Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీది ప్రేమ వివాహమా? మీ అరచేతిలోని ఈ రేఖల ద్వారా తెలుసుకోండి
మీది ప్రేమ వివాహమా? మీ అరచేతిలోని ఈ రేఖల ద్వారా తెలుసుకోండి
ప్రేమ మరియు పెళ్లి అనేవి ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు. ఈ రెండిటి కలయిక అనేది మహాద్భుతంగా మారుతుంది. ప్రేమకు అలాగే పెళ్ళికి పరిపూర్ణత లభిస్తుంది. మీరు అవివాహితులైతే మీరు ఈ పాటికే మీ వివాహం గురించి ఎన్నో కలలు కంటూ ఉండుంటారు. ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అని ఆలోచనలో ఉండుంటారు. ఈ విషయంలో మీ సందేహాన్ని మీ అరచేతులలోని రేఖలు నివృత్తి చేస్తాయి. వృత్తి గురించి అలాగే ప్రవర్తన గురించి ఎన్నో విషయాలను అరచేతిలో రేఖలు స్పష్టం చేస్తాయి. అదే విధంగా వివాహం గురించి కూడా రేఖలు స్పష్టం చేస్తాయి. అలాగే మీ వైవాహిక జీవితం గురించి కూడా వివరిస్తాయి.
మ్యారేజ్ లైన్:
మొదటగా, మ్యారేజ్ లైన్ గురించి తెలుసుకుందాం. ఇది చిటికెన వేలి కింద ఉంటుంది. ఈ రేఖ అరచేతి వెనుక నుంచి ప్రారంభమయి అరచేతిలోకి చిటికెన వేలి కిందకు చేరుతుంది. ఈ లైన్ సాధారణంగా పొట్టిగా ఉంటుంది. లోతుగా ఉంటుంది. ఈ లైన్ లో చిన్నపాటి వేరియేషన్స్ ను గమనించవచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ఈ చిన్నపాటి తేడాలే పెద్ద పెద్ద విషయాలను తెలుపుతాయి.

హార్ట్ లైన్:
ప్రేమ వివాహం గురించి అరచేతులలోని రేఖలను పరిశీలించే ముందు మీరింకొక రేఖ గురించి తప్పక తెలుసుకోవాలి. అదే హార్ట్ లైన్. ఈ హార్ట్ లైన్ అనేది అరచేతులలోని ముఖ్యమైన రేఖ.
ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అలాగే స్వభావం గురించి ఈ రేఖ తెలియచేస్తుంది. అంతేకాక, లవ్ లైఫ్ గురించి కూడా ఈ రేఖ స్పష్టంగా వివరిస్తుంది. నిజానికి, హృదయంలోంచే కదా ప్రేమ పుట్టేది. అందుకే, హార్ట్ లైన్ కి లవ్ లైఫ్ కి సంబంధం ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు వివాహం చేసుకోగలుగుతారా? మీరిద్దరూ కలిసి ఆనందమయ జీవితాన్ని గడుపుతారా? మీ ఇద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలుస్తారా? ఈ ప్రశ్నలనేవి ప్రేమలో పడిన వారిని నిత్యం వేధించటం సహజం. ఈ ప్రశ్నలకి సమాధానం అనేది మ్యారేజ్ లైన్ అలాగే హార్ట్ లైన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఈ రెండు లైన్స్ ని కాస్తంత గమనించాలి.
మీ ప్రేమ వివాహం విజయవంతమవుతుందా లేదా అన్న విషయం ఈ రెండు లైన్స్ ని పరిశీలించడం ద్వారా తెలుస్తుంది. మీ ప్రేమకథ గమ్యాన్ని చేరుకుంటుందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విషయానికి సంబంధించిన వివిద సందర్భాల గురించి పామిస్ట్రీలో ప్రస్తావించబడింది. వాటిని ఈ కింద వివరించాము.

1. హార్ట్ లైన్ కి అలాగే మ్యారేజ్ లైన్ కి దూరం ఎక్కువగా ఉన్నట్టయితే,
1. హార్ట్ లైన్ కి అలాగే మ్యారేజ్ లైన్ కి దూరం ఎక్కువగా ఉన్నట్టయితే, ఆ వ్యక్తికి త్వరగా వివాహం జరుగుతుంది. ఇరవై ఏళ్ళ కంటే ముందుగానే వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన భాగస్వామిని తానే ఎంచుకుని ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలున్నాయి.

మ్యారేజ్ లైన్ ప్రారంభంలో ఏదైనా పర్వతం లేదా కొండ వంటి చిహ్నాలు ఉంటే
2. మ్యారేజ్ లైన్ ప్రారంభంలో ఏదైనా పర్వతం లేదా కొండ వంటి చిహ్నాలు ఉంటే ఆ అమ్మాయి అపార్థాల కలయికతో వివాహ జీవితంలోకి ప్రవేశిస్తుందని పామిస్ట్రీ చెప్తోంది.

మ్యారేజ్ లైన్ అనేది హార్ట్ లైన్ తో కలిసి కిందకి వెళ్లినట్లుగా ఉండటమనేది
3. అదే విధంగా, మ్యారేజ్ లైన్ అనేది హార్ట్ లైన్ తో కలిసి కిందకి వెళ్లినట్లుగా ఉండటమనేది అనేక సమస్యలను తెలియచేస్తుంది. ప్రేమ వివాహం అయినప్పటికీ, వైవాహిక జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదురుకోవలసి వస్తుందని ఈ రేఖల కలయిక తెలుపుతుంది.

మ్యారేజ్ లైన్ వద్ద త్రిశూలం వంటి చిహ్నాలని మీరు గమనిస్తే
4. మ్యారేజ్ లైన్ వద్ద త్రిశూలం వంటి చిహ్నాలని మీరు గమనిస్తే ఇది శుభసూచకం. ఆ వ్యక్తి ప్రేమ వివాహాన్ని చేసుకోవడటం జరుగుతుంది. అలాగే, ఆ వ్యక్తి వైవాహిక జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది.

ఒకవేళ, మీరు ఎంచుకున్న భాగస్వామితో మీ వివాహం జరిగిన తరువాత
5. ఒకవేళ, మీరు ఎంచుకున్న భాగస్వామితో మీ వివాహం జరిగిన తరువాత మీ భాగస్వామికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే? ఈ విషయాన్ని కూడా అరచేతులలోని రేఖల ద్వారా తెలుసుకోవచ్చు. మ్యారేజ్ లైన్ వద్ద చదరం వంటి చిహ్నం కనిపిస్తే భాగస్వామికి ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కలవు.



Click it and Unblock the Notifications
