భార్య గర్భిణీగా ఉన్నప్పుడే భర్త ఎందుకు మోసం చేస్తారో తెలుసా ?

Written By:
Subscribe to Boldsky

గర్భిణీలకు ఎన్నెన్నో అనుమానాలు ఉంటాయి. ఆ సమయంలో శృంగారానికి దూరంగా దూరంగా ఉండాలా అని ఆందోళన చెందుతుంటారు. భర్తతో శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందోననే ఆందోళన ఉంటుంది.

శృంగారానికి ఒప్పుకోరు

శృంగారానికి ఒప్పుకోరు

కొత్త పెళ్ళయ్యి, తొలిసారి గర్భం ధరించిన యువతులైతే మరీ ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. తెలియని వయస్సు కాబట్టి ఏమవుతుందోనని భయంతో ఉంటారు. భర్తకు కొన్ని రోజులు ఆ విషయంలో దూరంగా ఉండడానికైనా రెడీ అవుతారు కానీ

శృంగారానికి మాత్రం ఒప్పుకోరు.

డాక్టర్లు కూడా అలాగే చెబుతారు

డాక్టర్లు కూడా అలాగే చెబుతారు

డాక్టర్లు కూడా కొన్ని రోజులు ఆ విషయంలో భర్తకు దూరంగా ఉండడమే ఉత్తమం అని చెబుతారు. ఎందుకంటే ఈ భర్తలకు ఛాన్స్ ఇస్తే భార్యలు గర్భిణీలు అని మరిచిపోయి రోజూ మాదిరిగానే శృంగారంలో పాల్గొంటారు. అందుకే డాక్టర్లు వద్దని చెబుతారు.

ఆ టైమ్ లో దూరంగా ఉండాలంట

ఆ టైమ్ లో దూరంగా ఉండాలంట

గర్భం ధరించిన మొదటి మూడు నెలలు, చివరి రెండు నెలలు సంసార జీవనానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. మొదటి మూడు నెలలు భార్యాభర్త కలిస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టీ శృంగారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తారు.

అప్పుడు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి

అప్పుడు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి

అలాగే చివరి రెండు నెలలు కలవడం వలన రక్త స్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కాన్పుకావడం కష్టంకావచ్చు. అలాగే ముందుగా ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. ఇది తల్లీబిడ్డకు క్షేమం కాదు. అందుకే సంసార జీవనం విషయంలో నిబంధన ప్రకారం ఉండాలని కూడా వైద్యులు చెబుతారు.

సెక్స్ చేయనిదే నిద్రపట్టదు

సెక్స్ చేయనిదే నిద్రపట్టదు

గర్భిణీ అయిన తన భార్యతో సెక్సు చేయడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం అని భర్తలు కూడా విని ఉంటారు. కానీ సమస్య ఏంటంటే... భార్యతో సెక్స్ చేయనిదే చాలామంది భర్తలకు నిద్రపట్టదు. అలాంటి సందర్భంలో ఆప్షన్ కోసం వెతుకుతారు.

పరిచయం ఉన్న వారితో శృంగారం

పరిచయం ఉన్న వారితో శృంగారం

దీంతో భర్త తనకున్న పరిచయం ఉన్న స్త్రీలతో మాట్లాడానికి ప్రయత్నిస్తాడు. వారితో చనువుగా ఉంటాడు. వీలైతే శృంగారంలో కూడా పాల్గొంటాడు. దీంతో వివాహేతర సంబంధాలు ఏర్పడతాయి. తన భార్యకు బిడ్డ పుట్టాక కూడా ఈ వివాహేతర సంబంధం ఒక్కోసారి అలాగే కొనసాగుతుంది. ఫలితంగా సంసారాలు విచ్చన్నం అవుతాయి.

భార్య జాగ్రత్తగా ఉండాలి

భార్య జాగ్రత్తగా ఉండాలి

భార్య భర్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీ భర్తపై ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే అతన్ని పూర్తిగా పట్టించుకోకుంటే మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. మీరు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లినా కూడా అతనితో తరుచుగా మాట్లాడుతూ అతను ఏం చేస్తున్నాడో కనుక్కుంటూ ఉండండి.

శృంగారంలో పాల్గొనొచ్చు అట

శృంగారంలో పాల్గొనొచ్చు అట

అయితే కొంతమంది డాక్టర్లు చెప్పేదేమిటంటే ఎక్కువ ఒత్తిడి చేయకుండా నెలలు నిండే వరకూ కూడా శృంగారంలో పాల్గొనొచ్చు అట. అయితే గర్భం దాల్చిన తర్వాత స్త్రీల వాంఛల్లో తేడాలు రావచ్చు. కాబట్టి వీటి గురించి దంపతులు మనసు విప్పి మాట్లాడుకోవటం ఉత్తమం.

వీళ్లు సెక్స్ లో పాల్గొనకపోవడం ఉత్తమం

వీళ్లు సెక్స్ లో పాల్గొనకపోవడం ఉత్తమం

తరచుగా గర్భస్రావాలు అవుతున్నవారు, యోని నుంచి రక్తస్రావం, మాయ ముందుకుండటం, నొప్పుల వంటి ఇతరత్రా సమస్యలున్నవారు మాత్రం శృంగారానికి దూరంగా ఉండటం మంచిది.

English summary

Why do men cheat, especially when their wives are pregnant?

why do men cheat especially when their wives are pregnant
Story first published: Wednesday, January 10, 2018, 9:37 [IST]