రోడ్డుపై నా బైక్ ఎక్కిన రూప నన్ను అక్కడ చూసి షాక్ అయ్యింది - #mystory135

Written By:
Subscribe to Boldsky

తన పేరు రూప. పేరు తగ్గట్లుగానే అపురూపంగా ఉంటుంది. తొలి చూపులోనే నేను తన ప్రేమలో పడిపోయాను. నేను నా ఫ్రెండ్ పెళ్లి కోసం ఊరెళ్తున్నాను. నా స్నేహితుడి ఊరికి వెళ్లాలంటే బస్ సౌకర్యం లేదు. బైక్ లేదా ఆటోల్లోనే వెళ్లాలి.

అందమైన కుందనపు బొమ్మ

అందమైన కుందనపు బొమ్మ

అక్కడికి వెళ్లాక ఎందుకు రిస్క్ పడడం అని నేను మా ఊరు నుంచి బైక్ పై మా ఫ్రెండ్ ఊరికి బయల్దేరాను. ఇక ఊరి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో అందమైన కుందనపు బొమ్మలాంటి అమ్మాయి కనిపించింది.

మీకు అభ్యంతరం లేకపోతే

మీకు అభ్యంతరం లేకపోతే

లిఫ్ట్ అడగాలా వద్దా అనుకుంటూ స్టేజీ దగ్గర అలాగే నిలబడి ఉంది ఆమె. నేనే బైక్ స్లో చేశాను. ఎక్కడికి వెళ్లాలండీ.. అని అడిగాను. నేను వెళ్లే ఊరి పేరే చెప్పింది. నేను అక్కడికే వెళ్తున్నానండీ.. మీకు అభ్యంతరం లేకపోతే రండి అన్నాను.

మాది వరంగల్

మాది వరంగల్

ఒకే అని బైక్ ఎక్కింది. మీది ఆ ఊరేనండి అన్నాను. కాదు మాది వరంగల్ అంది. మాది వరంగలే అన్నాను. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారండి అని అడిగాను. నా ఫ్రెండ్ సురేశ్ మ్యారేజ్ కి అని చెప్పింది. అలాగా.. నేను కూడా సురేశ్ పెళ్లికే వెళ్తున్నాను అన్నాను. అలా యాక్సిడెంటల్ గా కలవడంతో ఇద్దరిలో ఆనందం మొదలైంది.

ఆ ఇడియట్ నాకు చిన్నప్పటి నుంచి

ఆ ఇడియట్ నాకు చిన్నప్పటి నుంచి

మీ పేరు అని అన్నాను.. రూప అంది. మీ పేరు అంది.. మహేశ్ అన్నాను. సురేశ్ మీకు ఎలా పరిచయం అని అడిగాను.. ఆ ఇడియట్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్.. ఇద్దరం టెన్త్ వరకు కలిసి చదువుకున్నాం అంది. మరి నీకు.. అంది. నేను అతను ఒకే చోట జాబ్ చేస్తాం అన్నాను.

మొదటి అమ్మాయి తనే

మొదటి అమ్మాయి తనే

గలగల మాట్లాడుతున్న ఆ అమ్మాయి మాటలకు నేను ఫ్లాట్ అయిపోయాను. రోడ్డుపై గుంతలు వచ్చినప్పుడు భయపడుతూ నా మీద చెయ్యి వేసినప్పుడు నాలో నేను పొంగిపోయాను. నా కొత్త పల్సర్‌ పై బ్యాక్ సీటుపై కూర్చొన్న మొదటి అమ్మాయి తనే.

చాలా ఆక్టివ్

చాలా ఆక్టివ్

మరుసటి రోజు స్నేహితుడి పెళ్లిలో మేమిద్దరమే స్పెషల్ అట్రాక్షన్. పెళ్లి పనుల్లో మేమిద్దరమే ముందుండే వాళ్లం. వడ్డించే దగ్గర నుంచి ఫ్రెండ్స్ అందరికీ వీడ్కోలు పలికే వరకు ఇద్దరం చాలా ఆక్టివ్ గా పని చేశాం.

