Latest Updates
-
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.!
వామ్మో! 3 రోజులు ప్రేయసితో.. 3 రోజులు భార్యతో గడిపేలా ఒప్పందం... చివరికి ఏమైందో తెలిస్తే షాకవుతారు...!
భార్య, ప్రియురాలితో చెరో మూడు రోజులు గడిపే ఛాన్స్ కొట్టిన భర్త స్టోరీ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ అనేది అనివార్యం. కొందరికి తొలి ప్రేమ జీవితాంతం నిలిస్తే.. మరికొందరికి మాత్రం అనుకోని కారణాల వల్ల బంధం మధ్యలోనే ఆగిపోతుంది.

అయితే అలా విడిపోయిన వ్యక్తులు మళ్లీ తిరిగి కలిస్తే? మనసులో ఏదో అలజడి రేగినట్టు అనిపిస్తుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మీ అందరికీ శోభన్ బాబు, వాణిశ్రీ, శారద కలిసి నటించిన 'ఏవండీ ఆవిడొచ్చింది' సినిమా గుర్తుండే ఉంటుంది.

ఆ సినిమాలో హీరో శోభన్ బాబు మూడు రోజులు వాణిశ్రీతో.. మరో మూడు రోజులు శారద ఇంట్లో.. గడిపేస్తూ ఉంటాడు. ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం.. సూపర్ డూపర్ హిట్ కూడా.. అయితే అచ్చం అలాంటి సీనే రియల్ లైఫ్ లోనూ చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి మూడు రోజులు ప్రియురాలితో.. మరో మూడు రోజులు భార్యతో గడిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా పోలీసుల సమక్షంలో ఇది జరగడం మరో విశేషం. ఇంతటి విచిత్రకరమైన సంఘటన ఎప్పుడు.. ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికి ముందు..
మన సినిమాల్లో చూపినట్టు పెళ్లికి ముందు చాలా మంది ప్రేమలో పడుతూ ఉంటారు. అయితే అనుకోని కారణాల వల్ల లేదా పెద్దల ఒత్తిడితో ప్రేమ పెళ్లి చేసుకోలేకపోతారు. ప్రేమను త్యాగం చేస్తూ ప్రేమించిన వారిని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు.

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..
డైలీ జాగరణ్ ప్రకారం, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో రాజేష్ అనే ఒక యువకుడు పెళ్లికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమను మరచిపోలేక..
అయితే పెళ్లి జరిగినప్పటికీ.. ప్రేమను మరచిపోలేక.. తనతో ఆ రిలేషన్ కొనసాగించడం మొదలెట్టాడు. అయితే ఆ విషయం గుట్టుగా సాగిస్తుండగా.. ఓ రోజు రాజేష్ తన భార్య మరియు బిడ్డను వదిలి ప్రియురాలితో పారిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అదే సమయంలో తన ప్రియురాలు కూడా ఆ వ్యక్తిపై ఆమెను అపహరించినట్లు కేసు పెట్టింది.

అదిరే ఒప్పందం..
దీంతో ఆ పంచాయతీ కాస్త పోలీసుస్టేషన్ కు చేరింది. అప్పుడు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసుల సమక్షంలో భార్య తన ప్రియురాలు ఒక ఒప్పందానికి వచ్చారు. అచ్చం మన తెలుగు సినిమా ‘ఏవండీ ఆవిడొచ్చింది'లో మాదిరిగా మూడురోజులు ప్రేయసితో, మరో మూడు రోజులు భార్యతో.. మిగిలిన ఒకరోజు మాత్రం తనకు నచ్చిన విధంగా గడిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఆ ఒక్కరోజు అతనికి సెలవు రోజు.

కొంత కాలమే..
ఈ ఒప్పందం ప్రకారం, వారు ముగ్గురు హాయిగా కాపురం చేసుకుంటున్నారనుకునే లోపే.. కథ మొత్తం అడ్డం తిరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది తన ప్రియురాలు. ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ తన ప్రియురాలు మరోసారి రాజేష్ పై ఫిర్యాదు చేసింది.

లైంగిక వేధింపులు..
తన ప్రియురాలు రెండో వివాహం చేసుకోవాలని రాజేష్ పై ఒత్తిడి తెచ్చింది. అందుకు తను ఒప్పుకోకపోవడంతో.. తనపై వివాహ ఆరోపణలు, లైంగిక వేధింపుల పేరిట ఆరోపణలు చేసింది. దీంతో అక్కడి పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ తర్వాత అతనికి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఉన్నది పోయి..
అలా ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడికి చివరికి క్రిష్ణుడి జన్మస్థలమే చిరునామాగా మారిపోయింది. అప్పటివరకూ మూడు రోజులు భార్యతో.. మరో మూడు రోజులు ప్రియురాలితో ఎంజాయ్ చేసిన ఆ వ్యక్తికి ఆ ముచ్చట మూణ్ణాళ్లలోనే ముగిసిపోయింది.



Click it and Unblock the Notifications