి అనిపించిన.. వాటిలోని రసాయనాలు, సుగంధాలు మీ సున్నితమైన జననాంగ ప్రాంతాలను మంటపుట్టేలా చేస్తాయి. అందువల్ల తడి వైప్స్ ఉపయోగించకండి.

సబ్బులను ఉపయోగించకండి

సబ్బులను ఉపయోగించకండి

సెక్స్ పూర్తయిన తర్వాత ఆడవారు వారి జననాంగాలను సబ్బుతో క్లీన్ చేసుకోకూడదు. సెక్స్ తర్వాత గానీ లేదా ఎప్పుడైనా సరే ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేయడం అనేది చాలా తప్పు. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులు రావని యోని క్లీన్ గా అవుతుందని చాలామంది అపోహపడుతుంటారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. సబ్బులు అక్కడ ఉండే సున్నితమైన చర్మంపై ప్రభావం చూపుతాయి. చర్మం పొడిగా మారుతుంది. అందువల్ల సబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.

హాట్ వాటర్ షవర్ కింద స్నానం చేయకండి

హాట్ వాటర్ షవర్ కింద స్నానం చేయకండి

ఇక మీరు అందులో పాల్గొన్న తర్వాత వెంటనే హాట్ వాటర్ తో స్నానం చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో యోని కొంచెం ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుంది. అందువల్ల సెక్స్ లో పాల్గొన్న వెంటనే ఆడవాళ్లు షవర్ కింద వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. హాట్ వాటర్ యోనిలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ ఫెక్షన్ కు గురవుతారు. సెక్స్ తర్వాత చేయకూడని పనుల్లో ఇది చాలా ముఖ్యమైనది.

English summary

things to do after sex

things to do after sex, 12 Things That Men Should Always Do After Sex
Story first published: Tuesday, January 16, 2018, 14:53 [IST]
Subscribe Newsletter