రూప, నేను బైక్ పై...

రూప, నేను బైక్ పై...

నేను సురేశ్ కు చెప్పి సాయంత్రం తిరిగి ఊరికి వెళ్లడానికి బయల్దేరాను. రూపను కూడా అక్కడిదాకా డ్రాప్ చెయ్ రా అని సురేశ్ చెప్పాను. సరే రమ్మను అని అన్నాను. రూప, నేను బైక్ పై బయల్దేరాం.

ఎగిరి గంతేసింది

ఎగిరి గంతేసింది

సురేశ్ వాళ్ల ఊరు దాటిన తర్వాత బస్టాప్ ఉంది. అక్కడ దిగుతుందేమో అనుకున్నాను. నువ్వు ఎక్కడదాక వెళ్తావు అంది.. వరంగల్ కు అని చెప్పాను. అయితే నేను కూడా బైక్ పైనే వస్తానంది. నా మనస్సు ఎగిరి గంతేసింది.

బలవంతం చేసింది

బలవంతం చేసింది

బైక్ స్పీడ్ నలభై కన్నా మించకుండా చూసుకున్నాను. తనతో ఊసులాడుతూ బైక్ చిన్నగా డ్రైవ్ చేశాను. వరంగల్ వచ్చాక వాళ్ల ఇంటికి వెళ్దామంది. తనను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వద్దామనుకున్నాను. వాళ్ల ఇంట్లోకి రావాలని బలవంతం చేసింది.

రూప జ్ఞాపకాలు

రూప జ్ఞాపకాలు

ఇంట్లోకి వెళ్లాను. రూప వాళ్ల అమ్మానాన్న ఎంతో బాగా మాట్లాడారు. రూప విడిచి మా ఇంటికి బయల్దేరాను. ఆ రోజంతా రూప జ్ఞాపకాలు వెంటాడాయి. రోజంతా తన ఆలోచనలే ఉండేవి. అప్పుడప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాణ్ని.

అతన్నే పెళ్లి చేసుకుంటా

అతన్నే పెళ్లి చేసుకుంటా

రూప ఎప్పుడో ఓసారి బదులిచ్చేది. ఓసారి లవ్ మ్యారేజ్ పై తన అభిప్రాయం అడిగాను. మా అమ్మానాన్నలు ఏ సంబంధం తీసుకొస్తే అతన్నే పెళ్లి చేసుకుంటా అంది. అప్పుడప్పుడు నేను మెసేజ్ లు పంపేవాణ్ని కానీ రూప రిప్లై ఇచ్చేది కాదు.

అతన్నే పెళ్లి చేసుకోవొచ్చు

అతన్నే పెళ్లి చేసుకోవొచ్చు

ఒక రోజు మెసేజ్ చేసింది.. దయచేసి ఇంకోసారి మెసేజ్ చేయొద్దు. నాకు ఈ రోజు పెళ్లి చూపులు. మా అమ్మనాన్నకు ఆ అబ్బాయి బాగా నచ్చాడంట. తాను అతన్నే పెళ్లి చేసుకోవొచ్చు అంది. నేను సరేనన్నా.

త్వరలో మా వివాహం

త్వరలో మా వివాహం

ఆ పెళ్లిచూపులకు వెళ్లిన అబ్బాయిని నేనే. నాకిష్టమైన రూపను నా భాగస్వామిగా చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. చివరకు రూప అమ్మానాన్నల్ని ఒప్పించాను. పెళ్లిచూపుల్లో రూప నన్ను చూసి షాక్ అయ్యింది. వెంటనే ఒకే అంది. త్వరలో మా వివాహం.

English summary

we met we became friends and we fell in love we will marry

we met we became friends and we fell in love we will marry
Story first published: Monday, April 2, 2018, 11:54 [IST]