సెక్స్ ఎక్కువ సేపు చేయలేకపోతున్నా.. ఒక్కసారి పూర్తయ్యాక మళ్లీ సిద్ధం కాలేకుంటున్నా!

Written By:
Subscribe to Boldsky

నా వయస్సు 29 యేళ్లు. నాకు వివాహమై రెండేళ్లు అవుతోంది. నేను ప్రతిరోజూ నా భార్యతో సెక్స్ లో పాల్గొంటూ ఉంటున్నాను. నాకు అంగస్తంభన సమస్య లేదు. అంగం బాగానే స్పందిస్తూ ఉంది. కానీ వీర్యస్కలనం మాత్రం త్వరగా జరిగిపోతోంది. అయితే ఇక ఒకసారి వీర్యస్కలనం అయ్యాక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు.

మళ్లీ సెక్స్ కావాలంటోంది

మళ్లీ సెక్స్ కావాలంటోంది

అలాగే నా భార్య నేను సెక్స్‌ చేసిన కొద్ది సేపటి తర్వాత మళ్లీ సెక్స్ కావాలంటోంది. అయితే నేను మళ్లీ సెక్స్ కు సిద్ధం కాలేకపోతున్నాను. దీంతో నా భార్య సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరమూ అసంతృప్తి చెందుతున్నాం.

ఎక్కువ సేపు ఎంజాయ్ చేయాలంటే

ఎక్కువ సేపు ఎంజాయ్ చేయాలంటే

మొదటిసారి అంగం స్తంభించినప్పుడే ఎక్కువ సేపు సెక్స్ లో ఎంజాయ్ చేయాలని ఉంది. అలాగే రెండోసారి కూడా వెంటనే అంగం స్తంభించాలంటే ఏం చెయ్యాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో చెప్పండి?

రిఫ్లెక్స్ యాక్టివిటీ

రిఫ్లెక్స్ యాక్టివిటీ

దీన్ని ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. చాలా మంది మగవారు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వీర్యస్కలనం అనేది ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ.

స్పందనలు త్వరగా కలగడం వల్ల

స్పందనలు త్వరగా కలగడం వల్ల

సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉత్తేజితం కావడం వల్ల ఈ వీర్యస్కలనం అనే రిఫ్లెక్స్ ప్రక్రియ జరుగుతుంది. కొంతమందిలో ఈ స్పందనలు త్వరగా కలగడం వల్ల వీర్యస్కలనం వెంటనే జరిగిపోతోంది.

ఉపరతిలో పాల్గొనండి

ఉపరతిలో పాల్గొనండి

మీరుసెక్స్‌లో నేరుగా పాల్గొనకుండా ఉపరతిలో పాల్గొనడం మంచిది. అంటే మీ భార్య మీపై మీరు మీ భార్య కింద ఉండే భంగిమలో సెక్స్ లో పాల్గొనండి.

అంగాన్ని బయటకు తీయండి

అంగాన్ని బయటకు తీయండి

అలాగే వీర్యస్కలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్కలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి.

నొక్కి పట్టుకోండి

నొక్కి పట్టుకోండి

ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను 'పించ్ అండ్ స్టార్' టెక్నిక్ అంటారు. ఈ సమస్య వల్ల చాలా మేరకు సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు.

రెండోసారి స్తంభించాలంటే

రెండోసారి స్తంభించాలంటే

మొదటిసారి సెక్స్ పూర్తయిన వెంటనే రెండోసారి అంగం స్తంభించాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది. అందువల్ల మీరు కాసేపు టైమ్ తీసుకుని ట్రై చేస్తే మళ్లీ అంగం గట్టిపడి సెక్స్ లో పాల్గొనడానికి వీలుంటుంది.

ఫోర్ ప్లే లో కూడా ట్రై చేయండి

ఫోర్ ప్లే లో కూడా ట్రై చేయండి

అలాగే మీరు సెక్స్ కు ముందు ఫోర్ ప్లేలో కూడా ట్రై చేయండి. ఫోర్ ప్లే వల్ల కూడా శీఘ్ర వీర్య స్కలన సమస్య నుంచి బయటపడొచ్చు. ఇలా అన్ని రకాల టెక్నిక్స్ యూజ్ చేస్తే మీరు కచ్చితంగా సెక్స్ ను బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

సమస్య పరిష్కారం కాకపోతే

సమస్య పరిష్కారం కాకపోతే

ఒకవేళ మీరు అన్ని రకాల టెక్నిక్స్ ను ఉపయోగించినా కూడా శీఘ్ర వీర్యస్కలన సమస్య పరిష్కారం కాకపోతే మీరు సెక్సాలజిస్ట్ ను నేరుగా సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది.

English summary

Why can’t I enjoy sex like everyone else?

why cant i enjoy sex like everyone else